బాబు ‘కేబినెట్’ నిండిపోయింద‌ట‌.. త‌మ్ముళ్ల టాక్‌!!

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని సంగ‌తులు భ‌లే చిత్రంగా ఉంటాయి. ఇలాంటి ఓ చిత్ర‌మైన విష‌య‌మే.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌ర్కిళ్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే.. చంద్ర‌బాబు కేబినెట్ నిండిపోయింద‌ట‌! ప్ర‌స్తుతం పెద్ద ఎత్తున టీడీపీ స‌ర్కిళ్ల‌లో ఇదే చ‌ర్చ సాగుతోంది. ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది క‌దూ! ఇంకా ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు.. వైసీపీ వంటిబ‌ల‌మైన పార్టీని ఓడించ‌లేదు. ప్ర‌జ‌లు ఓట్లు కూడా వేయ‌నేలేదు.

కానీ, టీడీపీ అధికారంలోకి ఎలా వ‌చ్చేస్తుంది? అనేది క‌దా.. అతిపెద్ద డౌటు. వ‌చ్చేసిందట‌. ముఖ్య‌మంత్రి, మంత్రులు.. ఇలా.. కేబినెట్ కూర్పు కూడా జ‌రిగిపోయింద‌ని .. టీడీపీ స‌ర్కిళ్ల‌లో యువ‌నేత‌లు.. వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇంత‌కీ.. టీడీపీ నేత‌లు చెప్పుకొంటున్న కేబినెట్ ను మ‌నం కూడా తెలుసుకుందాం ..ప‌దండి! ముఖ్య‌మంత్రి- నారా చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం-ఐటీ- ప‌రిశ్ర‌మ‌లు- నారా లోకేష్‌, ఆర్థిక మంత్రి- య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.

హోం మంత్రి- కింజ‌రాపు అచ్చెన్నాయుడు(గ‌తంలో శ‌ప‌థం చేశాడు క‌దా!). మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి ఏలూరి సాంబ‌శివ‌రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీద ర‌విచంద్ర‌, విద్యా శాఖ క‌న్నా ల‌క్ష్మీనారా య‌ణ‌, వ్య‌వ‌సాయం కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, రోడ్లు భ‌వ‌నాలు-అమ‌ర్నాథ్‌రెడ్డి, గ‌నులు-ప‌రిటాల సునీత‌, మైనార్టీ సంక్షేమ శాఖ అజీజ్‌,

ర‌వాణా శాఖ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి.. ఇలా.. టీడీపీ కేబినెట్ మొత్తం ఫుల్ అయిపోయింద‌ని.. తెలుగు త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతున్నారు. వాస్త‌వానికి ఇది నిజం కాక‌పోయినా.. ఆయా సంద‌ర్భాల్లో నాయ‌కులు చేసిన ప్ర‌తిజ్ఞలు.. చంద్ర‌బాబు వ్యూహం వంటివి ప‌రిశీల‌న‌లోకి తీసుకుని.. ఇలా ప్ర‌చారం చేస్తున్నార న్నమాట‌.ఈ పేర్ల‌లోనూ అనేక మందికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చే ఛాన్స్ ఖ‌చ్చితంగా ఉండ‌డం విశేషం.