ష‌ర్మిల‌తో ఏపీ కాంగ్రెస్‌కు ఫ్యూచ‌ర్ లేదా..?

రాష్ట్రంలో కాంగ్రెస్ భ‌విత‌వ్యం ఏంటి? మున్ముందు పార్టీ పుంజుకునే ప‌రిస్థితి ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు చ‌ర్చిస్తున్న కీల‌క అంశం. దీనికి కార‌ణం.. ఎంతో క‌ష్ట‌ప‌డినా కూడా మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ పార్టీకి నామ మాత్ర‌పు సీట్లు కూడా ద‌క్క‌లేదు. అక్క‌డ కాంగ్రెస్ పార్టీ ఎంతో క‌ష్ట‌ప‌డింది. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి కూడా పార్టీని ముందుకు తీసుకువెళ్లింది. అయిన‌ప్ప‌టికీ..పార్టీ నాశిర‌క‌మైన ప‌రిస్థితిలోనే ఉంది.

దీంతో పోల్చుకుంటే ఏపీలో 1 శాతం ఓటు బ్యాంకు కూడా లేని ప‌రిస్థితి నుంచి ఇప్పుడు పార్టీని అడుగులు వేయించేలా ప‌రుగులు పెట్టించాలంటే ఎంతో క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నాయ‌కులు చెబుతున్నా రు. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో పార్టీ పోగొట్టుకున్న ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని సూచిస్తున్నారు. అదేస‌మ‌యంలో పార్టీకి దూరంగా ఉంటున్న నాయ‌కుల‌ను అక్కున చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

కానీ, ప్ర‌స్తుతం పార్టీ చీఫ్‌గా ఉన్న ష‌ర్మిల ఆదిశ‌గా అడుగులు వేయ‌డం లేద‌నేది సీనియ‌ర్లు చెబుతున్న మాట‌. అంతేకాదు.. సొంత అజెండాను ఆమె వ‌దులు కోలేక పోతున్నార‌ని, పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేద‌ని అంటున్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు మాసాలు అయినా.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని ర‌ఘువీరా రెడ్డి వంటివారు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

వీటిని అనుకూల మీడియా ప్ర‌స్తావించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా ష‌ర్మిల త‌న సొంత అజెండాను ప‌క్క‌న పెట్టి.. అంద‌రినీ క‌లుపుకొని పోయే ప‌రిస్థితి ఉండాల‌ని చెబుతున్నారు. ఆ దిశ‌గా అడగులు వేయ‌క‌పోతే.. మ‌రింత దారుణ ప‌రిస్థితికి కాంగ్రెస్ చేరిపోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. “మ‌హారాష్ట్ర ఫ‌లితం చూసిన త‌ర్వాత‌.. ఇక్క‌డ చాలా మార్పు రావాల్సిన అస‌వ‌రం ఉంది. మ‌రి ఏంచేస్తారో” అని ర‌ఘువీరా చేసిన కామెంట్లు ఇప్పుడు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.