Trends

క‌రోనా నుంచి కోలుకున్నారా.. లైట్ తీస్కోకండి

క‌రోనా వ‌చ్చి వెళ్లిపోగానా చాలా రిలాక్స్ అయిపోతుంటారు జ‌నాలు. క‌రోనా రాక‌ముందు, వ‌చ్చాక ఉన్న భ‌యం, ఆందోళ‌న అంతా ప‌క్క‌కు వెళ్లిపోతాయి. వైర‌స్ వ‌చ్చి వెళ్లిపోయింది. ఇక మ‌న‌కేం కాదు అనే అభిప్రాయంలో ఉంటారు. కానీ ఇది అంత మంచిది కాదు అంటోంది కేంద్ర ప్ర‌భుత్వం. క‌రోనా నుంచి కోలుకున్నాక కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే అని కేంద్ర ఆరోగ్య శాఖ‌ హెచ్చ‌రించింది. ఈమేర‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. వైరస్‌ …

Read More »

కోవాగ్జిన్ వాడిన జంతువుల పరిస్థితేంటి?

కరోనాతో అల్లాడిపోతున్న ఇండియా.. కోవాగ్జిన్ మీద చాలా ఆశలే పెట్టుకుంది. కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రయోగాల్లో మిగతా అన్ని కంపెనీల కంటే చాలా ముందంజలో ఉన్న భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరిది. రెండు నెలల కిందటే ఈ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ మొదలైన సంగతి తెలిసిందే. ముందు జంతువులకు, ఆ తర్వాత మనుషులకు ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూస్తున్నారు. మనుషుల మీద వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల గురించి …

Read More »

ఐసీఎంఆర్ షాకింగ్ ప్రకటన.. ప్లాస్మా పని చేయట్లేదట

ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కోవిడ్ -19.. ఒక పట్టాన కొరుకుడుపడనిదిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటికి ఈ వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీలో పెద్ద ఎత్తున సవాళ్లు ఎదుర్కోవటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు.. చికిత్సలోనూ ఎదురవుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కోవిడ్ వైద్యంలో ప్లాస్మా చికిత్స మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లుగా ఇప్పటివరకు విన్నాం. కానీ.. అసలు వాస్తవం ఏమిటంటే.. అంటూ …

Read More »

ఫేస్ బుక్ లో ఆఖరి రోజు అంటూ ఆ ఉద్యోగి సందేశం ఇప్పుడు సంచలనం

తరచూ ఏదో ఒక చిక్కుల్ని ఎదుర్కొనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు కొత్త తలనొప్పి షురూ అయినట్లే. ఆ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు తాజాగా చేసిన ఆరోపణలు.. ఇప్పుడా సంస్థకు కొత్త ఇబ్బందులు తప్పేటట్లు లేవంటున్నారు. ఫేస్ బుక్ ఉద్యోగిగా ఇదే తన చివరి రోజు అంటూ యువ ఇంజనీర్ ఒకరు చేసిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేయటంతోపాటు.. ఫేస్ బుక్ …

Read More »

జాబ్ మార్కెట్ పై షాకింగ్ సర్వే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా ఎంత దారుణ పరిస్థితి నెలకుందన్న విషయం తెలిసిందే. దేశీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయటమే కాదు.. జాబ్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక సర్వే రిపోర్టు బయటకు వచ్చింది. మ్యాన్ పవర్ గ్రూపు ఎంప్లాయ్ మెంట్ ఔట్ లుక్ సర్వే ఒకటి వెల్లడైంది. ఇందులో పేర్కొన్న వివరాలు షాకింగ్ గా మారాయి. కరోనా నేపథ్యంలో దేశీయంగా …

Read More »

రష్యా వ్యాక్సిన్ భారత్ లో తయారీ?

ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన రష్యా కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయోగ ఫలితాల్ని పరిమిత స్థాయిలో పూర్తి చేసి.. తన వ్యాక్సిన్ గురించి ప్రపంచానికి గొప్పలు చెబుతున్న రష్యా.. తాజాగా తన వ్యాక్సిన్ (స్పుత్నిక్)ను మాస్కో మహానగరంలోని సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. …

Read More »

యుఎస్ ఓపెన్‌లో ఒక సంచలన పరిణామం

కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న మైదానాలు మళ్లీ ఆటలతో సందడి చేస్తున్నాయి. దాదాపుగా అన్ని ఆటలూ పున:ప్రారంభం అయ్యాయి. టెన్నిస్‌లో గ్రాండ్ స్లామ్ టోర్నీ కూడా నిర్వహిస్తున్నారు. మధ్యలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలను నిర్వహించే అవకాశం లేకపోగా.. ఏడాదిలో చివరి గ్రాండ్ స్లామ్ అయిన యుఎస్ ఓపెన్‌ను వారం కిందటే మొదలుపెట్టారు. రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, హలెప్ సహా చాలామంది స్టార్ క్రీడాకారులు ఈ టోర్నీకి …

Read More »

క‌రోనా ఇండియా.. సెకండ్ వ‌ర‌స్ట్

ఒక‌ప్పుడు ఆ దేశంలో రోజుకు ఇన్ని కేసుల‌ట‌.. ఈ దేశంలో ఒకే రోజు ఇన్ని మ‌ర‌ణాల‌ట అని చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మ‌న గురించి ఆందోళ‌న‌క‌ర‌మైన వార్త‌లు ప్ర‌పంచం చెప్పుకుంటోంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఉద్ధృతి ఎప్పుడు ఆగుతుందో ఏమో తెలియ‌ట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మొత్తంగా దేశం ప‌రిస్థితి చూస్తే ఏమాత్రం ఆశాజ‌న‌కంగా క‌నిపించ‌డం …

Read More »

సురేష్ రైనా.. మళ్లీ ట్విస్ట్ ఇచ్చాడు

టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్‌మన్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సురేష్ రైనా వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ కోసం దుబాయ్‌కి వెళ్లిన అతను.. కొన్ని రోజుల్లోనే వ్యక్తిగత కారణాలతో ఇంటిముఖం పట్టడం, ఈసారి ఐపీఎల్ సీజన్ మొత్తానికి అతను దూరమవుతున్నట్లు ప్రకటన రావడం సంచలనం రేపింది. అతనిలా తప్పుకోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి. ఈ విషయంలో రోజుకో వార్త పుట్టుకొచ్చింది. దీంతో …

Read More »

రెండేళ్లలో 12వేల అమెరికన్లకు జాబ్స్ ఇస్తామన్న భారత ఐటీ దిగ్గజం

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండేళ్ల వ్యవధిలో దాదాపు పన్నెండువేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రణాళికల్నిసిద్ధం చేసినట్లుగా ఆ కంపెనీ వెల్లడించింది. ఐదేళ్లలో పాతిక వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయానికి తాము కట్టబడి ఉన్నామని.. దీనికి తగ్గట్లే గడిచిన మూడేళ్లలో 13 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆ సంస్థ స్పష్టం చేసింది. హెచ్ …

Read More »

అమ్మాయిపై 139 మంది రేప్.. అంతా బుస్

తనను హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నాయకులు, ఫిలిం సెలబ్రెటీలు, మరికొందరు కలిసి మొత్తం 139 మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కానీ అదంతా అబద్ధమని తేలింది. స్వయంగా ఆ అమ్మాయే ఈ విషయం వెల్లడించింది. తనపై 139 మంది అత్యాచారం జరిపారన్న ఆరోపణ అబద్ధమని.. రాజా శ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే తాను అలా …

Read More »

హోటల్ గది పంచాయితీతో రైనా వెళ్లిపోయాడా?

మిగిలిన క్రికెట్ టోర్నీలకు ఐపీఎల్ కు ఉన్న తేడా తెలిసిందే. ప్రతి సీజన్లో ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. కరోనా వేళ.. దుబాయ్ లో నిర్వహిస్తున్న ఐపీఎల్ రోటీన్ కు పూర్తిగా భిన్నమైనది. ఓవైపు వైరస్ భయం.. మరోవైపు సుదీర్ఘకాలం పాటు కుటుంబ సభ్యులకు దూరంగా మెలగటంతో పాటు.. మరిన్ని ఆంక్షల మధ్య ఆడాల్సిన బాధ్యత క్రికెటర్ల మీద ఉంది. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ కు …

Read More »