వణికిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రతను తగ్గించే మెడిసిన్ విడుదల చేయటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో ప్రముఖ ఫార్మాకంపెనీ హెటిరో ఇంజెక్షన్ ను సిద్ధం చేసింది. అంతేకాదు.. దాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. కోవిఫర్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ ఇంజెక్షన్ తో మహమ్మారి తీవ్రతను తగ్గించే వీలుందన్న మాట వినిపిస్తోంది. తాము మార్కెట్లోకి విడుదల చేసిన కోవిఫర్ ఇంజెక్షన్ కు సంబంధించిన వివరాల్ని హెటిరో తన …
Read More »కూలర్ కోసం వెంటిలేటర్ తీసేశారు.. పేషెంట్ డెడ్
ఆసుపత్రుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో.. అక్కడ తెలిసీ తెలియక చేసే పనులు కొన్ని ఎలాంటి విషాదాలు మిగులుస్తాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. ఒక కరోనా పేషెంట్.. కుటుంబ సభ్యులు చేసిన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ పేషెంట్‌ను చూసేందుకు వచ్చి ఆసుపత్రిలో ఉక్కపోతగా ఉండటంతో కూలర్ ఆన్ చేయడం అతడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. కూలర్ ప్లగ్ పెట్టడం కోసం పేషెంట్‌కు పెట్టిన వెంటిలేటర్ ప్లగ్‌ను తీసి …
Read More »వైన్ షాపుల ముందు మాస్కుల్లేవ్.. పోలీసులు ఏం చేశారంటే?
మాస్కుల్లేకుండా బయట తిరగడం చట్ట విరుద్ధం ఇప్పుడు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటోంది. అక్కడ మాస్కు లేకుండా బయట తిరిగిన వాళ్లకు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు కూడా వచ్చాయి. మాస్క్ లేకుండా బయట తిరిగి వెయ్యి ఫైన్ వేయించుకున్న వాళ్లు బిల్లులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఐతే మాస్క్‌ను లైట్ తీసుకుంటే కేవలం ఫైన్ …
Read More »టిక్ స్టార్ దారుణం చేశాడు
టిక్ టాక్ యాప్ మనుషుల్లోని సున్నితత్వాన్ని చంపేస్తోందని.. పశు ప్రవృత్తిని రెచ్చగొడుతోందని.. దీని వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని కొంత కాలంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ యాప్‌లో కొందరి చర్యలు చూస్తే షాకవ్వక తప్పదు. అమ్మాయి కాదంటే యాసిడ్ పోయాలన్న సంకేతాన్నిచ్చే వీడియోతో మొదలుపెడితే.. ఎన్నో నెగెటివ్ థాట్స్‌ను ప్రమోట్ చేసే వీడియోలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనుషుల విపరీత ప్రవర్తనకు ఎన్నో టిక్ టాక్ వీడియోలు సాక్ష్యంగా …
Read More »ముంబయిలో ఇలాంటి దృశ్యం ఊహించగలమా?
ముంబయిలో జనజీవనం అత్యధికంగా ఆధారపడేది లోకల్ రైళ్ల మీదే. అక్కడ బస్సు సర్వీసులు పరిమితంగానే ఉంటాయి. జనాలు ఎక్కువగా రైళ్లనే ప్రిఫర్ చేస్తారు. నగరంలో ఏ మూల నుంచి ఇంకే మూలకైనా రైల్లోనే వెళ్లిపోవచ్చు. ఉదయం, సాయంత్రం అక్కడి రైళ్లలో జనాలు ప్రయాణించే తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మన దగ్గర ఓ మోస్తరు వేగంతో నడిచే సిటీ బస్సుల్లో వేలాడుతూ వెళ్లే కుర్రాళ్లను చూసి భయపడుతుంటాం. కానీ ముంబయిలో …
Read More »నో డౌట్.. ఐపీఎల్‌కు లైన్ క్లియర్
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ యధావిధిగా జరుగుతుందా? ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఉంటుందా లేదా? అనే సందేహాలతో వెర్రెత్తి పోతున్నారు క్రికెట్ లవర్స్. ఒకసారేమో ఈ ఏడాది చివరి క్వార్టర్లో ఐపీఎల్ జరుగుతుందని.. టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వార్తలొస్తాయి. ఇంకోసారేమో టీ20 ప్రపంచకప్ పక్కాగా జరుగుతుందని.. ఐపీఎల్ పరిస్థితే అర్థం కాకుండా ఉందని అంటారు. ఇలా రకరకాల ఊహాగానాలతో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు క్రికెట్ అభిమానులు. ఐతే ఎట్టకేలకు ఈ …
