ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల కోసం కొత్తగా 3సీ ఫార్ములాను తీసుకువచ్చారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టడంలో చంద్రబాబు ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన కలెక్టర్ల కోసం కొత్త ఫార్ములాను రూపొందించి వారి ముందు ఉంచారు.
రెండు రోజులుగా ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఆయన కలెక్టర్లకు దశ నిర్దేశం చేశారు. పెట్టుబడులను రాబట్టేందుకు కలెక్టర్లకు 3సీ ఫార్మూలను నిర్దేశించారు. అదే కమిట్మెంట్… కన్విన్స్… కో ఆపరేట్. జిల్లాల్లో పెట్టబుడులను రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్‌తో పెట్టుబడిదారులను అన్వేషించి… పెట్టుబడులు పెట్టేందుకు కన్విన్స్ చేసి.. ముందుకు తీసుకురావాలంటూ సూచించారు.
ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలి. జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. జిల్లాల్లో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, తలసరి ఆదాయం ఎంతమేర పెంచాం అన్నదానిపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
తదుపరి సమావేశం నుంచి ఏ జిల్లా కలెక్టర్ ఎంతమేర పరిశ్రమల్ని ప్రోత్సహించారన్న దానిపై సమీక్షిస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడులపై జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలి. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం అని సీఎం ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates