Political News

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి ఇంకా పాపులర్. పాలమ్మినా..పూలమ్మినా అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత తన మార్క్ డైలాగులతో, మాటలతో మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, తాజాగా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. అవును మీరు విన్నది నిజమే..మల్లారెడ్డి …

Read More »

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం 18 గంట‌ల పాటు తిరుగుతూనే ఉంటాయి. పైగా.. ఈ ఏడాది గ‌తంలో క‌న్నా ఎక్కువ‌గానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతాయ‌ని అధికారులు ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో విద్యుత్ వినియోగం, నిరంత‌రాయ స‌ర‌ఫ‌రా వంటివి ప్ర‌భుత్వాల‌కు క‌త్తిమీద సాముగా మారాయి. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ధ‌ర‌లు …

Read More »

కావూరి సాంబ‌శివ‌రావు మృతి.. తెలుసుకోవాల్సింది ఏంటంటే!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు.. బుధ‌వారం ఉద‌యం మృతి చెందారు. గ‌త కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ.. క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 82 సంవ‌త్స‌రాలు. కాంగ్రెస్ పార్టీతోనే ఆయ‌న రాజ‌కీయాలు ప్రారంభించారు. ఆ పార్టీలోనే అంచెలంచెలుగా ఎదిగారు. మ‌చిలీప‌ట్నం, ఏలూరు పార్ల‌మెంటు స్థానాల నుంచి 5 సార్లు(25 సంవ‌త్స‌రాలు) ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లో అజాత శ‌త్రువుగా …

Read More »

వైజాగ్ మీద అంత కోపమెందుకు జగన్?

ఏపీ మాజీ సీఎం జగన్ కు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఏపీ యువతకు విశాఖలోనే దిగ్గజ కార్పొరేట్ కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు రావడం జగన్ కు నచ్చడం లేదా? తన హయాంలో ఏపీకి రాని కంపెనీలు…చంద్రబాబును చూసి ఏపీకి క్యూ కట్టడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తుంది. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ను అడ్డుకునేందుకు …

Read More »

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10 మంది ఎమ్మెల్యేలు మద్దతునివ్వడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా..త్వరగా తేల్చాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన గడ్డం ప్రసాద్… తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా …

Read More »

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు.. ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. వాస్త‌వానికి ఈ నెల 16న ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. పోటీలో ఎవ‌రూ లేక‌పోవ‌డం.. ఉన్న రెండు సీట్ల‌కు ఇద్ద‌రే నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో రిట‌ర్నింగ్ అధికారి తాజాగా.. వారిని ఎన్నుకున్న‌ట్టు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇచ్చారు. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు …

Read More »

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయాలని పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఆదేశించడంతో హోటల్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. గ్యాస్ లేకపోవడంతో వ్యాపారం కొనసాగించడం కష్టమవుతోందని వారు చెబుతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన ముంబయి, దిల్లీ, బెంగళూరులో పలు చిన్న హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల వంట చేయడం సాధ్యం …

Read More »

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో, కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. …

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఇప్పట్లో ముగింపు లేదా?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ లను విచారణ జరిపారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్, తెలంగాణ మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు భారీ …

Read More »

స‌భ్య‌త్వం సౌండ్ లేదు సైనికా

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాన్ని గత నెల‌లోనే ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మానికి `ఉద్య‌మి` అనే పేరును పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ త‌ర‌ఫున నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు ఉద్య‌మి స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మాన్ని జోరుగా ముందుకు తీసుకువెళ్లాల‌ని స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మం ప్రారంభం రోజునే పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. దీనిని అప్ప‌ట్లో నాయ‌కులు కూడా …

Read More »

మార‌క‌పోతే మార్చేస్తా.. త‌మ్ముళ్ల‌కు బాబు హెచ్చరిక‌

పార్టీ విధానాల‌కు, సిద్ధాంతాల‌కు అనుగుణంగా నాయ‌కులు ప‌నిచేయాల‌ని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు క‌లివిడిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు టీడీపీ నాయ‌కుల‌కు సూచించారు. నంద్యాల జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. సోమ‌వారం సాయంత్రం పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో పార్టీ నాయ‌కుల వ్య‌వ‌హార‌ తీరుపై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో కూట‌మి పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేద‌ని వ‌స్తున్న నివేదిక‌ల‌ను కూడా వారి ముందు ఉంచి.. ప్ర‌శ్నించారు. “ఇలా అయితే..ఊరుకునేది …

Read More »

బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని.. దీనికి మ‌హిళ‌లు కూడా సిద్ధంగా ఉండాల‌ని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా అమ‌రావ‌తిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలోనే చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టిస్తామ‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు అయ్యేందుకు మ‌హిళ‌లు ఇప్ప‌టి నుంచే రెడీ కావాల‌ని కూడా చంద్ర‌బాబు …

Read More »