Read More »తెలుగు మీడియా సర్కిల్స్‌లో కలకలం
కరోనాకు ఎదురెళ్లి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు అందరూ సలాం కొట్టేవాళ్లే. వాళ్ల గొప్పదనాన్ని కీర్తించేవాళ్లే. ప్రభుత్వం కూడా వారి కష్టాన్ని గుర్తించి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది. ఐతే మీడియా వాళ్లు సైతం కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వాళ్లే. వైరస్ విజృంభిస్తున్న చోట్లకే వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నారు. లాక్ డౌన్ టైంలో కూడా ఆఫీసులకెళ్లి విధులు నిర్వర్తించారు. అయినా వారి కష్టాన్ని గుర్తించిన వాళ్లెవ్వరూ లేరు. …
Read More »హెచ్ 1బీ వీసాలపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం
మహమ్మారి వైరస్ బారినపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా కరోనా బారిన పడి విలవిలలాడుతోంది. దీంతో,అమెరికాలో నిరుద్యోగ స్థాయి పెరిగిపోయింది. మరోవైపు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకల్ సెంటిమెంట్ ను అమెరికన్లలో బలంగా రాజేశారు. దీంతో, భారత్ సహా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేసేవారిపై కొంత వివక్ష ఉంది. అందుకే, ట్రంప్…వీలు చిక్కినప్పుడల్లా హెచ్ 1 …
Read More »ఐసీసీ ఓకే చెప్పిన కొత్త రూల్స్ తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని కొత్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ లోనూ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. తాత్కాలిక ప్రాతిపదికన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తాజాగా తీసుకొచ్చిన నిబంధనల్లో అత్యధికంగా ఆటగాళ్ల ఆరోగ్యానికి మేలు చేసేవి.. మహమ్మారి ప్రమాదం నుంచి తప్పించేవి కావటం గమనార్హం.అనిల్ కుంబ్లే నాయకత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు ఓకే అయ్యాయి. ఇంతకీ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ లోకి వెళితే.. …
Read More »బెజవాడలో అంతలా పాకేసిందా?
అంతకంతకూ విస్తరిస్తున్న పాజిటివ్ కేసులు కొన్ని నగరాలు.. పట్టణాల్లో భారీగా నమోదవుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని విజయవాడ నగరంలో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులతో బెజవాడ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుతం బెజవాడలో సగానికి పైగా ప్రాంతాల్లో మహమ్మారి వ్యాపించిందని చెబుతున్నారు. అంతేకాదు.. కంటైన్మెంట్ జోన్లు కూడా భారీగా పెరిగాయి. విజయవాడలో మొత్తం 64 డివిజన్లు ఉంటే.. అందులో 62 …
Read More »అట్లాస్ సైకిల్.. ఇక కనిపించదు
అట్లాస్ సైకిల్.. అది కేవలం సైకిల్ కాదు. ఒక ఎమోషన్. భారతీయ ప్రజల జీవనంలో భాగం అయిపోయిన వస్తువది. ఇండియాలో సైకిల్ బ్రాండ్లలో అత్యంత ఆదరణ ఉన్న అట్లాస్.. ఇప్పుడు కనుమరుగు కానుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక అట్లాస్ సైకిల్ ఉండేది. ఐతే మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఈ సైకిల్ బ్రాండ్ ఉత్పత్తిని ఆపేస్తున్నారు. సైకిళ్లకు అసలు గిరాకీ లేకపోవడం, తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో తమ …
Read More »చైనాకు చెక్.. ఎనిమిది దేశాలు చేతులు కలిపాయ్
ప్రస్తుత ప్రపంచంలో చైనా అంతటి తెంపరి దేశం మరొకటి లేదనే విషయాన్ని మెజారిటీ దేశాలు అంగీకరిస్తాయి. భారత్‌ను దెబ్బ తీయడానికి చైనా నుంచి సాయం పొందే పాకిస్థాన్ లాంటి ఒకటీ అరా దేశాలు మినహాయిస్తే చైనాను అన్నీ వ్యతిరేకించేవే. తన స్వప్రయోజనాల కోసం ఎవ్వరినైనా చిక్కుల్లోకి నెట్టడానికి ఆ దేశం వెనుకాడదు. అభివృద్ధిలో తనకు దీటుగా ఉన్న, తనకంటే మెరుగ్గా ఉన్న దేశాల్ని దెబ్బ తీయడానికి చైనా ఎప్పుడూ కుట్రలు …
Read More »