మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడిన విధానం అక్కడి జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా హిందువులపై జరిగిన దాడులపై ఆయన స్పందించిన తీరుకూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక రీసెంట్ గా పాకిస్థాన్‌లో జరిగిన దాడులపై కూడా పవన్ స్పందించారు. 15 ఏళ్ల హేమ, 17 ఏళ్ల వెంటి అనే ఇద్దరు హిందూ బాలికలు పాకిస్థాన్ లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయవిదారకమని, ఇలాంటి వార్తలు కలవరపెడుతున్నాయని పవన్ అన్నారు. పవన్ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “మన హిందూ సోదరీమణులు ఇలాంటి దుర్మార్గాలకు బలవ్వడం ఎంతో బాధాకరం. హేమ, వెంటి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఇక పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువుల ఎదుర్కొంటున్న వివక్ష, వేధింపులు తనను పదే పదే కలచివేస్తున్నాయని పవన్ లాంటి ప్రముఖులు మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
హిందూ మహిళలు, బాలికలు దాడులకు గురవుతుండటంపై ప్రపంచమంతా స్పందించాలని హిందూ మత సంస్థలు కోరుతున్నాయి. హిందూ మైనారిటీలపై జరుగుతున్న ఈ వేధింపులను ఆపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. హేమ, వెంటిల ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంస్థలు అభ్యర్థిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates