ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి విపక్షంగా మారిన పార్టీల్లో ఉక్కపోతలు ఓ రేంజిలో పోస్తూ ఉంటాయి. ఈ తరహా ఉక్కపోతలను తట్టుకుని నిలిచే నేతలు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే ఈ ఉక్కపోతలను తట్టుకుని నిలిచే నేతలూ చాలా మందే ఉంటారు. అయితే ఇలా తట్టుకుని నిలిచే నేతల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. …
Read More »వాటీజ్ గోయింగ్ ఆన్?… టీటీడీపై కేంద్రం నజర్!
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నా… పాలక మండలి వ్యవహారాల్లో పెద్దగా ప్రభుత్వ జోక్యం కనిపించదు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా టీటీడీ వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకున్న దాఖలానే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం… ఇప్పుడు టీటీడీ వ్యవహారాలపై కేంద్రం దృస్టి సారించింది. ఈ పరిణామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైకుంఠ ద్వార …
Read More »నెవర్ బిఫోర్!… ‘సాక్షి’లో టీడీపీ యాడ్!
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఆయా పార్టీలకు అనివార్యంగా మారిపోయిందని కూడా చెప్పక తప్పదు. సరే.. అదెలాగూ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ పత్రికా పఠనంపై ఆసక్తి కలిగిన వారికి ఈ ఉదయం భారీ షాకే తగిలి ఉంటుంది. ఎందుకంటే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం …
Read More »నిన్న సంజయ్… నేడు సునీల్
ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక విభాగం అయిన సీఐడీకి చీఫ్ గా వ్యవరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై విచారణకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఏపీ మంత్రిమండలి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన అథారిటీని ఏర్పాటు చేసింది. జగన్ …
Read More »పాలనపై పవన్ కు పట్టు వచ్చేసింది!
నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా పాలనా అనుభవం లేదన్న వాదనలు ఇప్పుడు పటాపంచలు అయిపోయాయి.. రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలమే అయినా పవన్ కల్యాణ్ ఓ ఎమ్మెల్యేగా, ఆపై డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి కేవలం 7 నెలలు మాత్రమే అవుతోంది. అయితేనేం… ఈ అతి తక్కువ కాలంలోనే పాలనపై పట్టు సాధించేశారు. …
Read More »కేసీఆర్ చేయలేనిది చేసి చూపించిన రేవంత్
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు అందింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో గులాబీ దళపతి కేసీఆర్ చేయలేని పనిని… తెలంగాణ సీఎంగా పరిష్కరించే అవకాశం రేవంత్ సొంతం చేసుకున్నారు. న్యూ ఇయర్ కానుక అన్నట్లుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రేవంత్ రెడ్డి ఇటీవలి ఢిల్లీ …
Read More »జేసీ, మాధవీలత పంచాయతీ ముగియలే!
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి… బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలతల మధ్య నెలకొన్న పంచాయతీ అప్పుడే ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే జేసీ ఈ వివాదాన్ని ముగించే దిశగా అడుగులు వేసినా… ఎందుకనో గానీ మాధవీ లత ఈ వ్యవహారాన్ని అప్పుడప్పుడే వదలేలా కనిపించడం లేదు. జేసీపై కఠిన చర్యలు తీసుకునే దాకా ఆమె తగ్గేలా కనిపించడం లేదు. న్యూ ఇయర్ …
Read More »టీడీపీని కాపీ కొట్టేసిన బీజేపీ
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇకపై చెరిగిపోయే అవకాశాలు కూడా లేవు. అంతేనా… సంక్షేమ పాలనను కూడా దేశానికి పరిచయం చేసిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. రూ.2కే కిలో బియ్యం, వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రాామారావు పార్టీని అన్ని పార్టీలకు అందనంత ఎత్తులో …
Read More »జగన్ ఒకటిని బాబు ట్రిపుల్ చేశారు!
వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు. మీడియా మైకు కనిపించిందంటే చాలు… చోటామోటా వైసీపీ నేతలు కూడా బాబుపై పరాచకాలాడేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయిపోయింది. టీడీపీతో పాటు కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ ను ఏ రేంజిలో విమర్శిస్తున్నారు. జగన్ చేపట్టిన ప్రతి పనినీ.. చంద్రబాబు …
Read More »సారీ… మళ్లీ పొరపాటు జరగదు: లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా ఈ దఫా జరిగిన పొరపాటు మరోమారు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన ఓ పోస్టుపై వేగంగా స్పందించిన లోకేశ్…ప్రభుత్వం తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పడారు. ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు తావు లేదన్న రీతిలో …
Read More »విశాఖ ఉక్కుకు నవ జీవం… బాబు మాటకు కేంద్రం దన్ను
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు నిజంగానే కొత్త జీవం వచ్చేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు జీవం పోసేలా… కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం తరఫున రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం సాయత్రం కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కుకు పునరుద్ధరణ ప్యాకేజీ కింద రూ.11.440 రోటకలను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్యాకేజీతో విశాఖ …
Read More »రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భారత సైన్యం మృతి…
దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్రపంచశాంతిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ యుద్ధాన్ని ఇతర ప్రపంచ దేశాలు ఎలా తీసుకున్నా.. భారత్ మాత్రం తటస్థంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. దీంతో సహజంగానే భారత్ ఇరు దేశాలకు దూరం పాటిస్తోందని అందరూ అనుకున్నారు. కానీ, రష్యాకు అనుకూలంగా భారత్ తన సైన్యాన్ని పంపిన విషయం ఇటీవల వెలుగు చూసింది. మొత్తం 126 మంది సైనికులను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates