బాబా వాంగా.. అంతర్జాతీయంగా పేరున్న సిద్ధాంతి. భవిష్యవాణిని వినిపించడంలో సుప్రసిద్ధురాలు. పూర్తిగా అంధురాలైన బాబా వాంగాకు ప్రపంచ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఆమె ఇప్పుడు లేరు. 1996లోనే మృతి చెందారు. కానీ, ఆమెరాసిన పుస్తకంలోని విషయాలను ఏటా బయట పెడుతున్నారు. తాజాగా 2026కు సంబంధించిన భవిష్యవాణిని వాంగా పుస్తకం నుంచి బయట పెట్టారు. దీనిలో పలు విషయాలు ఉన్నాయి. ప్రధానంగా మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ఆమె వెల్లడించారు. …
Read More »పెళ్లైన వ్యక్తితో సంబంధం.. 16 ఏళ్ల కుమార్తె పై తల్లిదండ్రుల ఘాతుకం
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆర్చన అనే 16 ఏళ్ల బాలిక నవంబర్ 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదట ఆమె తండ్రి రెడ్డి రాజు, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనుమానం …
Read More »2025@మోడీ: కొన్ని ప్లస్సులు… కొన్ని మైనస్‌లు!
మరో నాలుగు రోజుల్లో క్యాలెండర్ మారుతోంది. 2025కు గుడ్‌బై చెబుతూ.. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నాం. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాది కాలంలో ఏం జరిగిందనేది మననం చేసుకోవడం.. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగడం అనేది.. ఎవరికైనా అలవడాల్సిన అంశం. ఈ నేపథ్యంలో 2025లో ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ దేశానికి చేసింది..సాధించింది.. ఏంటి అనేది ఆసక్తికర విషయం. ప్రధానంగా ఈ ఏడాది 5 …
Read More »చీరకట్టు అందాలతో కట్టిపడేస్తున్న బేబమ్మ
కృతి శెట్టి సంప్రదాయ వేషధారణలో కనిపిస్తే అది ఆమెకు సహజంగానే అలవాటైనట్టే ఉంటుంది. ఈ ఆకుపచ్చ రంగు సిల్క్ చీరపై ఉన్న బంగారు చెక్స్, దానికి జత చేసిన గాఢమైన మరూన్ బ్లౌజ్ కలిసి చూడముచ్చటగా ఉన్నాయి. రంగుల కలయిక పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది, అదే సమయంలో ప్రశాంతంగానూ ఉంటుంది. తొందరగా ఆకట్టుకోదు, కానీ చూసే కొద్దీ నెమ్మదిగా మనసులో నిలిచిపోతుంది. స్టైలింగ్ మొత్తం సింపుల్‌గా ఉంది. బంగారు …
Read More »థాయ్‌లాండ్ లో విష్ణు విగ్రహం ధ్వంసం చేసిందెవరు?
థాయ్‌లాండ్ కంబోడియా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న ఒక విష్ణు విగ్రహాన్ని థాయ్ మిలిటరీ జేసీబీలతో కూల్చివేసిన వీడియోలు బయటకొచ్చాయి. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పందించింది. ఇది మతపరమైన దాడి కాదని, కేవలం భద్రతా చర్యల్లో భాగంగానే చేశామని క్లారిటీ ఇచ్చింది. ఆ విగ్రహం 2014లో కట్టారని, దానికి అధికారికంగా ఎలాంటి మతపరమైన గుర్తింపు లేదని థాయ్ అధికారులు చెబుతున్నారు. ఆ భూమి …
Read More »ఎడారి దేశంలో మంచు… మనకి గండమా?
సౌదీ అరేబియా ఎడారిలో మంచు కురవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ వింటర్ లో ఉత్తర ప్రాంతంలోని తబూక్ లో కొండలన్నీ మంచుతో నిండిపోయి వైట్ గా మారిపోయాయి. ఇది చూడటానికి అద్భుతంగా ఉన్నా, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినా.. దీని వెనుక ఒక పెద్ద ప్రమాద హెచ్చరిక దాగి ఉంది. భూమి వాతావరణ వ్యవస్థలో మౌలిక మార్పులు వస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. క్లైమేట్ చేంజ్ …
Read More »అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్
అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ 1బి వీసా ‘లాటరీ విధానానికి’ ట్రంప్ ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై అదృష్టం ఉంటే వీసా వస్తుంది అనుకోవడం కుదరదు. దీని స్థానంలో అత్యధిక నైపుణ్యం, ఎక్కువ జీతం ఉన్నవారికే రెడ్ కార్పెట్ పరిచే కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇన్నాళ్లు ఉన్న లాటరీ సిస్టమ్ వల్ల తక్కువ జీతానికి పని చేసే …
Read More »నింగిలోకి ‘బాహుబలి’… అంతరిక్షం నుంచే ఇంటర్నెట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మన ‘బాహుబలి’ రాకెట్ LVM3-M6 శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది మోసుకెళ్లిన ‘బ్లూబర్డ్ 6’ అనే అమెరికన్ శాటిలైట్ ఇప్పటివరకు భారత గడ్డ పైనుంచి లాంచ్ చేసిన అత్యంత బరువైన పేలోడ్ కావడం విశేషం. ఉదయం 8:55 గంటలకు ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు …
Read More »ఫోటోస్: ఇంటర్నెట్ వేడెక్కిపోయింది దివ్య…
కండోమ్‌ల కంటే కరివేపాకే ఎక్కువ సేల్
ఔను! మీరు చదివింది నిజమే. వంటింటి నిత్యావసరమైన వాటిలో కీలకమైంది.. అదేసమయంలో ఎడం చేత్తో తీసి పారేసేది.. కరివేపాకు. ఒకప్పుడు.. వంట చేసే సమయంలో కరివేపాకు అవసరమైతే.. మన పక్కింటి పెరట్లోనో.. పొరుగింటి ఆంటీ దగ్గరో తెచ్చుకునే ఉంటాం. ఇప్పుడు కూడా రైతు బజారుకు వెళ్లినా.. కూరగాలయ మార్కెట్‌కు వెళ్లినా.. కరివేపాకు కొసరు దూసుకొచ్చి కూరల సంచీలో పడాల్సిందే! వాస్తవానికి కరివేపాకుకు కూరల్లో ప్రాధాన్యం ఉన్నా.. అది వండే వరకే.. …
Read More »గిల్ ని పక్కన పెట్టినప్పుడు సూర్య ఎందుకు?
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటించగానే అందరికీ వచ్చిన పెద్ద డౌట్ ఇదే.. శుభ్‌మన్ గిల్‌ని ఫామ్ లేదని పక్కన పెట్టినప్పుడు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ని ఎందుకు ఉంచారు? నిజానికి చెప్పాలంటే గిల్ కంటే సూర్య రికార్డులే మరీ దారుణంగా ఉన్నాయి. 2025లో సూర్య ఆడిన 19 ఇన్నింగ్స్‌లలో 9 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. చెప్పుకోదగ్గ స్కోర్ కేవలం 47 నాటౌట్. అయినా సరే వైస్ కెప్టెన్ …
Read More »H-1B టెక్కీలకు కంపెనీ వార్నింగ్.. ఇండియా వెళ్తే..
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెక్కీలకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఇప్పటికే గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను హెచ్చరించగా, తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా తన H-1B ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వీసా స్టాంపింగ్ కోసం ఇండియాకు వెళ్తే అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే వేలమంది ఇండియా వచ్చి తిరిగి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates