హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ. ముఖ్యంగా బిర్యానీ, హలీం, మొఘలాయి వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. కానీ, ఇటీవల కాలంలో నగరంలోని ఆహార నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని హోటళ్ళలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కుళ్లిన పదార్థాల వినియోగం వంటి సమస్యలు నగరపు ఖ్యాతిని దెబ్బతీస్తున్నాయి.
గత రెండు నెలలలో నగరంలో 84 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని హోటళ్ళలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా కనిపించడం లేదు. బిర్యానీల్లో బొద్దింకలు, గడువు తీరిన పదార్థాల వినియోగం వంటి ఘటనలు భోజన ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ ఘటనల కారణంగా పలు రెస్టారెంట్లలో భోజనం చేయడం సాహసంగా మారింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవల నిర్వహించిన సర్వేలో కల్తీ ఆహార అంశంలో హైదరాబాద్ అత్యంత దారుణ స్థాయిలో నిలిచింది. భారతదేశంలోని 19 ప్రధాన నగరాల మధ్య చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ చివరిస్తానంలో ఉండటం గమనార్హం. ఇది నగరంలో ఆహార నాణ్యతా ప్రమాణాల పరిస్థితి ఎంత దిగజారిందో చూపిస్తోంది.
హైదరాబాద్‌లోని 62 శాతం హోటళ్ళలో గడువు తీరిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నారన్న నివేదిక మరింత ఆందోళనకరంగా మారింది. నగరంలోని పర్యాటక ఆహార పట్ల ఉన్న నమ్మకాన్ని ఈ పరిస్థితి తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఆహార నాణ్యతను పునరుద్ధరించడం తక్షణ అవసరం. అధికారులు కఠిన చర్యలు తీసుకొని, నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూసేందుకు కృషి చేయాలి. హైదరాబాద్ ప్రఖ్యాతి తిరిగి నిలబడాలంటే ఆహార పరిశ్రమపై కఠిన నియంత్రణలు తప్పనిసరి అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates