బరువులు మోస్తూ భలే హుషారుగా రీల్స్ పెడుతున్న ప్రగతి

సీనియర్ ఆర్టిస్టు ప్రగతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అతికొద్దిమంది లేడీ ఆర్టిస్టులలో ఒకరు. ఈమె తరచుగా ఏదో ఒక పోస్ట్ ను తన ఇంస్టాగ్రామ్ లో వేస్తూ ఉంటుంది. తాజాగా తాను బాడీ బిల్డింగ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయిదు పదుల వయసులో కూడా మంచి ఫిట్నెస్ కోసం ఈమె బరువులు ఎత్తడం చూసి జనాలు నోట్ల వెళ్ళబెడుతున్నారు. అందరూ సోషల్ మీడియాలో ప్రగతి ‘ఆంటీ’ అనే ట్రోల్ చేస్తున్నప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా కుర్ర పిల్లలా ఎంతో చలాకీగా ఉంటూ తరచుగా రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది ప్రగతి. అప్పుడప్పుడు ఇలా కసరత్తులు చేస్తున్న జిమ్ పోస్టులు కూడా వేసి అందరూ నోర్లూ మూయిస్తుంది..

మొత్తానికి వెనుక విక్రమ్ వేద సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఈమె వెయిట్ బార్ లిఫ్ట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఒక పెళ్లిలో డ్రమ్స్ పైన కూర్చుని డ్యాన్స్ వేసిన వీడియో పోస్టు చేసిన ప్రగతి ఇప్పుడు ఇలా మరో వీడియో పెట్టి లైఫ్ ఎంజాయ్ చేయడానికి వయసుతో సంబంధం లేదని తెలిపినట్లు అయింది.