అజయ్ జడేజా. భారత క్రికెట్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆయన మహారాజు కానున్నారు. నిజమే.. నిజంగానే మహారాజు. ఒక రాజ్యానికి ఆయన మహారాజుగా వెలుగొందనున్నారు. ఇదెలా అంటే.. గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతం.. ఒకప్పుడు ప్రిన్స్ లీస్టేట్. అంటే.. ఇది రాచరికంలో ఉన్న ప్రాంతం. నిజానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. రాచరికాలు రద్దయ్యాయి. అంతా.. కూడా ప్రజాస్వామ్యమే కొనసాగుతోంది.
అయితే.. కొన్ని అనూహ్యమైన కారణాల నేపథ్యంలో కర్ణాటకలోని మైసూరు, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా గుజరాత్‌లోని జామ్‌నగర్ వంటివి రాజ్యాలుగానే (యూనియన్ ఆఫ్ ఇండియా పాలన సాగుతుంది) కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రాజులు ఉంటారు. వారికి సర్వాధికారాలు ఉంటాయి. కానీ, ప్రభుత్వానికి తెలియపరిచి వాటిని అమలు చేస్తారు. ఉదాహరణకు మైసూరు ఈ కోవలోదే. ఇలానే గుజరాత్‌లోని జామ్ నగర్ లో ఇప్పటికీ రాచరికం ఉంది.
ప్రస్తుతం జామ్‌నగర్ మహారాజుగా శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా వ్యవహరిస్తున్నారు. అయితే.. వయోవృద్ధులు కావడంతోపాటు.. ఇతరకారణాలతో తన వారసత్వాన్ని తాజాగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను జామ్‌నగర్ రాజ కుటుంబానికి తదుపరి వారసుడిగా ప్రకటించారు. అజయ్ జడేజా తమ రాజకుటుంబ వారసత్వ సింహాసనాన్నిఅధిష్టిస్తారని శత్రుసల్యసింహ్‌జీ పేర్కొన్నారు.
ఇప్పుడే ఎందుకు?
దసరా పండుగ సందర్భంగా రాజవంశీకులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటారు. మైసూరులోనూ.. పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. జామ్‌నగర్‌లోనూ ఇలానే ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగానే శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా తన వారసుడిగా అజయ్ జడేజాను ప్రకటించడం గమనార్హం. ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరమని నమ్ముతున్నట్టు ఆయన పేర్కొనడం గమనార్హం. దీంతో త్వరలోనే అజయ్ మహారాజు కానున్నారు.
ఏంటి లాభం..
దేశంలో రాచరికాలు అంతరించాక.. మహారాజులుగా ఉండి ఏంటి లాభం? అనే ప్రశ్నలు ఉత్పన్నవుతాయి. మహారాజులకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. వారికి వేతనాలు కూడా చెల్లిస్తుంది. అంతేకాదు.. కీలక విషయాల్లో వారి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ప్రభుత్వ అధికారిక పండుగలకు ప్రత్యేక ఆహ్వానితులుగా రాజకుటుంబాలను ఆహ్వానిస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates