40 ఏళ్ల వయసులో కూడా శ్రియా శరన్ అవే అందచందాలతో కుర్రాలను ఉర్రూతలూగిస్తుంది. ఆమె తన సోషల్ మీడియా లో వేసే హాట్ హాట్ పోస్టుల ద్వారా ఎప్పుడూ హాట్ టాపిక్ నిలుస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఆమె వేసిన ఒక ఫోటో అయితే అందరినీ ఎంతో ఆకట్టుకుంది.

లైట్ పింక్ రంగులో ఆమె వేసుకున్న స్లీవ్ లెస్ డ్రెస్ లో తన అందాలని ఆరబోస్తూ పోస్టు చేసిన ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అయింది. 15 ఏళ్ల క్రితం ఉన్న ఫిట్ నెస్ నే కొనసాగిస్తూ అసలు వయసు పై బడనివ్వకుండా ఆమె ఉన్న తీరు చూస్తుంటే 20 ఏళ్ల అమ్మాయి కైనా అసూయ కలగక మానదు.

ఇక శ్రియ పెట్టిన ఫోటో కింద “ఈ డ్రెస్ నాకు తెగ నచ్చేసింది” అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ఆమెకే కాదు నెటిజన్లకు కూడా ఈ డ్రెస్, అందులో ఆమె తెగ నచ్చేసాయి అనుకోండి అది వేరే విషయం. మరి ఈ ఫోటో చూసిన తరువాత శ్రియ ఒక బిడ్డకు తల్లి అంటే నమ్మడం కూడా కష్టమే.


Gulte Telugu Telugu Political and Movie News Updates