Trends

డ్రైవర్ నిద్రపోతే సీటు లేపుతుంది 

అర్ధరాత్రి దాటింది.. రహదారిపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. కళ్లపై నిద్రమత్తు.. దృష్టి రహదారిపైనే ఉన్నా.. మెదడు మాత్రం నెమ్మదిగా స్పందించడం మొదలుపెడుతుంది. ఇలాంటి సమయంలో డ్రైవర్‌ అలసటను ముందుగానే గుర్తించి హెచ్చరిస్తే? ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనకు రూపమే ‘ఇంటెల్లీ సీట్‌’. ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్‌ వెంకటేశ్‌ బాలసుబ్రమణియన్‌ నేతృత్వంలోని రిహాబిలిటేషన్‌ బయోఇంజినీరింగ్‌ బృందం, హరీతా సంస్థతో కలిసి ఈ స్మార్ట్‌ డ్రైవర్‌ సీటును అభివృద్ధి …

Read More »

బిగ్‌ రివీల్‌ పేరుతో రూ.8.5 కోట్ల వసూల్… చివరికి ఏం చూపించాడు?

సోషల్‌ మీడియాలో కొద్ది రోజులుగా హైప్‌ సృష్టించిన ‘ఆగస్టు 25’ బిగ్‌ రివీల్‌ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీగా డబ్బులు వసూలు చేసి.. చివరికి నామమాత్రపు కంటెంట్‌ విడుదల చేశారంటూ పలువురు సోషల్‌ మీడియా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ‘25 ఆగస్టు 2026’ పేరుతో ఓ సోషల్‌ మీడియా ఖాతాను సృష్టించిన వ్యక్తి.. ఆగస్టు 25న భారీ విషయాన్ని వెల్లడించబోతున్నానంటూ కొద్ది రోజుల పాటు వరుసగా రీల్స్‌ …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో ఘోరం… రెండు ప్రమాదాల్లో 13 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆటోను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. ఆటోలో 15 మంది ఉన్నట్లు సమాచారం. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. …

Read More »

టిబెట్లో భూకంపం వల్లే నేపాల్లో వరదలు?

నేపాల్ లో ఒక్కసారిగా విరుచుకొని పడిన వరద దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కళ్ళ ముందే మనుషులు కొట్టుకొని పోవడం ఒళ్ళు గగుర్పాటు కలగజేస్తుంది. ఈ వరదల విషయం కూడా కొన్ని మీడియా సంస్థలు యధావిధిగా చైనా కుట్రగా ప్రచారం చేశాయి. కానీ టిబెట్లో సంభవించిన భూకంపం తమ దేశంలో వరదలకు కారణంగా భావిస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రకటించారు. టిబెట్లో బుధవారం ఉదయం …

Read More »

రీల్స్ కోసం రెండు చేతులు పోగొట్టుకుంది

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్‌లో రీల్ తీసుకునేందుకు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లిన ఓ టీనేజర్ ఊహించని ప్రమాదానికి గురైంది. గర్హ్వా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో యువతి తన స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ సమీపంలో వీడియో తీస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో అటుగా రైలు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ప్రమాదకరంగా మారింది. రైలుకు దూరంగా …

Read More »

ఇరుముడి సినిమానే కావాలని గ్రామస్థుల ధర్నా

సినిమా నచ్చితే మరోసారి చూడటం, టికెట్లు దొరకకపోతే మరో షోకు వెళ్లడం చూస్తుంటాం. కానీ తమకు కావాల్సిన సినిమాను థియేటర్ నుంచి తీసేశారని ప్రేక్షకులు ఏకంగా ధర్నాకు దిగడం చాలా అరుదు. ఇప్పుడు రవితేజ ఇరుముడి విషయంలో తెలంగాణలో అలాంటి సీనే కనిపించింది. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని వెంకటరమణ థియేటర్ ముందు ప్రేక్షకులు బైఠాయించి ఇరుముడిని మళ్లీ వేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. గత ఐదు …

Read More »

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఫ్రెష్ బస్ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర …

Read More »

3,400 లిప్‌స్టిక్‌ ముద్దులు… చివరికి రూ.5,500 జరిమానా!

ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400 లిప్‌స్టిక్‌ ముద్రలతో నిండిపోవడంతో.. వాహనం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఈ వినూత్న అలంకరణ కారు యజమానికి చివరకు జరిమానా తెచ్చిపెట్టింది. గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికర్వార్‌ కారుపై లిప్‌స్టిక్‌తో ముద్దుల గుర్తులు వేయించారు. విదేశాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ ట్రెండ్‌ను చూసిన …

Read More »

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు, పశువైద్యాధికారులు సోమవారం నిర్వహించిన దాడుల్లో సుమారు 100 టన్నుల చికెన్‌ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యర్థాలను ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువుల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను మేతగా వినియోగించడం వల్ల చేపలు వేగంగా బరువు పెరుగుతాయని చెబుతున్నారు. అయితే …

Read More »

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో కలిసి దుస్తులు లేకుండా ఈతకు దిగడమే కాకుండా ప్రమాదకరమైన ప్రాంతంలో విద్యార్థినులను డ్యామ్ లోకి దించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో నేటిజన్లు మండి పడుతున్నారు. దీంతో అయ్యగారి చేతికి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఆల్వార్ …

Read More »

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాను క‌దిలించేస్తోంది. మ‌హారాష్ట్ర‌లోని శంబాజీ న‌గ‌ర్‌కు చెందిన భార్యాభ‌ర్త‌లు ముర‌ళీధ‌ర్, సంగీత.. వారి కొడుకు కునాల్ అంద‌రూ చూస్తుండ‌గా ఒక కొండ మీది నుంచి ప‌డి మ‌ర‌ణించారు. ముందుగా తండ్రీ కొడుకులు, త‌ర్వాత త‌ల్లి నిమిషాల వ్య‌వ‌ధిలో కొండ మీది నుంచి పడిపోయి మ‌ర‌ణించిన వీడియోలు కూడా సోష‌ల్ …

Read More »

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఫార్చునర్‌ కారులో ప్రతిరోజూ విధులకు వచ్చే శేషప్ప.. ఆ కారును పక్కన నిలిపి చీపురు పట్టుకుని రోడ్లు శుభ్రం చేస్తారు. బంట్వాల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీవన ప్రయాణం కష్టాలను అధిగమించి కలలను సాకారం చేసుకోవచ్చనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. బంట్వాల్‌ తాలూకా …

Read More »