Trends

ఛాలెంజ్ కోసం 10 వేల క్యాలరీల ఆహారం తీసుకుని…

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి, ఫాలోవర్లను పెంచుకోవాలనే తాపత్రయం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. రష్యాకు చెందిన 30 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ దిమిత్రి నుయాంజిన్ విషయంలో అదే జరిగింది. తన క్లయింట్స్ కోసం ఒక వెరైటీ ఎక్స్‌పెరిమెంట్ చేయబోయి, అనూహ్యంగా నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. ఫిట్‌నెస్ కోచ్‌గా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన అతను, ఇప్పుడు అందరికీ ఒక హెచ్చరికలా మారిపోయాడు. అసలు దిమిత్రి ప్లాన్ ఏంటంటే.. …

Read More »

స్మృతి మంధాన స్పందించాల్సిందే…

అంతా అనుకున్నట్లు జరిగితే భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లయిపోయి ఈపాటికి నాలుగు రోజులు అయ్యుండాలి. కానీ ఆదివారం మరి కొన్ని గంటల్లో పెళ్లి అనగా.. హఠాత్తుగా వేడుకలు ఆగిపోయాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలయ్యారని.. అందుకే పెళ్లి ఆగిందని.. ఆయన కోలుకున్నాక వివాహం జరుగుతుందని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ తర్వాతి రోజు నుంచి కథ కొత్త మలుపు తిరిగింది.  పెళ్లి …

Read More »

ఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి వస్తుంది

బంగాళాఖాతంలో వాతావరణం ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. అరుదైన తుఫాను ‘సెన్యార్’ ముప్పు మన దేశానికి తప్పింది అనుకునేలోపే, మరో కొత్త ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. రాబోయే 12 గంటల్లో ఇది కచ్చితంగా తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ IMD లేటెస్ట్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఒకవేళ ఇది తుఫానుగా మారితే దానికి ‘దిత్వ’ అని పేరు …

Read More »

స్మృతి కోసం పెద్ద త్యాగం చేసిన తన ఫ్రెండ్

క్రికెట్ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించే జెమీమా రోడ్రిగ్స్, నిజ జీవితంలో స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తానని నిరూపించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మహిళల ‘బిగ్ బాష్ లీగ్’ (WBBL) నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. బ్రిస్బేన్ హీట్ జట్టుకు కీలక ప్లేయర్ అయినా, ఇప్పుడు ఆట కంటే తన బెస్ట్ ఫ్రెండ్ స్మృతి మంధాన కుటుంబమే ముఖ్యమని ఫీల్ అయ్యింది. అందుకే లీగ్ మొత్తానికి గుడ్ బై చెప్పేసి, …

Read More »

44 మంది అగ్నికి ఆహుతి.. ఆ దేశంలో ఘోరం!

ఏషియన్ వరల్డ్ సిటీగా పిలుచుకునే హాంకాంగ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 44 మంది అగ్నికీలలకు ఆహుతి కాగా 250 మందికిపైగా ఆచూకీ తెలియలేదు. న్యూ టెరిటరీస్‌లోని థాయ్‌ పో జిల్లాలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయంలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే మిగతా అపార్ట్మెంట్ లకు విస్తరించాయి. మొదట 32 అంతస్తుల భవనం బయట మంటలు అంటుకున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన బాంబూ స్కాఫోల్డింగ్ …

Read More »

చేతికి వచ్చే జీతం తగ్గుతుందా? పీఎఫ్ పెరుగుతుందా?

దేశంలో ఎప్పటి నుంచో గజిబిజిగా ఉన్న 29 రకాల పాత కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం చెత్తబుట్టలో వేసి, వాటి స్థానంలో కేవలం 4 కొత్త ‘లేబర్ కోడ్స్’ తీసుకొచ్చింది. సంక్లిష్టంగా ఉన్న రూల్స్‌ని సింపుల్ చేసి, కంపెనీలకు, ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వడమే దీని ఉద్దేశం. వేజెస్ (జీతాలు), ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, సేఫ్టీ కోడ్.. ఇవే ఆ నాలుగు కొత్త పిల్లర్లు. ఇది కేవలం కంపెనీల కోసమే …

Read More »

బ్యాంక్ లను మోసం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?

హైదరాబాద్‌లో ఒక బార్ ఓనర్ అత్యాశ అతన్ని కటకటాల పాలు చేసింది. బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న ‘మల్లికా ఇన్ బార్ అండ్ రెస్టారెంట్’ యజమాని ఎల్. శ్రీనివాస్ గౌడ్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో అతనికి ఏకంగా ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పు చెప్పింది. బ్యాంకును బురిడీ కొట్టించి లక్షలు వెనకేసిన పాపానికి ఇప్పుడు జైలు ఊచలు …

Read More »

జ‌ల్సాల కోసం తుపాకీ అమ్మేసిన ఎస్సై!

ఆయ‌న పోలీసు అధికారి. స‌మాజాన్ని సరైన మార్గంలో న‌డిపించేందుకు పోలీసు విధుల‌ను స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించేస్థాయిలో ఉన్న సబ్ ఇన్స్‌పెక్ట‌ర్‌. బెట్టింగుల‌కు, జ‌ల్సాల‌కు పాల్ప‌డుతూ.. స‌మాజానికి ఇబ్బందిక‌రంగా ఉన్న వారిని దారిలో పెట్టాల్సిన గురుత‌ర బాధ్య‌త ఉన్న అధికారి!. కానీ.. తానే దారి త‌ప్పితే?! .. ఇక‌, స‌మాజం ప‌రిస్థితి ఏంటి?!. ఇప్పుడు అదే జ‌రిగింది. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అధికారే.. దారి త‌ప్పేశారు. ఆయ‌నే హైద‌రాబాద్‌లోని అంబ‌ర్ పేట స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ …

Read More »

చెన్నైకి 2.2 లక్షల వీసాలా? అమెరికాలో కలకలం రేపుతున్న ఆరోపణలు

అమెరికాలో H-1B వీసాల వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. అమెరికా మాజీ చట్టసభ సభ్యుడు, ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు కారణం. ఏడాదికి అమెరికా మొత్తం మీద మంజూరు చేయాల్సిన H-1B వీసాల పరిమితి కేవలం 85,000 మాత్రమే. కానీ, ఒక్క చెన్నై ప్రాంతం నుంచే ఏకంగా 2,20,000 వీసాలు పొందారని, ఇది స్పష్టంగా భారీ మోసమని ఆయన ఆరోపించారు. దేశం మొత్తానికి ఉన్న …

Read More »

పదవిపై గంభీర్ షాకింగ్ వ్యాఖ్యలు

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 0-2 తేడాతో వైట్‌వాష్ అవ్వడం భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. గత 25 ఏళ్లలో సఫారీలు మన గడ్డపై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ ఘోర పరాభవంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత, గంభీర్ మీడియా ముందుకొచ్చి చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన కోచింగ్ …

Read More »

పాకిస్థాన్ కంటే కిందకి టీమిండియా..

గువాహటిలో ఘోర ఓటమి తర్వాత టీమిండియా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అవ్వడమే కాకుండా, ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC 2025-27) పాయింట్ల పట్టికలో ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (4వ స్థానం) కంటే మనం కిందకు దిగజారిపోవడం. సొంతగడ్డపై పులుల్లా ఉండే మనోళ్లు, …

Read More »

స్మృతి పెళ్లికి బ్రేక్… ఎన్నెన్ని రూమర్లో

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రెండు రోజుల కిందట అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను ఈ ఆదివారం పెళ్లి చేసుకోవాల్సింది స్మృతి. మూడు రోజుల ముందు నుంచి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గట్టిగా జరిగాయి. ఐతే సాయంత్రం పెళ్లి అనగా ఉదయం అనుకోకుండా వేడుకలు ఆగిపోయాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటుకు గురవడం …

Read More »