Trends

ఆస్ట్రేలియా దెబ్బ.. ఫైనల్స్ లో భారత్ ఉంటుందా?

భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అడిలైడ్ వేదికగా జరిగిన ఈ పోరులో భారత్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఈ పరాజయం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం చూపింది. రెండుసార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది. ఈ ఓటమితో టీమిండియా పాయింట్ల శాతం (పీసీటీ) 57.29కి పడిపోయింది. ఈ సారి ఆస్ట్రేలియా …

Read More »

క్రిస్మస్ తాత అసలు ముఖం ఎలా ఉంటుందో చూపించిన శాస్త్రవేత్తలు…

క్రిస్మస్ పండగ వస్తుంది అంటే పిల్లలు ఎక్కువగా ఎదురుచూసేది ఒకే ఒక వ్యక్తి కోసం.. ఎర్రని దుస్తులు ధరించి తలపై తెల్లని కుచ్చుటోపి తో.. బోలెడు గిఫ్ట్లు మోసుకు వచ్చే శాంటా క్లాస్.

Read More »

13 ఏళ్ళ వైభవ్ వీరబాదుడు.. ఫైనల్ లో భారత్!

వైభవ్ సూర్యవంశి – గత కొన్ని రోజులుగా ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ అతన్ని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకుంది. దీంతో ఆ రేంజ్ ధరకు అమ్ముడైన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. బీహార్‌కు చెందిన ఈ యువ క్రికెటర్ ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్‌లో తన దూకుడైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యేకంగా శ్రీలంకపై సెమీఫైనల్‌లో 36 …

Read More »

దేశంలో బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ ఎంతో తెలుసా?

దేశంలో బిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ సంఖ్య 185కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం.. యుద్ధ భయాలు.. ఆర్థిక పరిస్థితులపై అయోమయ పరిస్థితులు నెలకొన్న వేళ.. వీటితో సంబంధం లేనట్లుగా సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గడిచిన పదేళ్లలో వీరి సంపన్నుల సంపద ఏకంగా 121 శాతం పెరిగినట్లుగా స్విట్జర్లాండ్ కు చెందిన అతి పెద్ద బ్యాంక్యూబీసీ వెల్లడించింది. బిలియనీర్ల సంపదపై వార్షిక నివేదికను …

Read More »

అల్లరి చేస్తున్న పిల్లల్ని మందలించిన టీచర్ పై దాడి.. ఆపై మృతి

షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. అల్లరి చేసే విద్యార్థులను మందలించటం టీచర్లు మామూలుగా చేసే పని. అలా చేయటమే ఒక టీచర్ ప్రాణాలు పోయేలా చేసింది. దీనికి ఏపీలోని అన్నమయ్య జిల్లా వేదికైంది. జిల్లాలోని రాయచోటికిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రవర్తన సరిగా లేని విద్యార్థులను మందలించిన టీచర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 42 ఏళ్ల టీచర్ ఏజాష్ అహ్మద్ ఒక క్లాస్ లో పాఠాలు చెబుతున్నారు. …

Read More »

ప్రపంచంలో చెత్త ఎయిర్ లైన్స్ లో ఇండిగో ర్యాంకు

మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో తోపు ఎయిర్ లైన్స్ అన్నంతనే గుర్తుకు వచ్చేది ఇండిగో. దేశీయంగా ఎయిర లైన్స్ నిర్వహణలో ఆ సంస్థకు చెందిన విమానాలే భారీగా ఉండటం తెలిసిందే. దేశీయంగా రూట్ ఏదైనా.. ఇండిగో విమానాలు పది ఉంటే.. మిగిలిన అన్నీ ఎయిర్ లైన్స్ విమానాలు కలిసి ఐదు కూడా ఉండని దుస్థితి. దీంతో.. ఇండిగో తప్పించి మరో గత్యంతరం లేకుండా పోయింది. ఇండిగో ఎంత చెత్త …

Read More »

మెస్మరైజింగ్ లుక్స్ తో క్లీన్ బౌల్డ్ చేస్తున్న ఆషిక…

2016 లో క్రేజీ బాయ్ అనే కన్నడ మూవీ తో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది అషికా రంగనాథ్. 2023 లో కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైంది.నా సామి రంగా,అవతార పురుష 2,02 చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు మిస్ యు మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది.

Read More »

భారత్‌లోనే వారిని ఓడించండి: షోయబ్ అక్తర్

పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చుట్టూ కొనసాగుతున్న వివాదంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో స్పందించారు. ఐసీసీ టోర్నీలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షరతులు పెట్టడం సరైంది కాదని అక్తర్ పేర్కొన్నారు. “భారత్‌లో మ్యాచ్‌లు ఆడకుండా తటస్థ వేదికలు కోరడం బదులు, వారిని వారి సొంతగడ్డపైనే ఓడించి రావాలి” అంటూ పీసీబీకి సలహా ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు ఐసీసీ ఆమోదం తెలిపినప్పటికీ, …

Read More »

కుమారుడుకి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించిన బైడెన్

రాజ‌కీయాల్లో ఎలా ఉన్నా..పాల‌న‌లో మాత్రం పార‌ద‌ర్శ‌కంగా ఉంటామ‌ని.. ప్ర‌పంచానికి సుద్దులు చెప్పే అగ్ర‌రాజ్యం అమెరికాలో తాజాగా అధ్య‌క్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణ‌యం దేశాన్ని, ప్ర‌పంచాన్ని కూడా కుదిపేస్తోంది. ఇదేస‌మ‌యంలో కాబోయే అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే.. ఏకంగా నిప్పులే చెరుగుతున్నారు. మ‌రో 50 రోజుల్లో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్ త‌న ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ట్రంప్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న జ‌న‌వ‌రి …

Read More »

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘర్షణ: 100మందికిపైగా మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశం గినియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి కారణమైంది. ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన జెరెకొరెలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్ల అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఒక జట్టు …

Read More »

సొంత గడ్డ కోసం కోట్లు వదులుకున్న తెలుగు క్రికెటర్!

నితీష్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్న తెలుగు క్రికెటర్ పేరిది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్.. తొలి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విలువైన పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఎనిమిది నెలల ముందు అనామకుడైన ఈ క్రికెటర్ ఇప్పుడు ప్రతిష్టాత్మక సిరీస్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని.. జట్టు విజయంలో కీలకంగా …

Read More »

పాకిస్థాన్‌లో ఆడే ప్రసక్తే లేదు.. కేంద్రం హెచ్చరిక

పాకిస్థాన్ వేదికగా 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై మరోసారి వివాదం చెలరేగింది. భారత ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేస్తూ, పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు సరిగాలేవని, టీమిండియా అక్కడ ఆడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. బీసీసీఐ ఇప్పటికే పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడటం సాధ్యమని చెప్పలేదని గుర్తు చేశారు. …

Read More »