Political News

మోడీ ఇంతగా భయపడుతున్నారా ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగా భయపడుతున్నారో జనాలందరికీ తెలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో రైతులపైకి వాహనాలు నడిపటంలో నలుగురు రైతులు మరణించిన విషయం దేశంలో ఎంతగా సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ర్యాలీ తీస్తున్న రైతులపైకి వెనక నుండి జీపు నడిపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాయే. సుప్రీంకోర్టు జోక్యంతో ఆశిష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు …

Read More »

ఏపీలో విద్యుత్ సంక్షోభం.. కారణం చెప్పిన ట్రాన్స్ కో

భారత్ కు తీవ్రమైన విద్యుత్ సంక్షోభం పొంచి ఉందనే మాట ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చెప్పినంత ఎక్కువగా ఏమీ కొరత లేదన్న మాటను ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. అందులో నిజం లేదన్న మాట తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థం కాక మానదు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ కంటే ఏపీకే విద్యుత్ సంక్షోభం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బలం …

Read More »

బీజేపీ అభ్యర్థికి ఒక్కటంటే ఒక్క ఓటే

భారతీయ జనతా పార్టీ.. ఏడేళ్ల నుంచి భారత దేశాన్ని పాలిస్తున్న పార్టీ. దాని బలం ముందు ఇండియాలో ఏ పార్టీ కూడా నిలవలేకపోతోంది. 2014-19 మధ్య పెద్ద తప్పులు చేసినా.. ఆ తప్పుల్ని మన్నించి మళ్లీ ఆ పార్టీకే అధికారం అధికారం కట్టబెట్టారు దేశ ప్రజలు. అలాంటి పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు వచ్చిందంటే నమ్మశక్యంగా అనిపించదు. ఏ రాష్ట్రమైనా కావచ్చు.. ఎన్నిక …

Read More »

బీసీలపై పవన్ గాలి ?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెల్లిగా బీసీలను లాగటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. బీసీల ఆందోళనలకు తాను మద్దతు ఇస్తానని ఇపుడు చెబుతున్నారు. అయితే పవన్ ఉద్దేశ్యం మాత్రం 2024 ఎన్నికల నాటికి బీసీలను తన వైపు తిప్పకోవటమే అని అర్ధమవుతోంది. తనకు కులం లేదని పదే పదే చెబుతున్న పవన్ ఆచరణలో మాత్రం కాపులను ఓన్ చేసేందుకు ఇటీవల బాగా …

Read More »

పోగొట్టుకున్న చోటే వెతుకుంటున్న చంద్రబాబు

ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతికితే ప్రయోజనం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. చంద్రబాబు ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. అందులో ఆయన విజయం సాధిస్తారో లేక ఆశాభంగానికి గురవుతారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోట. గుండ్లకుంట శివారెడ్డి మరణం తర్వాత టీడీపీ ప్రాభవం కోల్పోయింది. శివారెడ్డి వారసత్వాన్ని రామసుబ్బారెడ్డి అందుకున్నారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ …

Read More »

పవన్ టార్గెట్ లో క్లారిటీ పెరిగిందా?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఆ పార్టీ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు పవన్‌ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్న మేధావుల అభిప్రాయాలను తన ట్విట్టర్ ఖాతాలో జత చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలను పవన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఉండవల్లి వంటి రాజకీయ ఉద్దండులు మాట్లాడిన మాటలను బట్టి.. ఆర్థిక …

Read More »

ఇంటిని చంద్రబాబు చక్కదిద్దుకుంటున్నారా ?

మూడు రోజుల చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిజానికి ఈ పర్యటన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే చేసుండాలి. కానీ అప్పట్లో నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో కరోనా వైరస్ సమస్య కూడా మొదలవ్వటం తో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. కరోనా దెబ్బకు దాదాపు రెండేళ్లకు పైగా చంద్రబాబు బయట తిరగలేకపోయారు. ఏదో పార్టీ అవసరార్ధం నేతలను పరామర్శించటం తప్ప పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు బయటతిరిగింది …

Read More »

యూపీలోనే కాదు, ఉత్తరాఖండ్ లోనూ బీజేపీకి చావు దెబ్బ

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ లో రైతుల గోల పెరిగిపోతుంటే పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ లో ముసలం మొదలైనట్లే ఉంది. రెండు రాష్ట్రాల్లోను బీజేపీనే అధికారంలో ఉండటంతో అధికార పార్టీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరాఖండ్ లో ఓ మంత్రి తన కొడుకుతో పాటు హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఒక మంత్రే ఓ ఎంఎల్ఏ తో కలిసి బీజేపీకి రాజీనామా ఇచ్చేసి కాంగ్రెస్ లో చేరిపోతారని …

Read More »

ఏపీలో మాత్రమే కరెంటు కోతలు ఎలా వచ్చాయి – చంద్రబాబు

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు భారీ స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పాత విష‌యాల జోలికి పోకుండా.. తాజా అంశాల‌పై ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “మీ క‌మీష‌న్ల కోసం.. రాష్ట్రాన్ని అంధ‌కారం చేస్తారా?” అంటూ.. నిల‌దీశారు. అంతేకాదు.. పేద‌ల ఇళ్ల పునాదుల కోసం .. కేంద్ర ప్ర‌భుత్వం.. 3700 కోట్లు ఇస్తే.. దానిలోనూ 2000 కోట్లు దిగ‌మింగేసి.. కోర్టులో కేసులు వేయించి.. ప‌నులు నిలుపుద‌ల చేయించిన దౌర్భాగ్య‌పు …

Read More »

మంత్రి హ‌రీష్‌రావుకు షాక్‌..

తెలంగాణ మంత్రి, సాక్షాత్తూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు.. హ‌రీష్‌రావుకు.. భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఉప ఎన్నికకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బలమూరి వెంకట్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్ …

Read More »

బుచ్చ‌య్య కోపం.. ఎవ‌రిమీద‌.. మ‌న‌సు విప్పిన సీనియ‌ర్ నేత‌

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి, ఎన్టీఆర్ హ‌యాం నుంచి రాజ‌కీయ చ‌క్రం తిప్పుతున్న గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విష‌యం.. టీడీపీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే న‌డుస్తోంది. గ‌తంలో అన్న‌గారి హ‌యాంలో ఆయ‌న చెంత‌న చేరిన బుచ్చ‌య్య‌.. అన్న‌గారి టీంగా గుర్తింపు పొందారు. పార్టీలో త‌లెత్తిన సంక్షోభ స‌మ‌యంలో మెజారిటీ నాయ‌కులు.. చంద్ర‌బాబుకు జైకొట్టారు. అయితే. ఆస‌మ‌యంలో ల‌క్ష్మీపార్వ‌తి వ‌ర్గంగా ఉన్న బుచ్చ‌య్య‌.. అనంత‌ర ప‌రిణామాల‌తో తిరిగి బాబు గూటికి …

Read More »

బుట్టా రేణుక‌కు మ‌ళ్లీ అవ‌కాశం!

2019 ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి గ‌ద్దెనెక్కిన జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అదే ప్ర‌ద‌ర్శ‌న పున‌రావృతం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌తో పాటు ఎంపీ సీట్ల‌నూ వైసీపీ భారీగా గెలుచుకుంది. ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌లపై జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌తో పాటు ఎంపీ అభ్య‌ర్థుల‌ను కూడా ఎక్కువ సంఖ్య‌లో …

Read More »