“పెత్తందారీ పాలకుడి తప్పులు సరిచేస్తున్నాం. దీనికి సమయం పడుతుంది. అయినా కష్టపడతాం. పనిచేస్తాం. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం” అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెత్తందారు ఎవరో ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. తాజాగా ఆయన భూములు సహా రెవెన్యూ వ్యవహారాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. గత పెత్తందారీ పాలకుడు చేసిన తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నామని చెప్పారు. “ప్రజల ఆస్తులను …
Read More »ఫైర్ బ్రాండ్లు కూడా సైలంట్ అయిపోయారు
వైసీపీకి చాలా మంది నాయకులు ఉన్నారు. వీరిలో కొందరు ఫైర్ బ్రాండ్స్‌గా కూడా ముద్ర పొందారు. ఇలాంటి వారు… ఎప్పుడు కావాలంటే అప్పుడు విరుచుకుపడేవారు. మైకున్నా.. లేకున్నా.. తమదైన శైలిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్.. ఇలా అప్పట్లో విపక్ష నాయకులుగా ఉన్న వారిపై తీవ్ర విమర్శలు చేసేవారు. మాటకు మాట.. అన్నట్టుగా రియాక్ట్ అయ్యేవారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందు కు మౌనంగా ఉంటున్నారు? అనేది ప్రశ్న. …
Read More »చెప్పారు… చేశారు.. జగన్ ఫొటో మాయం
ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పినట్టుగానే ఇప్పుడు చేసి చూపించారు. పట్టాదారు పాసు పుస్తకాలు సహా భూమి యాజ మాన్య హక్కు పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను మాత్రమే పరిమితం చేశారు. దీంతో రైతులు, భూ యజమానులు సైతం ఊపరిపీల్చుకున్నారు. ఎన్నికలకు ముందు.. పట్టాదారు పాసు పుస్తకాల పై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలతో వాటిని సంబంధించి రైతులకు, భూయజమానులకు అందించారు. దీంతో తమ పట్టా పుస్తకాల పై జగన్ ఫొటోలు …
Read More »షర్మిళ, వైసీపీ.. డైరెక్ట్ ట్విట్టర్ వార్
కొన్నేళ్ల నుంచి వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య తీవ్ర స్థాయిలో వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. కుటుంబ స్థాయిలో ఉన్న గొడవలు రాజకీయంగానూ తీవ్ర విభేదాలుగా మారి.. షర్మిళ వేరు కుంపటి పెట్టుకున్నారు. ముందు తెలంగాణలో కొంత కాలం రాజకీయం చేసి.. ఈ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీకి మారి.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. అప్పట్నుంచి జగన్, వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు …
Read More »కేసీఆర్‌కు భారీ షాకిస్తున్న రేవంత్.. ఇదే జరిగితే!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే..తెలంగాణ తెచ్చారని.. తెలంగాణ కోసం కొట్లాడారని.. ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని.. ఆయన వల్లే దశాబ్దాల కల సాకారమై.. తెలంగాణ కోటి రతనాల వీణ అయిందని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు చెబుతారు. అంతేకాదు.. కేసీఆర్ కూడా పదే పదే చెబుతారనే విషయం తెలిసిందే. “అనేక మార్లు కొట్లాడినం.. సాధించినం” అంటూ.. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా.. కేసీఆర్ చెప్పిన, …
Read More »విజయమ్మతో జేసీ భేటీ.. విషయం ఏంటి?
వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జేసీ కుటుంబం టీడీపీలోనే ఉంది. పైగా జేసీ కుమారుడు అస్మిత్‌రెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు. ఇక, విజయమ్మ తటస్థంగా ఉన్నారనే విషయం తెలిసిందే. అటుకుమారుడు, ఇటు కుమార్తె షర్మిలకు ఆమె తటస్థంగానే …
Read More »అసెంబ్లీలో చంద్రబాబుపై రేవంత్ ప్రశంసలు
తెలంగాణ శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. విద్యుత్ కమిషన్ అంశంపై మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి…ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించిన వైనం చర్చనీయాంశమైంది. 24 గంటల …
Read More »కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా తీసేయాలి: రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తే కేసీఆర్ తో మాట్లాడే స్థాయి కాంగ్రెస్ నేతలది …
Read More »విశాఖ గ్రేటర్ పీఠంపై జనసేన కన్ను!
గ్రేటర్ విశాఖ పట్నం కార్పొరేషన్ పీఠంపై జనసేన కన్నేసినట్టు తెలిస్తోంది. ప్రస్తుతం విశాఖ, శ్రీకాకుళం, సహా.. అనంతపురం, చిత్తూరుపై జనసేన ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఇక, ఇప్పుడు విశాఖ గ్రేటర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. విషయంలోకి వెళ్తే.. విశాఖ కార్పొరేషన్‌ను గత 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. విజయసాయిరెడ్డి ఏకంగా పాదయాత్ర చేసి మరీ.. ఇక్కడ పార్టీని నిలబెట్టారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో విజయం …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కొత్త టాస్క్ : టార్గెట్ బీజేపీ !
తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను ఒకటి ఎంఐఎం, 8 కాంగ్రెస్, 8 బీజేపీ పార్టీలు గెలుచుకున్నాయి. తెలంగాణలో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధుల కోసం వినతిపత్రాలు ఇచ్చాడు. తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీకి స్వాగతం పలికి బడేభాయ్ అంటూ …
Read More »తెలంగాణ టీడీపీ నేతలకు మంచిరోజులొచ్చాయ్ !
2018 ఎన్నికల తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంటున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు మంచి రోజులు వచ్చాయి. ఇటీవల తెలంగాణ పర్యటనలో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తెస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో …
Read More »ప్రశాంత్ కిషోర్ ‘కోటి’ ఆశలు !
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన జన్ సురాజ్ అనే సంస్థను ప్రారంభించాడు. భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మారుస్తానని అప్పట్లో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబరు 2 న పార్టీని ప్రారంభిస్తున్నానని, పార్టీ నాయకత్వం, విధివిధానాలను త్వరలో వెల్లడిస్తానని పీకే స్పష్టం చేశాడు. బీహార్ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం జన్ సురాజ్ లక్ష్యమని, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates