Political News

షర్మిలకు తోడుగా ‘వ్యూహకర్త’

తెలంగాణా రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఓ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? అవుననే సమాధానం వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుండి. తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానంటు షర్మిల రాజకీయాలకు తెరతీసిన విషయం తెలిసిందే. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి రోజున పార్టీ ప్రకటన, అజెండా, జెండా తదితరాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని పార్టీ పెట్టబోతున్న షర్మిల అందుకు వీలుగా …

Read More »

పోల‌వ‌రం..’ముంపు’ పాపం ఎవ‌రిది?

పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌రిధిలోని 200 గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం గోదావ‌రికి వ‌స్తున్న వ‌ర‌ద కార‌ణంగా.. ఈ ప్రాంతంలో నీరు పోటెత్త‌డంతో.. నిర్వాసిత గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట‌మునిగి ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా గోదావ‌రి వ‌రద ఉదృతితో కాఫ‌ర్ డ్యామ్‌కు ఎగ‌ద‌న్నుతున్న నీరు.. వెన‌క్కి మ‌ళ్లి.. గ్రామాల‌ను ముంచేస్తోంది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో బాధ‌ప‌డుతున్న‌ది ప్ర‌జ‌లైతే.. మ‌రి పాపం ఎవ‌రిది? ఏ ప్ర‌భుత్వానిది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, గోదావ‌రికి …

Read More »

ప‌ద‌వుల కోసం పాట్లు… జ‌గ‌న్ ఏం చేస్తారు?

ఏపీలో మ‌ళ్లీ ప‌ద‌వుల కోలాహ‌లం పుంజుకుంది. వైసీపీ నేత‌లు త‌మ‌కుప‌ద‌వి కావాలంటే.. త‌మ‌కు కావాల‌ని.. పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌ద‌వులు ద‌క్క‌క ఎదురు చూస్తున్న సీనియ‌ర్ల‌తోపాటు.. కొత్త‌వారు కూడా నామినేటెడ్ ప‌ద‌వుల కోసం తాడేప‌ల్లి ఆఫీస్ ముందు ప‌డిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో కార్పొరేష‌న్ చైర్మ‌న్లు, ఇత‌ర నామినేటెడ్ ప‌ద‌వుల‌తోపాటు.. టీటీడీ పాల‌క‌మండ‌లి చైర్మ‌న్‌, శ్రీశైలం దేవ‌స్థానం బోర్డు స‌హా ఇత‌ర ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల భ‌ర్తీ …

Read More »

గుంటూరు జిల్లాలో వైసీపీది వాపేనా..?

అత్యంత కీల‌క‌మైన‌.. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ప‌రిస్థితి మేడిపండేనా ? .. ఇక్క‌డ బ‌ల‌ప‌డ్డాం.. ఇంకేముంది.. టీడీపీ కూసాలు క‌దిలిపోవ‌డం ఖాయం అని.. వైసీపీ నేత‌లు భావిస్తే.. భావించి ఉండొచ్చు. కానీ, వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మాత్రం దీనికి భిన్నంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గుంటూరు జిల్లాలో టీడీపీకి మ‌ద్ద‌తుదారులు ఎక్కువ‌. ఇక్క‌డ నేత‌లు చాలా మంది వ‌రుస‌గా విజ‌యాలు సాధించారు. దీంతో .. టీడీపీకి 2014లో ఎక్క‌వ …

Read More »

బాబు ప్ర‌యాస‌.. త‌మ్ముళ్ల కులాసా..

ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. వ‌య‌సు మీద‌ప‌డుతున్నా.. న‌వ‌ యువ‌కుడిగా.. క‌ష్ట‌ప‌డుతున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. క‌రోనా స‌మ‌యంలోనూ ఆయ‌న తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక ప్ర‌చారానికి వ‌చ్చారు. వారం పాటు అక్క‌డే మ‌కాం వేసి ప్ర‌చారం చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత.. మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ‌, విశాఖ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో ప్ర‌చారం చేశారు. ఇక‌, ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డు తున్నారు. …

Read More »

మోడి అడ్వాంటేజ్ తీసుకుంటారా ?

