ప్రతి ఏటా ప్రేమికుల దినోత్సవం నాడు భజరంగ్ దళాలు రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో పెళ్ళి కానీ యువతి యువకులు ఎక్కడ కలిసి ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారన్నది అందరికీ తెలిసిన విషయమే. మన దక్షిణ రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు తక్కువే కానీ నార్త్ సైడ్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
కొన్ని ప్రదేశాల్లో కర్రలతో దాడి చేశారనే వార్తలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా జైపూర్ లోని ఒక ప్రేమ జంట భజరంగ్ దళం అంటూ దాడికి యత్నించిన యువకుల బృందానికి అతిపెద్ద షాక్ ఇచ్చిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది.
జైపూర్ లోని ఒక పార్కులో అనేక ప్రేమ జంటలు ఉండడం చూసిన ఒక బృందం భజరంగ్ దళ్ పేరిట కర్రలతో దాడికి యత్నించగా.. మా వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు, అసలు మీ ఐడీ కార్డులు ఏవీ అంటూ ఎదురుతిరగడంతో వారికి ముచ్చెమటలు పట్టాయి. వెంటనే అక్కడినుండి వెళ్ళిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.
దీనితో వారు నిజమైన భజరంగ్ దళ్ బృందమేనా లేక వారి పేరుతో ఏదో చేసేద్దాం అనుకోని ఇలా దొరికిపోయారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాతరోజుల వలె యువత భయపడట్లేదని, తమ వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ తిరగబడుతున్నారని మరికొద్ది మంది విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates