ఏపీకి కొత్తగా నియమితులైన గవర్నర్.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ సయ్యద్ నజీర్. ఎన్నికలకు ఖచ్చితంగా ఏడాది సమయం ఉందనగా.. ఏపీలో జరిగిన కీలకమార్పుగా పరిశీలకులు అంచ నా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంలో వైసీపీ విజృంభించి గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆ పార్టీకి అత్యంత కీలకం. అదేసమయంలో ప్రతిపక్షాలకు కూడా అంతే కీలకం.
దీంతో ఈ రెండు విషయాలను పరిశీలిస్తే.. అంటు.. అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం విషయాలు పరిశీలిస్తే.. ఈ రెండు కూడా గవర్నర్‌కు కీలక సవాళ్లుగా మారనున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తుంగ లో తొక్కారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఒకవైపు.. కాదు.. ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని చెబుతున్న వైసీపీ నేతలు మరో వైపు ఉన్నారు. ఇంకోవైపు.. ఎన్నికలకు ముందు.. ఎలాంటి ధర్నాలు, చేయకుండా జీవో 1ని తీసుకువచ్చారని కూడా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇక, ఎన్నికల్లో కీలకమైన హామీగా ఉంటుందని భావిస్తున్న మూడు రాజధానుల విషయాన్ని కూడా.. సాధించేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే త్వరలోనే విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది రాజకీయంగానే కాకుండా.. చట్టపరంగా.. రాజ్యాంగం పరంగా కూడా ఇబ్బందులు రావడం తథ్యం. ఈ క్రమంలో గవర్నర్ ఎలా నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది.
ఇలా.. మొత్తంగా చూసుకుంటే.. ఏపీకొత్త గవర్నర్ జస్టిస్ నజీర్‌కు ఈ రెండు విషయాలు.. వచ్చే ఎన్నికలు.. రాజధాని అంశం కూడాస వాలుగా మారనుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎలా ముందుకు సాగుతారు? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఈ పరిణామాలపైనే వచ్చే ఎన్నికలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి చూడాలి ఏం జరుగుతుందో!!