లాక్డౌన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి అంటే బుధవారం నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశమిచ్చారు.
పది తర్వాత మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు జన సంచారంపై కఠిన నియంత్రణలు ఉంటా యి. తెలంగాణ హైకోర్టుతో సహా పలువురు లాక్డౌన్ విధించడమే సరైన మార్గమని చెబుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో తాజా కేబినెట్ భేటీలో లాక్డౌన్ వైపు మొగ్గు చూపారు. నిజానికి లాక్డౌన్ విషయంలో ఆది నుంచి కేసీఆర్ సహా.. మంత్రులు అందరూ విముఖ త వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పె రుగుతున్నాయని.. మరణాలు కూడా పెరుగుతున్నాయని.. హైకోర్టు తీవ్రస్థా యిలో హెచ్చరించండంతోపాటు.. పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో కొన్నాళ్లుగా రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ మాత్రం అమలు చేస్తున్నారు. అయితే.. హైకోర్టు మరోసారి కేసీఆర్ ప్రభుత్వం వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. మీరు చేస్తారా? మమ్మల్ని చేయమంటారా? అని ప్రశ్నించింది.
దీంతో తాజాతా నిర్వహించిన కేబినెట్ భేటీలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అదేసమయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో భారీ సంఖ్యలో టీకా కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. అదేసమయంలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని కూడా నిర్ణయించడం విశేషం.
లాక్గౌన్ సంగతులు
+ బుధవారం నుంచి పది రోజులు(మే 12-22 వరకు) అమలు
+ ఉదయం 6-10 గంటల వరకు(అంటే కేవలం 4 గంటలు) ప్రజలకు రిలాక్సేషన్
+ ఉదయం 10 నుంచి మరుసటిరోజు ఉదయం 6 వరకు కఠిన లాక్డౌన్
+ అత్యవసర సేవలు మినహా దేనినీ అనుమతించరు.
+ మెడికల్ షాపులు, మీడియా, పాలు అనుమతిస్తారు.
+ ఆక్సిజన్ రవాణా.. వైద్య సేవలకు ఉపయోగించే వాహనాలను అనుమతిస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates