Political News

ముందు ఈ సంగ‌తి చూడండి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కామ్రెడ్స్ లేఖ‌!

‘ముందు ఈ సంగ‌తి చూడండి’.. అంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి సీపీఎం ఏపీ కార్య‌ద‌ర్శి వి. శ్రీనివాస‌రావు సుదీర్ఘ లేఖ సంధించారు. “మీ అవ‌స‌రానికి రాజకీయాల‌ను వాడుకుంటున్నారు. కానీ, మీ అవ‌స‌రం ఉంది.. ప్ర‌స్తుతం పంచాయతీల్లో.. ముందు ఈ సంగ‌తి చూడండి.” అని వ్యాఖ్యానించారు. పంచాయ‌తీలు ప్ర‌స్తుతం కోలుకునే ద‌శ‌లో లేవ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా 1121 కోట్ల రూపాయ‌ల‌ను పంచాయ‌తీల‌కు ఇచ్చింద‌ని.. ఈ …

Read More »

‘కేసీఆర్ స్వార్థ జీవి… నేను అమ్ముడు పోలేదు’

బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు కూడా కాకముందే ఆ పార్టీ తాజా మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్‌పైనా, తనను టార్గెట్ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను స్వార్థ జీవిగా గువ్వల అభివర్ణించారు. కేసీఆర్ స్వార్థానికి తాను బలి అయ్యానన్నారు. తనను అసమర్థ నాయకత్వం ఓడించిందంటూ బీఆర్‌ఎస్ అధిష్ఠానంపై నిప్పులు చెరిగారు. …

Read More »

ఏపీలో కొత్త జిల్లాలు.. నెల రోజులే డెడ్‌లైన్‌!

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను 32 జిల్లాలుగా మార్చాల‌ని నిర్ణ‌యించింది. అయితే.. దీనికి సంబంధించిన క‌స‌ర‌త్తును నెల రోజుల్లోగా పూర్తి చేయాల‌ని తాజాగా సీఎం చంద్రబాబు డెడ్‌లైన్ విధించారు. వాస్త‌వానికి కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల‌కు ప్ర‌జ‌ల అభిరుచులు, డిమాండ్ల‌కు అనుగుణంగా పేర్ల మార్పు వంటివాటిపై క‌స‌ర‌త్తు చేసేందుకు మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని ఇటీవ‌ల నియ‌మించారు. ఈ వ్య‌వ‌హారంపై …

Read More »

వారికి ఉచిత బ‌స్సు.. వీరికి ఉచిత విద్యుత్‌: ఏపీ కేబినెట్

సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో భేటీ అయిన ఏపీ మంత్రివ‌ర్గం.. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. మ‌హిళ‌ల‌కు ఈ నెల 15 నుంచి ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాన్ని చేరువ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా.. మంత్రివ‌ర్గంలో చ‌ర్చించి తీసుకునే నిర్ణ‌యానికి మ‌రింత వాల్యూ ఉంటుంది. అందుకే.. కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్నారు. అలానే.. నాయీ బ్రాహ్మ‌ణులు న‌డిపే సెలూన్ల‌కు.. ప్ర‌స్తుతం ఉన్న 150 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను …

Read More »

జ‌గ‌న్ చేయ‌ని రాజ‌కీయం.. చంద్ర‌బాబు చేస్తే..!

రాజకీయాలు అందరూ చేస్తారు. బ్యాలెన్స్ రాజకీయాలను చేయటం అనేది నాయకులకు చాలా ముఖ్యం. ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవడం అనేది అధికారంలో ఉన్నవారికి మరింత అవసరం. ఈ క్రమంలో కొంత బ్యాలెన్స్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. నాణానికి ఒకవైపు మాత్రమే చూస్తూ ఉంటే రెండోవైపు దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుంది. ఇది అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకైనా చాలా కీలకం. ఈ విషయంలో టిడిపి అధినేత సీఎం …

Read More »

సింగ‌పూర్‌ను సైతం బెదిరించిన వైసీపీ: చంద్ర‌బాబు

వైసీపీ నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమ‌రావతి రూప‌క‌ల్ప‌నలో కీల‌క పాత్ర పోషించిన సింగ‌పూర్‌ను సైతం వైసీపీ నాయ‌కులు బెదిరించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌రావతిని ప‌క్క‌న పెట్ట‌డం.. అరాచ‌కాలు సృష్టించ‌డంతో సింగ‌పూర్ ప్ర‌భుత్వం భ‌య ప‌డిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. అంతేకాకుండా.. వైసీపీ మంత్రులు కొంద‌రు సింగ‌పూర్‌కు వెళ్లి.. అక్క‌డి వారిని బెదిరింపుల‌కు గురిచేశార‌ని అన్నారు. దీంతో సింగ‌పూర్‌కుచెందిన కంపెనీలు, పెట్టుబ‌డులు కూడా వెన …

Read More »

‘ఎంఐఎం కోసం రేవంత్ ఆరాటం’

తెలంగాణ‌లో బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను 42 శాతానికి పెంచుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును రాష్ట్ర‌ప‌తి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదించ‌లేదు. మ‌రోవైపు.. గ‌వ‌ర్న‌ర్ ఆర్డినెన్స్ జారీ చేసినా.. దాని ప్ర‌కారం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోం ది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వంలోని మంత్రులు.. ఢిల్లీలో ధ‌ర్నాకు దిగారు. పార్ల‌మెంటులో అయినా .. రిజ‌ర్వేష‌న్‌ను ఆమోదించేలా నిర్ణ‌యం …

Read More »

వైసీపీ 2.0… జ‌గ‌న్ అనుకున్నంత ఈజీయేనా ..!

రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు, పార్టీల అధినేత‌ల‌కు అనేక ఊహ‌లు ఉండొచ్చు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. అస లు ఈ ఊహ‌లు కూడా ఉండాలి. అయితే.. క‌ర్ర విడిచి సాము చేస్తే మాత్రం అది ప్ర‌మాద‌క‌రంగా మారు తుంది. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇలాంటి సామునే ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ఒక‌వైపు కూట‌మి స‌ర్కారు ఉరుకులు.. ప‌రుగులు పెట్టి ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఒక వైపు సంక్షేమం.. మ‌రోవైపు అభివృద్ధి …

Read More »

వివేకా కేసులో విచార‌ణ పూర్తి.. సీబీఐ ముందు బోలెడు ప్ర‌శ్న‌లు!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి 2019, మార్చి లో సొంత ఇంట్లోనే దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసులో సీబీఐ.. విచార‌ణ పూర్త‌యింద‌ని.. ఇక‌, తాము వ్య‌క్తిగ‌తంగా చేయాల్సిన విచార‌ణ అంటూ.. లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఈ మేర‌కు సుప్రీంకోర్టు లో అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేసింది. ఇదేస‌మ‌యంలో “మీరు మ‌రోసారి విచార‌ణ చేయ‌మంటే“ అం టూ.. …

Read More »

అమ‌రావ‌తికి తొలగుతున్న బంధ‌నాలు..

ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకున్న అమ‌రావ‌తి రాజ‌ధాని వ్య‌వ‌హారంలో ఇటీవ‌ల కొన్నాళ్లుగా స‌మ‌స్యలు వ‌చ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున అన్ని వ‌ర్గాల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అదే.. రాజ‌ధానికి అద‌న‌పు భూ స‌మీక‌ర‌ణ‌. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో ప్ర‌భుత్వానికి 33 వేల ఎక‌రాల ల్యాండు బ్యాంకు ఉంది. అయితే.. భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం అంటూ.. మ‌రో 44 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించేందుకు స‌ర్కారు రెడీ అయింది. ఇదే వివాదానికి దారితీసింది. …

Read More »

ఏడాది దాటింది.. జ‌న‌సేన ‘రివ్యూ’ చేసిందా ..!

అధికారంలోకి వ‌చ్చిన పార్టీకి ఎప్ప‌టిక‌ప్పుడు రివ్యూ అవ‌స‌రం. ఎందుకంటే.. త‌ప్పులు ఎక్క‌డైనా జ‌రుగుతుంటే.. వాటిని స‌రిదిద్దుకునేందుకు.. నాయ‌కుల‌ను లైన్‌లో పెట్టుకుని ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు ఈ రివ్యూ దోహ‌ద ప‌డుతుంది. అందుకే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర‌చుగా రివ్యూలు చేస్తారు. ఐవీఆర్ఎస్ స‌హా.. ఇత‌ర మాధ్య‌మాల్లో ప్ర‌జ‌ల నుంచి కూడా పార్టీ నేత‌ల‌పై అభిప్రాయాలు తెలుసుకుంటారు. త‌ద్వారా త‌ప్పులు జ‌రిగిన చోట స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. దీనిని కొంద‌రు …

Read More »

దిగజారి బ్రతకలేనంటోన్న రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత పోరు కొత్త కాదు. అయితే, ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనప్పటి నుంచి సీనియర్ నేతలు అందరూ కాస్త గుర్రుగా ఉన్నారు. ఇక, మంత్రివర్గ విస్తరణ సమయంలో కొంతమంది సీనియర్ నేతలను, కాంగ్రెస్ వాదులను కాదని కొత్త వారికి మంత్రి పదవులివ్వడం కూడా చాలామందికి నచ్చలేదు. ఆ జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో కొంతకాలంగా …

Read More »