ఇపుడిదే అంశంపై బీజేపీలోను నాన్ ఎన్డీయే పార్టీలో చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ గెలవటానికి బీజేపీకి ఓ అవకాశం వచ్చిందనే అనుకుంటున్నారు. అదేమిటంటే బీజేపీకి బలమైన పోటీదారులైన ఎస్పీ, బీస్పీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి కాబట్టే. నరేంద్రమోడి పాలనపై యావత్ దేశంలోను తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. ఇందులో భాగంగానే యూపిలో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈమధ్యనే జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. …

Read More »

సీనియ‌ర్లు లేని కాంగ్రెస్ సామ్రాజ్యం..!

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏడేళ్ల కింద‌ట ప‌ట్టిన గ్ర‌హణం ఇప్ప‌టి వ‌ర‌కు విడ‌వ‌లేదు. ఈ పార్టీలో ఒక‌ప్పుడు సీనియ‌ర్లుగా చ‌క్రం తిప్పిన వారు.. చాలా మంది పార్టీ మారిపోయారు. ఇక‌, కొంద‌రు ఏకంగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. మిగిలిన వారిలోనూ సీనియ‌ర్లు.. చాలా మంది త‌ట‌స్థంగా ఉంటున్నారే త‌ప్ప పార్టీ వాయిస్ వినిపించ‌డం లేదు. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఏ పార్టీకైనా ఒడిదుడుకులు త‌ప్ప‌వు. …

Read More »

ప్రియాంక ఇంత యాక్టివ్ అయ్యారా ?

అవును ఇది కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపే విషయమే. అవును ఇంతకాలం పార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే ప్రియాంక గాంధీ పార్టిసిపేట్ చేస్తుంటారు. పేరుకు జాతీయ ప్రధాన కార్యదర్శే కానీ అంత చొరవ చూపించటం లేదని చాలామంది తెగ బాధపడిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి అస్సాం ఎన్నికల్లో పూర్తిస్ధాయిలో ప్రచారానికి దిగటంతో ఇకనుండి పార్టీ కార్యక్రమాల్లో కూడా ప్రియాంక ఫుల్లుగా ఇన్వాల్వయి పోతారని అందరు ఆశించారు. అయితే …

Read More »

కత్తి మహేష్ కి జగన్ సర్కార్ భారీ సాయం..!

ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… చెన్నై అపోలో అసుపత్రిలో శస్త్ర చికిత్స అనంతరం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. కాగా కత్తి మహేష్ వైద్య ఖర్చులకు ఏపి ప్రభుత్వం రూ.17లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ నుండి ఆసుపత్రి యాజమాన్యంకు సీఎంఆర్ఎఫ్ నుండి ఎల్ఓసీ జారీ చేసింది. ఆరు …

Read More »

అంతరిక్షంలోకి తెలుగు మహిళ..!

తొలిసారిగా అంతరిక్షంలోకి ఓ తెలుగు మహిళ అడుగుపెడుతోంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఓ మహిళకు అంతరిక్షంలోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహన నౌకను ప్రయోగించనుంది. నలుగురు ప్రయాణికులు వెళ్తున్న ఈ వాహన నౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉండటం విశేషం. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యాక్షురాలి హోదాలో ఉన్న ఆమె …

Read More »

తెలంగాణలో ఏ ఒక్క సీమాంధ్రుడికైనా ఇబ్బంది కలిగిందా?

అనూహ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీటి పంచాయితీ అంతకంతకూ ముదురుతోంది. ఇదిలా ఉంటే.. దీనికి మించిన మాటల యుద్ధానికి తెర తీశారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. టీఆర్ఎస్ నేతలు. అందుకు భిన్నంగా ఏపీ అధికారపక్ష నేతలు మాత్రం ఆచితూచి అన్నట్లు వ్యాఖ్యలు చేశారే కానీ ఎక్కడా ఒక్క మాట అదనంగా అనేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. దూకుడుగా వ్యవహరించే తమ సహజ తీరుకు భిన్నంగా వైసీపీ నేతలు వ్యవహరించారు. …

Read More »

రుణపరిమితిలో భారీ కోత.. ఏపీ సర్కారుకు కేంద్రం భారీ షాక్

దేశంలో మరెక్కడా లేని రీతిలో ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో లబ్థిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు వేసే వినూత్న విధానాన్ని ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే బోలెడంత చర్చ నడుస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు ఏకంగా క్యాలెండర్ ఏర్పాటు చేసి.. నెల వారీగా పథకాల్ని అమలు చేస్తున్నారు. అయితే.. ఈ పథకాల అమలుకు ఆదాయం కంటే కూడా అప్పుల మీదనే …

Read More »