హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే- అంటూ.. టీడీపీ నాయకురాలు, మంత్రి వంగలపూడి అనిత లైట్ తీసుకున్నారు. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమా ద ఘటనకు సంబంధించి బాధితులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత ఫైరయ్యారు. బాధితులకు పరిహారం అందకపోతే.. నేనే వచ్చి ధర్నా చేస్తా. నన్ను చూసి భయపడి అయినా.. ప్రభుత్వం సాయం చేస్తుంది అని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనిత.. “హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే“ ఆయనను పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేకాదు.. జగన్ హయాంలో 120 మంది చనిపోయినప్పుడు.. ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయిన వారికి పరిహారం ఇచ్చేందుకు నాలుగు రోజులు పట్టలేదా? అని ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు నేరుగా ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వచ్చారని.. పరిహారం కూడా వెంటనే ప్రకటించారని.. అది కూడా 24 గంట్లల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
కానీ, జగన్‌కు బురద జల్లడమే తెలుసునని మంత్రి అనిత అన్నారు. గతంలో ఏం జరిగిందో ఆయన మరిచిపోయినా.. ప్రజలు మరిచిపోలేదన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫార్మా సెజ్‌లో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. గత ఐదేళ్ల లో ఒక్కసారైనా తనిఖీలు చేశారా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమవుతున్న సమయంలో ఇది చోటు చేసుకోవడం దారుణ మేనని చెప్పారు. ఈ దుర్ఘటనలో బాధితులైన ప్రతి కుటుంబాన్నీ తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇప్పటికే ప్రకటించిన పరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, ఆయన చెప్పిన మాటలు చేసిన విమర్శలను బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates