Political News

నాగ‌బాబు బాగా చెప్పారు.. అసలు స‌మ‌స్య ఏంటంటే..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ రాష్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు.. రెండు కీల‌క విష‌యాలు చెప్పారు. ఈ రెండు కూడా ఆయ‌న చెప్పిన‌ట్టు వాస్త‌వే. ఇందులో క‌ల్పితం కానీ.. మెర‌మెచ్చు కానీ ఏమీ లేదు. 1) ఏ పార్టీకి లేనంత యువ‌శ‌క్తి జ‌న‌సేన‌కు ఉంది. 2) అవినీతి ర‌హిత వ్య‌క్తి కాబ‌ట్టి ప‌వ‌న్‌కు ఓటేయాలి. తాజాగా నాగ‌బాబు ఈ రెండు విష‌యాల‌ను కూడా బ‌లంగా ప్ర‌స్తావించారు. అంతేకాదు.. రాబోయే …

Read More »

గ‌వ‌ర్న‌ర్ తీరుకు నిర‌స‌న‌గా తెలంగాణ ఆర్టీసీ బంద్

తెలంగాణ ప్ర‌గ‌తి ర‌థం.. ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీలు నిలిచిపోయాయి. ఈ రోజు ఉద‌యం 4 గంట‌ల‌కే ప్రారంభం కావాల్సిన ఎంజీబీఎస్ లోని సిటీ స‌ర్వీసులు స‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బ‌స్సులు అంగుళం కూడా ముందుకు క‌ద‌ల‌లేదు. ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. డ్రైవ‌ర్లు, కండెక్ట‌ర్లు కూడా యూనిఫాం వేసుకుని.. బ‌స్సుల్లో కూర్చున్నారే త‌ప్ప వారు బ‌స్సుల‌ను మాత్రం న‌డిపించ‌లేదు. దీనికి కార‌ణం.. ఉరుములు లేని పిడుగులా.. కార్మికులు ఉద్య‌మానికి పిలుపునివ్వ‌డ‌మే. తెలంగాణ …

Read More »

పవన్ పీఆర్వోలు.. పేర్ని, వెల్లంపల్లి, అంబటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాలను ఎంతమాత్రం ప్రమోట్ చేయడని అందరికీ తెలుసు. సినిమా మొదలైన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. అప్‌డేట్స్ ఇవ్వడం.. ప్రెస్ మీట్లు పెట్టడం.. మీడియా వాళ్లకు వన్ టు వన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం.. రిలీజ్‌కు ముందు తర్వాత ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడం.. ఇలాంటివి పవన్ నుంచి ఆశించలేం. మహా అయితే ప్రి రిలీజ్ ఈవెంట్ ఒకదానికి వస్తాడు. అందులోనూ ఆ …

Read More »

బాబు, లోకేష్‌ల భ‌ద్ర‌త ఎలా ఉంది? ..ప్ర‌భుత్వానికి కేంద్రం లేఖ‌

Lokesh Chandrababu

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అగ్ర‌నేత‌లు.. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ల భ‌ద్ర‌త విష‌యంపై కేంద్ర హోం శాఖ తాజాగా వైసీపీ ప్ర‌బుత్వాన్ని వివ‌ర‌ణ కోరింది. వారికి ఎలాంటి భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు? వారి ప‌ర్య‌ట‌న‌ల్లో దాడులు ఎందుకు జ‌రుగుతున్నాయి? వంటి విష‌యాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ.. తాజాగా డీజీపీకి లేఖ రాసింది. చంద్రబాబు, నారా లోకేష్‌ల భ‌ద్ర‌త విష‌యంలో తీసుకున్న చ‌ర్య‌ల‌ను త‌మ‌కు మినిట్స్ …

Read More »

వైసీపీకి వైఎస్ఆర్ ముద్దు..విజయమ్మ వద్దు?

సీఎం వైఎస్ జగన్ సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేరంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. బాబాయి వివేకా హత్య కేసులో వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తుంటే…జగన్ మాత్రం అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రం దగ్గర చేతులు కట్టుకు నిలుచుంటున్నారని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, సొంత చెల్లి షర్మిలను తెలంగాణకు పరిమితం చేసి, ఆమెతో పాటు తల్లి విజయమ్మను కూడా జగన్ పార్టీనుంచి సాగనంపారని ట్రోల్ …

Read More »

బ్రో వివాదంపై పవన్ ఫస్ట్ రియాక్షన్

జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీపై కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్ తనదేనంటూ అంబటి రాంబాబు గొడవ చేయడం, దానికి నిర్మాత విశ్వ ప్రసాద్, సాయి ధరమ్ తేజ్, పృథ్వీ రాజ్ లు క్లారిటీనివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఆ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమాను రాజకీయాల్లోకి తేవొద్దని జనసైనికులకు పవన్ …

Read More »

వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!

