కర్నూలులోని చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘరో ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి మృత దేహాలను కూడా గుర్తించేందుకు వీల్లేకుండా పోయింది. మాంసపు ముద్దలు మాత్రమే లభించాయి. వీటిలోనూ ఒకరిద్దరికి అయితే.. కేవలం ఓ రాగి ముద్దంత పరిమాణంలోనే శరీరం లభించిందంటే.. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది.
ఈ వ్యవహారంపై .. ఫోరెన్సిక్ ల్యాబ్ సహా.. కేంద్రం నుంచి వచ్చిన.. శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. సాధారణంగా బస్సుకు ఉన్న డీజిల్ ట్యాంక్ లీకై,.. అగ్ని ప్రమాదం జరిగినా.. ఇంత భారీ స్థాయిలో మాంసపు ముద్దలుగా మిగిలే అవకాశం లేదు. ఇటీవల నాలుగు రోజుల కిందట రాజస్థాన్‌లోనూ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. కానీ.. ఈ రేంజ్‌లో అయితే.. మాంసపు ముద్దలుగా ప్రయాణికులు మిగల్లేదు. మరి ఇక్కడ ఏం జరిగిందన్న విషయం చర్చకు వచ్చింది.
హైదరాబాద్ నుంచి మధుబన్ ఓ వ్యాపారి 130 రియల్ మీ అధునాత సెల్ ఫోన్లను కావేరీ బస్సులో రవాణా చేయించారు. కార్గోలో అంటే.. ప్రయాణికులు ఎక్కే బోర్డింగ్ పాయింట్‌కు పక్కన ఉండే అరల్లో మొత్తం 20 కార్టన్లలో వీటిని ఎక్కించారు. ఖచ్చితంగా దానికి సమీపంలోనే బైకు తగలబడింది. అయితే.. ఆయిల్ ట్యాంకు వరకు మంటలు వ్యాఖ్యాపించకుండానే.. బస్సు పూర్తిగా తగలబడింది. దీనికి సెల్ ఫోన్లలోని లిథియం అయాన్ బ్యాటరీలే కారణమై ఉంటాయని నిపుణులు అంచనా వేశారు.
ప్రాథమిక అంచనా ప్రకారం.. బస్సు కొద్ది సేపట్లోనే ఇంత రేంజ్‌లో కాలిపోవడానికి 3 వేల డిగ్రీల సెల్షియస్ ఉష్నోగ్రతలు వ్యాపించి ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్లు అత్యంత వేగంగా చార్జింగ్ ఎక్కేలా లిథియం అయాన్‌ను అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. దీనికి మండే స్వభావం అత్యంత ఎక్కువ. అందుకే.. ఈ ప్రమాదం వెనుక .. బ్యాటరీలే ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. లేకపోతే.. ఈ స్థాయిలో కేవలం 15 నిమిషాల్లోనే మాంసపు ముద్దలుగా మారే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates