సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్న విషయం తెలిసిందే. రైలు పట్టాలపై పడుకుని, కూర్చుని చేస్తున్న రీల్స్.. వరదల ధాటిలో నిలబడి చేస్తున్న వీడియోలు ప్రాణాలు హరిస్తున్నాయి. అయితే.. వీటికి భిన్నంగా తమిళనాడుకు చెందిన ఓ మహిళా యూట్యూబర్ చేసిన పని.. అసలుకే ఎసరు పెట్టింది. ఆమె చేసిన రీల్స్ వ్యూస్ కోసమే.. అయినా.. మొత్తంగా తుడిచి పెట్టుకుపోయింది. దీంతో లబోదబో మంటూ.. పోలీసుల …
Read More »బాలాపూర్ లడ్డూ.. 39 లక్షలు.. ఆ డబ్బు ఏం చేస్తారు?
హైదరాబాద్‌లోని గణపతి ఉత్సవాల్లో బాలాపూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బాలాపూర్ గణపతి ఉత్సవాల్లో ఉంచే లడ్డూ ప్రసాదం వేలానికి మరింత ప్రాధాన్యం ఉంది. దీనిని తాజాగా 39 లక్షల రూపాయలకు అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి వేలంలో పాడి సొంతం చేసుకున్నారు. ఇక్కడే కాదు.. పలు అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన మండపాల్లోనూ గణపతి లడ్డూలను పలువురు వేలంలో దక్కించుకున్నారు. అయితే.. ఇలా వేలంలో పాడిన సొమ్మును …
Read More »హౌస్ హాజ్బెండ్… ఇక మామూలే…
మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం వింటున్న మాట. కానీ ఇప్పుడు డైలాగ్ మారుతోంది. మీవారు ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ హాజ్బెండ్ అనే సమాధానం టక్కున వినిపిస్తోంది. ఇందులో తప్పేం వుందని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించడం చర్చకు దారితీసింది. ఇంతకూ విషయం ఏమిటంటే… తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాకు చెందిన భార్యా భర్తల …
Read More »క్యాబ్ ఎక్కెలోపే బలవంతంగా ముద్దు పెట్టిన సెక్యూరిటీ
ఆఫీసుకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుని పీజీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. క్యాబ్ దగ్గరకు వెళ్లేలోపే అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఆమె వెంటపడ్డాడు. యువతిని పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి ఎదురైన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్నానికి చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలి ఐటీ …
Read More »10 వేల జీతం ఇవ్వలేదని 24 కోట్ల నష్టం చేశాడు
తనకు రావాల్సిన రూ.10 వేల జీతం ఇవ్వలేదనే కోపంతో ఓ మాజీ ఉద్యోగి ఏకంగా రూ.24 కోట్ల నష్టాన్ని చూపించాడు. సూరత్‌లోని శ్యామ్ సంగిని టెక్స్టైల్ మార్కెట్లో సెప్టెంబర్ 9న భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొదట ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని భావించినా, పోలీసుల దర్యాప్తులో ఇది కావాలనే చేసిన పని అని తేలింది. ఈ కేసులో 33 ఏళ్ల మాజీ అకౌంటెంట్ వినోద్ సాల్వేను క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. …
Read More »హలో చాట్ GPT… హత్య తర్వాత దొరికిపోతే నటించడం ఎలా
కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఇప్పటికే ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఛార్జ్‌షీట్‌తో మరో కీలక విషయం బయటపడింది. కేతన్ చనిపోయిన తర్వాత అతడి కుటుంబం ముందు ఎలా ఏడవాలి? మరింత బాధలో ఉన్నట్లు ఎలా కనిపించాలి? పోలీసులకు దొరికితే ఎలా ప్రవర్తించాలి? వంటి విషయాలను సియా గోయల్ చాట్ GPTతో పాటు ఆన్లైన్లో వెతికినట్లు పుణె రూరల్ పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. జూన్ 18న లోహగడ్ కోట …
Read More »మీ టూత్ పేస్టులో నాన్ వెజ్ ఉందా?
మీ పేస్టులో ఉప్పుందా అనే ప్రకటన ఎంతగా పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నిజంగా ఉప్పుందో లేదో తెలియదు కానీ వెజ్జా, నాన్ వెజ్జా అనేది మాత్రం తెలియాల్సిందే అంటుంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబందించి కంపెనీలకు సీరియస్ గా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిన్నటి వరకు సంగతి వేరు ఇకముందు మాత్రం మనం వాడే వస్తువులలో ఏముందో తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. సబ్బులు, టూత్ పేస్టులు, షాంపులు, …
Read More »నిమ్స్ డాక్టర్ ఆస్తులు 80 కోట్లా?
ఒక డాక్టర్ ఇంటి మీద ఏసీబీ దాడులు చేయడమే ఒక సెన్సేషన్ అయితే ఆయన ఇంట్లో కోట్ల రూపాయల కట్టలు బయట పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఏసీబీ దాడుల్లో బయట పడిన ఆస్తులు చూసి అధికారులు సైతం విస్తు పోయారంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో, ఎంత దిగజారి బల్లకింద చేతులు పెట్టాడో అర్ధం చేసుకోవచ్చని ఆసుపత్రి సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ధరణిలోన దేవతలుగా సమాజం గౌరవించే …
Read More »జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత జట్టు అనుభవం ముందు జపాన్ చాలా చిన్న జట్టు. అలాంటిది వాళ్ళు కొట్టినంతే కొట్టారు అనేలా కామెంట్స్ వస్తున్నాయి. హైవే పిచ్‌లపై 230, 250 పరుగులు కొట్టడం ఇప్పుడు పెద్ద విషయం కాదని ఇతర దేశాల అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్య ఐర్లాండ్‌తో ఓటమి తర్వాత ఈ …
Read More »టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్
జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి మైదానం కారణంగా మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించగా, స్పిన్‌కు బాగా సహకరించిన పిచ్‌పై భారత బ్యాటర్లు కూడా పరుగుల కోసం ఇబ్బంది పడ్డారు. చివరకు భారత్ కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు ఓవర్లలో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. …
Read More »రూ.10 చిల్లర కోసం గొడవ… ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లో కేవలం రూ.10 చిల్లర విషయంలో మొదలైన గొడవ ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు పోయే వరకు వెళ్లింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో 42 ఏళ్ల మహమ్మద్ ముఖర్రమ్పై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆటో ఛార్జీకి సంబంధించిన రూ.10 చిల్లర విషయంలో ముఖర్రమ్‌కు ఇద్దరు వ్యక్తులతో గొడవ …
Read More »చాట్ GPT సపోర్ట్… తప్పిపోయిన వృద్ధుడిని ఇంటికి చేర్చాడు!
ఒక వృద్ధుడు.. పంజాబ్ అని తెలుసు కానీ పూర్తి అడ్రస్ చెప్పలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా గుర్తులేవు. ఆయన చెప్పగలిగింది ఫతేగఢ్ గుజ్రాన్ అనే ఊరి పేరు మాత్రమే. గయాజీకి చెందిన నీరజ్‌కు దొరికిన ఈ ఒక్క క్లూతో చాట్ GPTలో వెతకడం మొదలుపెట్టారు. చివరకు ఆ ఊరు లూథియానా జిల్లాలో ఉందని గుర్తించారు. చమన్ లాల్ అనే ఈ వృద్ధుడు గయాజీ రైల్వే స్టేషన్ సమీపంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates