రాజమహేంద్రవరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో సభ్యుడిగా నియమితులైన అక్కిన ముని కోటేశ్వరరావు తిరుమల సేవకు అర్హత సాధించారు. ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని ఎవరు ఉహించలేదు. చర్చల్లోకి చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించినప్పటికి కోటేశ్వరరావు పేరు పెద్దగా హైలెట్ కాలేదు. అయితే ఆయన ఈ బాద్యత అందుకోవడానికి పలు సేవా కార్యక్రమాలు కూడా ప్రధాన కారణం.
సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోటేశ్వరరావు పర్సనల్ లైఫ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తన సామాజిక సేవలను కొనసాగిస్తూ కోటేశ్వరరావు పద్మావతి అమ్మవారి ఆలయానికి విరాళం అందించారు. ఇక సంపాదించిన కొంత భాగాన్ని స్వగ్రామాభివృద్ధికి వెచ్చించారు.
మూడు సంవత్సరాల క్రితం కోటి రూపాయల సొంత నిధులతో కైలాస భూమిని నిర్మించి గ్రామ ప్రజల సేవకు అప్పగించడం ద్వారా తన సేవాభావాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా, తన వాటర్ ప్లాంట్‌ను గ్రామ ప్రజలకు సమర్పించారు.
అదే విధంగా, రాజంపేటలో రూ.26 లక్షలతో మరో వాటర్ ప్లాంట్‌ను నిర్మించారు. తన సేవా కృషి ద్వారా సామాజిక బాధ్యతను నిలుపుతూ సామాజిక, ధార్మిక క్షేత్రాల్లో పాదాలు మోపారు.
వ్యాపార రంగంలో చురుకుగా ఉన్న కోటేశ్వరరావు, రఘుదేవపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.5 కోట్లు వెచ్చించారు.
ఆలయ నిర్మాణం, వాటర్ ప్లాంట్‌లతో సహా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సేవలను గుర్తించి ఈ అవకావాన్ని కల్పించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్వామి వారికి సేవ చేసే అవకాశాన్ని జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టంగా భావిస్తున్నానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates