ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి గురువారం రాత్రి వరకు ఆయన తిరుపతిలోనే ఉన్నారు. అక్కడ తొక్కిసలా ట ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అనంతరం ఆయన శుక్రవారం ఉదయాన్నే.. పిఠాపురం పర్యటనకు వెళ్లడం గమనార్హం. ఈ పర్యటనలో ఆయన కీలకమైన రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే సంక్రాంతి సమయానికి గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు బాగు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో మరో నాలుగురోజుల్లోనే సంక్రాంతి ఉండడం.. రాష్ట్ర వ్యాప్తంగా పనులు కొనసాగుతున్న క్రమంలో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పనులు ముందుగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఇక్కడ పర్యటించినట్టు జనసేన వర్గాలు తెలిపాయి.
తూర్పుగోదావరి నుంచి రాజమండ్రికి వచ్చిన ఆయన అక్కడ నుంచి పిఠాపురం చేరుకున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి-పిఠాపురం ప్రాంతాల మధ్య రామస్వామిపేటలో నిర్మిస్తున్న రహదారిని నిశితంగా పరిశీలించారు.
కొంత దూరం నడక మార్గంలో వెళ్లి.. రహదారి నాణ్యతను పరిశీలించిన పవన్ కల్యాణ్.. దీనికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రహదారిని ఎప్పుడు మొదలు పెట్టారు? ఖర్చు ఎంత? ఎప్ప టికి పూర్తిచేస్తారన్న వివరాలను ఆయన అధికారులను ప్రశ్నించారు.
అదేవిధంగా కాంట్రాక్టర్‌తోనూ పవన్ కల్యాణ్ మాట్లాడారు. అనంతరం.. రోడ్డుపై ఉన్న కంకర, మట్టిని చేత్తో తీసుకుని పరిశీలించారు. మట్టి నాణ్యతను మరోసారి పరిశీలించాలని ఆయన కలెక్టర్‌కు సూచించారు.
అనంతరం.. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతం లోనూ పర్యటించారు. బాధిత కుటుంబాలను కూడా అక్కడకు పిలిపించుకున్నారు. వారితో పవన్ కల్యా ణ్.. చర్చించారు. ఘటన ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.