Trends

ఇదెక్కడి బ్యాడ్ లక్ సామీ.. 2 పిజ్జాల కోసం రూ.8వేల కోట్లా…

రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా కాదంటే రూ.3వేలకు మించి ఖర్చు పెట్టాల్సి రావటం ఉండదు. ఒకవేళ వైరటీ కోసం బంగారం పౌడర్ ను కాస్త మేళవించినా రూ.లక్ష అవుతుందేమో. అంతకు మించి కాదు. కానీ.. రెండు పిజ్జాల కోసం రూ.8వేల కోట్లు ఖర్చు చేశారంటే.. షాక్ తినాల్సిందే. ఇలా కూడా చేస్తారా? అని అనుకోవచ్చు. …

Read More »

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడుకు చెందిన గుకేష్ చెస్‌లో ప్ర‌పంచ స్థాయి రికార్డు సాధించిన త‌ర్వాత‌.. ఇప్పుడు అలాంటిదే.. దేవాన్ష్ కూడా.. సాధించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై `వ‌రల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండ‌న్` నుంచి స‌ర్టిఫికెట్ కూడా సాధించారు. చెస్‌(చ‌ద‌రంగం)లో పావులదే కీల‌క పాత్ర‌. వీటిని చాలా జాగ్ర‌త్త‌గా ముందుకు వెన‌క్కి న‌డిపించ‌డంపైనే …

Read More »

ఆస్ట్రేలియాలో 4వ ఫైట్.. టీమిండియాకు మరో షాక్!

ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గాయాల బెడద కలిసిరావడం లేదు. నెట్ ప్రాక్టీస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. మోకాలికి తగిలిన గాయం కారణంగా రోహిత్ కొంతసేపు నొప్పితో పోరాడుతూ, చివరకు ఫిజియోల సాయం తీసుకున్నాడు. గాయం తీవ్రత అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, వైద్య బృందం నాలుగో టెస్ట్‌కు ముందు …

Read More »

అండర్-19 అమ్మాయిలు అదరగొట్టేశారు!

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి, ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 క్రికెట్‌లో తన శక్తిని మరోసారి నిరూపించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్లు …

Read More »

లోన్ యాప్‌ల వేధింపులకు చెక్: కేంద్రం కొత్త బిల్లు

తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులేని వ్యక్తులు లేదా డిజిటల్‌ లోన్‌ యాప్‌లు రుణాలు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిషేధించేలా ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం, అనుమతుల్లేకుండా రుణాలిచ్చే వారిపై పది ఏళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. …

Read More »

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం కువైట్‌కు చేరుకున్న ప్ర‌ధాని మోడీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అదేవిధంగా ఆయ‌న మ‌న‌సును హ‌త్తుకునే సంఘ‌ట‌న కూడా జ‌రిగింది. భార‌త ప‌విత్ర గ్రంధాలైన రామా యణ, మ‌హాభార‌తాల‌ను అర‌బిక్ భాష‌లోకి అనువ‌దించిన ర‌చ‌యిత‌.. అబ్దుల్లా అల్ బారౌన్‌, ఈ పుస్త‌కాల ను ప్ర‌చురించిన ప‌బ్లిష‌ర్ అబ్దుల్లా లతీఫ్ అల్ …

Read More »

మాదాపూర్ బార్‌లో అగ్ని ప్రమాదం: భారీ ఆస్తి నష్టం!

హైదరాబాద్ మాదాపూర్‌లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం జరగడంతో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని …

Read More »

యూఎస్ పౌరసత్వంలో భారతీయుల రికార్డు

ప్రతిసారి అమెరికా పౌరసత్వం పొందే విదేశీయుల సంఖ్యలో భారతీయుల వాటా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికా పౌరసత్వం పొందిన వారిలో 49,700 మంది భారతీయులున్నారు. ఈ సంఖ్య యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆధారంగా వెల్లడించబడింది. అగ్రస్థానంలో మెక్సికో 13.1 శాతం వాటాతో కొనసాగగా, భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. మొత్తం పౌరసత్వం పొందిన విదేశీయులలో 6.1 శాతం భారతీయులే కావడం గమనార్హం. …

Read More »

రాబిన్ ఉతప్ప పీఎఫ్ మోసం కేసు: అరెస్ట్ వారెంట్ జారీ!

భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు, పులకేశినగర్ పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉతప్ప నిర్వహిస్తున్న సెంచరీస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పీఎఫ్ చెల్లింపులలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలున్నాయి. కంపెనీ ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినా, …

Read More »

ఏఐ టెక్నాలజీతో గంటలో స్వామి వారి దర్శనం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు‌. అయితే, రద్దీ కారణంగా సామాన్య భక్తులు గంటలు తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలను టీటీడీ అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు చాలా గంటలపాటు క్యూలో నిలబడటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇకపై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా …

Read More »

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: మానవ తప్పిదమే..

2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ అలాగే మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల ఈ ఘటనపై రక్షణ శాఖ స్థాయి సంఘం తన నివేదికను లోక్ సభలో …

Read More »