అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్‌గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే చాలామంది ఆయన్ని ఒక పోరాట యోధుడిలా చూసేవారు. సీఎం కావడానికి ముందు వరకు టఫ్ లీడర్‌గా కనిపించేవాడు జగన్. కానీ సీఎం అయ్యాక ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది.
ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనంత వ్యతిరేకతను ఆయన ఎదుర్కొన్నారు. ఆయన ప్రసంగాలు, మీడియా సమావేశాల్లో వ్యాఖ్యల్లో ఒకప్పటి పదును లోపించి.. అవి క్రమంగా ట్రోల్ మెటీరియల్‌గా మారిపోవడం మొదలైంది. అధికారం కోల్పోయాక జగన్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది.
జగన్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాడన్నా.. ఏదైనా కార్యక్రమానికి హాజరై మీడియాతో మాట్లాడాడన్నా.. ఏం ట్రోల్ మెటీరియల్ దొరుకుతుందా అని మీమ్ పేజీలు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లుగా ఇదే ట్రెండు నడుస్తోంది.
బెంగళూరు నుంచి రావడం.. తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టడం.. తర్వాత మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోవడం ఇదీ జగన్ వరస.
ఇలా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఏదో ఒక కంటెంట్ ఇవ్వకుండా వెళ్లరాయన. తాజా ప్రెస్ మీట్లో ఆయన ఒక ఇంగ్లిష్ రిపోర్టర్ ప్రశ్నకు స్పందించిన తీరు ట్రోల్స్‌కు తావిస్తోంది. అప్పటిదాకా తెలుగులో చెప్పిన విషయాన్ని ఇంగ్లిష్‌లో బ్రీఫింగ్ ఇవ్వాలని ఒక ఇంగ్లిష్ రిపోర్టర్ అడిగారు. ఎప్పట్లాగే ప్రశ్న అర్థం కానట్లు మొహం పెట్టాడు జగన్.
తర్వాత మళ్లీ అదే విషయం ప్రస్తావిస్తే.. ఇంత పెద్ద విషయాన్ని ఏం బ్రీఫింగ్ ఇస్తాం, ఈరోజుకు నన్ను వదిలేయబ్బా అంటూ ప్రెస్ మీట్‌ను ముగించేశాడు జగన్. గతంలో సీఎంగా ఉండగా దావోస్ పర్యటనకు వెళ్లినపుడు అక్కడి డెలిగేట్ ఒకరు ఇంగ్లిష్‌లో ఓ ప్రశ్న అడిగితే.. ఇట్స్ ఎ లెంగ్తీ క్వశ్చన్ అంటూ సమాధానం దాటవేశాడు జగన్. ఇప్పుడు జగన్ స్పందించిన తీరు ఆ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోందంటూ ట్రోలర్స్ ఆయన్ని మరోసారి టార్గెట్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates