ఉత్కంఠ పోరుతో సాగుతుందనుకున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నీరసంగా జరిగింది. 175 పరుగులు చేసిన భారత్ సేన.. పాక్ ను కేవలం 114 పరుగులకే చిత్తు చేసింది. నిజానికి మ్యాచ్ ఇంకొంచం త్వరగా ముగిచేది. హార్దిక్ బౌలింగ్ చేస్తున్న ఓవర్ లో కుల్దీప్ యాదవ్ ఆఖరి క్యాచ్ ను వదలడం వల్ల ఇంకాస్త సమయం పట్టింది.
అయితే ఈ క్యాచ్ వదిలే తరుణంలో కుల్దీప్ చేతిలో పడిన బంతి బౌండరీ అవతల పడి చేతులారా పాక్ కు సిక్స్ ఇచ్చినట్టయింది. దీంతో మ్యాచ్ అయిన వెంటనే హార్దిక్ కుల్దీప్ పై నిప్పులు చెరిగాడు. సహజంగానే హార్దిక్ ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉంటాడు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మరింత తీవ్రంగా స్పందిస్తాడు.
అతనికి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా కుల్దీప్ పై సీరియస్ కావడం మరింత చర్చకు దారి తీసింది. ఎంత గెలిచే మ్యాచ్ అయినా.. అంత నిర్లక్షం జట్టుకు మంచిది కాదని కొంతమంది అభిప్రాయం తెలుపుతుంటే మరి కొంతమంది మాత్రం ఇటువంటి పొరపాట్లు సహజమని, అందరి ముందు అలా అవమానించడం సరైన పద్ధతి కాదని ఖండిస్తున్నారు.
Image – Cricbuzz
Ye kuldeep yadav pilega hardik se🤬😂#INDvsPAK pic.twitter.com/mjeBRT7ea0
— Anidhi Gupta (@DigestivBiscute) February 15, 2026
🚨Sky to kuldeep : bhag madarch*d😱🤬 pic.twitter.com/1GO1WAE8yL
— Anidhi Gupta (@DigestivBiscute) February 15, 2026
Gulte Telugu Telugu Political and Movie News Updates