వైసీపీ ఎంపీ, యువ నాయకుడు, సీఎం జగన్‌కు తమ్ముడు వరుస అయ్యే.. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఇప్పటికే ఆయనకు నోటీసులు స్వయంగా అందించింది. విచారణకు రావాలని .. కోరింది. అయితే, ఆయన మాత్రం ఐదు రోజుల పాటు గడువు కోరారు. ఇది.. ఇప్పటి వరకు తెలిసిన విషయం. అయితే.. విదేశాలకు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారని సీబీఐకి ఉప్పందడంతో అలెర్టయింది.
ఐదు రోజులు కాదు.. ఐదు గంటలు కూడా సమయం ఇచ్చేది లేదంటూ.. సీబీఐ అధికారులు వెంటనే కోర్టును ఆశ్రయించి అరెస్టు వారెంట్ తీసుకున్నారని తెలిసింది. దీనిని తీసుకుని హుటాహుటిన కడపకు చేరు కున్నట్టు సమాచారం. స్థానిక పోలీసుల సహకారంతో ఎంపీ అవినాష్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చి విచారించనున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మంగళవారం హైదరాబాద్కు వచ్చి తమకు సహకరించాలని సీబీఐ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీనికి ప్రతిగా తాను ఎంపీ హోదాలో ఉన్నందున.. వచ్చేందుకు కుదరదని.. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకున్నానని.. ఎంపీ అవినాష్ చెప్పుకొచ్చారు. అయితే, దీనిపై సీబీఐ స్పందించే లోగానే.. అవినాష్ రెడ్డి విదేశాలకు వెళ్లిపోవాలాని ప్రయత్నిస్తున్నట్టు సీబీఐవర్గాలకు అనుమానం వ్యక్తమైంది.
దీంతోహుటాహుటిన సీబీఐ బృందాలు కడపకు చేరుకున్నాయి. స్థానిక పోలీసులను తీసుకుని అరెస్టు వారంత్‌తో సహా కడపలో జల్లెడపడుతున్నట్టు తెలుస్తోంది. ఏక్షణమైనా అవినాష్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ అరెస్టు చేయకపోతే.. వెంటనే ఆయన నుంచి పాస్ పోర్టు ను సీజ్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates