జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సోదరుడు, పార్టీ కోసం కృషి చేస్తున్న నాగబాబు కళ్లలో ఆనందం చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగబాబును రాజ్యసభకు పంపించేందుకు.. పవన్ ముమ్మరంగా యత్నస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు దాదాపు ఫలించాయనే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటికి డిసెంబరు 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
పోటీ ఉంటే ఎన్నికలు పెడతారు. లేకపోతే ఏకపక్షంగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో ఈ మూడు స్థానాలను కూటమిపార్టీలు పంచుకున్నాయని సమాచారం. వీటిలో రెండు టీడీపీ తీసుకుందని, ఒక స్థానాన్ని మాత్రం బీజేపీ, జనసేనలకు వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే.. పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను బట్టి.. బీజేపీకి దక్కే ఒక్క సీటును తాను తీసుకునేందుకు ఆయన ప్లాన్ చేశారని సమాచారం.
తద్వారా..జనసేన ఆవిర్భావం నుంచి కూడా పార్టీ కోసంశ్రమిస్తున్న నాగబాబును పెద్దల సభకు పంపించాలన్నది పవన్ ఉద్దేశం. వాస్తవానికి ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో. నాగబాబు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. కూటమి పార్టీ అయిన.. బీజేపీ ఈసీటు కోసం పట్టుబట్టడంతో చివరి నిముషంలో నాగబాబు తప్పుకొన్నారు. దీంతో సీఎం రమేష్.. బీజేపీ టికెట్‌పై పోటీ చేసి విజయందక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో నాగబాబును రాజ్యసభకు పంపించాలనిఅప్పట్లోనే పవన్ నిర్ణయించుకున్నారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాజాగా కూటమిలో బీజేపీ-జనసేనలకు సంయుక్తంగా దక్కిన 1 స్థానాన్ని తమకు ఇవ్వాలంటూ పవన్ ఢిల్లీ పెద్దలను కోరినట్టు తెలిసింది. దీనికి బీజేపీ పెద్దలు కూడా ఓకే చెప్పారన్నది జాతీయ మీడియా సమాచారం. అయితే.. అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే.. అన్నను రాజ్యసభకు పవన్ సునాయాసంగా పంపించే అవకాశం ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates