పవన్ కళ్యాణ్ తప్పు చేసినా నిలదీయండి

ఈ తరం రాజకీయ నాయకులలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీరు వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పవన్ ఎప్పటికప్పుడు తాపత్రేయ పడుతుంటారు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటారు. ముక్కుసూటిగా మాట్లాడే పవన్..తప్పు చేస్తే తననైనా నిలదీయాలని చాలా సందర్భాల్లో పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో పవన్ తన రాజకీయాలు వేరని నిరూపించారు. తనతో సహా ప్రతి రాజకీయ నాయకుడికీ యువత శల్య పరీక్ష పెట్టాలని పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

యువత బాధ్యతగా ఉంటేనే నాయకులకు భయం రాదని, ఇది తనకూ, ముఖ్యమంత్రి గారికి వర్తిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. శాసన సభలో తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయం చెప్పామని గుర్తు చేశారు. తాము తప్పు చేసినా బాధ్యత వహిస్తామని చంద్రబాబు, తాను గతంలో కూడా చెప్పామని, తప్పు చేసిన వారెవరైనా ఉపేక్షించబోమని పవన్ మరోసారి స్పష్టం చేశారు. తాము జవాబుదారీగా ఉండాలనుకుంటున్నామని, శాసన సభలో మాట్లాడింది శాసనమవుతుందని తెలిపారు.

కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల పనితీరుపై అయినా ప్రశ్నించాల్సిన బాధ్యత, అవసరం ప్రజలు..ముఖ్యంగా యువతపై ఉందని పవన్ చెప్పారు. ఈ తరం రాజకీయ నాయకులలో పవన్ మాదిరిగా జవాబుదారీతనంతో ఉంటే నేతలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. తప్పు చేస్తే ఎలా తప్పించుకోవాలి అని వంద మార్గాలు వెతికే ఈ కాలంలో తాను తప్పు చేసినా నిలదీయాలని స్వయంగా చెప్పే పవన్ వంటి నేతలు అరుదనే చెప్పాలి. అందుకే పవన్ కు తటస్థులు కూడా మద్దతు పలుకుతున్నారు.