Viveka

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్‌ రెడ్డి బెయిల్ దాఖలకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. శుక్రవారం సుప్రీం కోర్టు లో పరిణామం జరిగింది. అయితే ట్రయిల్ కోర్టులో బెయిల్ దాఖలుకు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏదైనా సందర్భంలో సెప్టెంబర్‌ వరకు కానీ విచారణ ప్రారంభం కాకపోతే బెయిల్‌ …

Read More »

ష‌ణ్ముఖ వ్యూహంతోనే జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపుతా: ప‌వ‌న్

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు అహంకారం పెరిగిపోయింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. ష‌ణ్ముఖ వ్యూహంతోనే ఆయ‌న‌ను గ‌ద్దె దింపుతామ‌ని చెప్పారు. ఒక దుష్ట‌నేత‌పై పోరాటం చేస్తున్నామ‌ని.. ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గుర్తుంచుకోవాల‌ని సూచించారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న నేత‌ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా అనేక విష‌యాల‌ను ఆయ‌న పంచుకున్నారు. నేత‌ల‌కు ఆహ్వానంత‌న పార్టీలో చేరాల‌ని అనుకునేవారు.. ఎవ‌రైనా వ‌చ్చే చేరొచ్చ‌ని ప‌వ‌న్ …

Read More »

ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో క్రిమినల్స్: తోపుదుర్తి

నీటిపారుదల ప్రాజెక్టుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రాయలసీమ పర్యటన విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రసంగించిన చంద్రబాబు…రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తోపుదుర్తి చేసిన అవినీతి అంతా కక్కిస్తానని, ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు కర్ర తీసుకుని దాడికి వస్తే కర్రతోనే సమాధానం చెప్పాలని …

Read More »

కాంగ్రెస్ ఆశలన్నీ వైసీపీ పైనేనా ?

వినడానికి విచిత్రంగా ఉన్నా నిజమంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఇంతకీ విషయం ఏమిటంటే షెడ్యూల్ ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో ఉంది. వైసీపీ ఒంటరి పోటీకి రెడీ గా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ వ్యవహారం ఏమీ తేలలేదు. ఈ మూడు పార్టీల వ్యవహారం తేలకుండా కాంగ్రెస్, వామపక్షాల విషయంలో క్లారిటిరాదు. ఎందుకంటే టీడీపీ, జనసేనతో బీజేపీ గనుక లేకపోతే కాంగ్రెస్ లేదా వామపక్షాలు టీడీపీ, జనసేనతో కలిసే అవకాశముంది. …

Read More »

పుంగనూరులో టీడీపీ ఉగ్రరూపం

Punganuru

చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు, వైసీపీ నేతలు ప్రయత్నించడంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు కూడా వారి లాఠీలకు పని చెప్పాల్సివచ్చింది. అయినప్పటికీ ఆగకపోయేసరికి భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. అన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు శాంతించకుండ పోలీసులను తరిమికొట్టారు. దీంతో …

Read More »

అయిదుగురు క‌లిసి సీట్ల ఎంపిక‌.. తేలే విష‌య‌మేనా?

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌పడుతున్నాయి. దీంతో ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌ల వ్యూహాలు, క‌స‌ర‌త్తుల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. ముందుగా పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను సిద్ధం చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌ల్లో మునిగి తేలాయి. ఒక్క సీటు కోసం ఇద్ద‌రి కంటే ఎక్కువ నేతల మ‌ధ్య పోటీ, త‌మ వ‌ర్గం వాళ్ల‌కే టికెట్లు ద‌క్కాల‌నే అగ్ర నేత‌ల ప‌ట్టు.. ఇలాంటి స‌మ‌స్య‌లు పార్టీల‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇక తెలంగాణ‌లో బీజేపీ విష‌యానికి వ‌స్తే సీట్ల …

Read More »