ట్రంప్ వారి ‘ఉచితాలు’.. అగ్ర‌రాజ్యంలో మారిన రాజ‌కీయం!

అంద‌రూ విద్యావంతులే. దేశంలో తాజా లెక్క‌ల ప్ర‌కారం 80 శాతం మంది చ‌దువుకున్న వారే ఉన్నారు. దీనికితోడు వారంతా రాజ‌కీయంగా కూడా చైత‌న్యం ఉన్న‌వారే. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటారు. దేనినీ ఒక ప‌ట్టాన ఒప్పుకోరు. ఇక‌, ఉచితం అన్న మాటే దాదాపు అమెరికాలో వినిపించ‌దు. ఎవ‌రూ ఉచితాలు కూడా కోరుకోరు. స‌హ‌జంగానే పాశ్చాత్య దేశాలు.. మ‌ర్క‌ట కిశోర న్యాయాన్ని పాటిస్తాయి. అంటే.. కొంత ఎదుగుద‌ల వ‌చ్చాక‌.. ఎవ‌రికాళ్ల‌పై వారు నిల‌బ‌డాల‌నే విధానం అనుస‌రిస్తారు.

అందుకే భావ ప్ర‌క‌టనా స్వేచ్ఛే కాదు.. ఆర్థిక స్వేచ్ఛ కూడా అమెరికాలో అంద‌రికీ కామ‌న్‌. ఇలాంటి దేశం లో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు లేని ‘ఉచిత సంస్కృతి’ కొత్త‌గా వ‌చ్చింది. ఈ ఏడాది న‌వంబ‌రులో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో రిప‌బ్లికన్‌-అధికార డెమొక్రాటిక‌ల్ అభ్య‌ర్థులు డొనాల్డ్ ట్రంప్‌, క‌మ‌లా హ్యారిస్ మ‌ధ్య పోరుతీవ్రంగా ఉంది. అనేక స‌ర్వేల్లో ఇద్ద‌రూ ఢీ అంటేఢీ అన్న‌ట్టుగా త‌ల‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో క‌మ‌ల ముందంజ‌లో సాగుతుండ‌గా.. మ‌రికొన్ని సార్లు ట్రంప్ దూసుకుపోతున్నా రు. దీంతో ఫైట్ మాత్రం అత్యంత ట‌ఫ్ గా ఉంద‌నేది మాత్రం అంత‌ర్జాతీయ సంస్థ‌లు కూడా అంచ‌నా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ట్రంప్ స‌రికొత్త వ్యూహానికి తెర‌దీశారు. ఉచితాల‌కు ఆయ‌న గేట్లు ఎత్తారు. తాము అధికారంలోకి వ‌స్తే.. విద్యుత్ బిల్లుల ఖ‌ర్చులో 20 శాతం తామే భ‌రిస్తామ‌ని.. తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఇక‌, వాండ‌ర‌ర్స్‌కు ఇస్తున్న ఫుడ్ స్టంట్స్‌ను తాముఅధికారంలోకి వ‌స్తే.. స్టూడెంట్స్‌కు కూడా విస్త‌రిస్తామ‌ని చెప్పారు.(మ‌న ద‌గ్గ‌ర ఉచిత బియ్యం టైపులో). అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డంతోపాటు.. ఫైన్‌ల సంస్కృతికి అడ్డుక‌ట్ట వేసి..అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌న్నారు. ఈ ఉచితాలు ఏమేర‌కు మేలు చేస్తాయో చూడాలి.