Political News

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో జీవా ‘ రంగం ‘ సినిమా రిపీట్‌..!

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ద‌ర్శ‌కుడిగా మారి జీవా హీరోగా తెర‌కెక్కించిన కో ( తెలుగులో రంగం) సినిమా గుర్తుందా ? స‌మ‌కాలీన వ్య‌వ‌స్థ‌లో కుళ్లుపోయిన రాజకీయాల‌ను మార్చేందుకు కొంద‌రు యువకులే న‌వ‌త‌రం పార్టీ స్థాపించి పోటీ చేసి ఏకంగా అధికారం చేజిక్కించుకుంటారు. ఈ యువ‌కుల్లో ఎంతో మంది ఉన్నత విద్య అభ్య‌సించిన వారు.. డాక్ట‌ర్లు… సాధార‌ణ యువ‌కులు పోటీ చేసి చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగు పెడ‌తారు. ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు 2011లో …

Read More »

తాడిపత్రిలో హై ఓల్టేజి టెన్షన్

రాష్ట్రంలో 75 మున్సిపాలిటిలకు ఎన్నికలు జరిగినా తాడిపత్రి రూటు మాత్రం సపరేటుగా ఉంది. తాడిపత్రి మున్సిపాలిటిలో 36 వార్డులున్నాయి. వీటిల్లో టీడీపీ 18 వార్డుల్లో గెలవగా వైసీపీ 16, సీపీఐ, ఇండిపెండెంట్ చెరో వార్డులో గెలిచారు. దాంతో రెండు ఓట్ల తేడాతో టీడీపీ ఛైర్మన్ ఖాయమనే అనుకున్నారు. అయితే ఎక్స్ అఫీషియో ఓట్లను పరిగణలోకి తీసుకుంటే వైసీపీకి మెజారిటి వచ్చేస్తుంది. కాబట్టి ఛైర్మస్ స్ధానం వైసీపీ ఖాతాలోనే పడుతుందని అనుకున్నారు. …

Read More »

మంత్రి వ‌ర్గంలోకి రోజా.. తాడేప‌ల్లి ప‌ర్య‌ట‌న అందుకేనా ?

జ‌గ‌న్ కేబినెట్‌లోకి ఫైర్ బ్రాండ్ రోజా రానున్నారా ? త‌న‌కు ఇప్పుడున్న ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌విని ఆమె ఇష్టం లేకుండానే భ‌రిస్తున్నారా? దీనిని వ‌దులుకుని.. త‌ను మంత్రి వ‌ర్గంలో చోటు కోసం విశ్వ‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా ? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు, సీనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న గుస‌గుస వంటివి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి 2019లో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్పాటు అయిన‌ప్పుడే.. రోజాకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని …

Read More »

టీడీపీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలో కూడా వైసీపీనే డిసైడ్ చేస్తుందా?

ఎన్నికల్లో ఓటమితోనే రాజకీయ పార్టీ ఖతమైపోతుందా? రాజకీయం గురించి తెలిసిన వారెవరూ.. అవునన్న మాట చెప్పరు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ విపక్షం టీడీపీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశాధినేత.. పార్టీకి చెందిన నేతలు ఊహించలేరేమో కానీ.. ఏపీ రాజకీయ పరిణామాల్ని సునిశితంగా పరిశీలించే ప్రతి ఒక్కరు వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న అంచనాలు వేసుకున్నారు. అనుకున్నట్లే.. వారు పురపోరులో విజయదుందుబిని మోగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. …

Read More »

స్టాలిన్ కు బీజేపీ షాక్

ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బీజేపీ పెద్ద షాకే ఇచ్చింది. డీఎంకే ఎంఎల్ఏ శరవణన్ బీజేపీలో చేరారు. మధురై జిల్లాలోని తిరుపుప్పరన్ కుండ్రమ్ నియోజకవర్గానికి శరవణన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ ఎంఎల్ఏ చేరికతో బీజేపీలో చేరిన డీఎంకే ఎంఎల్ఏల సంఖ్య రెండుకు చేరింది. గతంలోనే సెల్వమ్ అనే ఎంఎల్ఏ కమలం కండువా కప్పుకున్నారు. నిజానికి డీఎంకే నుండి ఇద్దరు ఎంఎల్ఏలు బయటకు …

Read More »

ఆ ఎనిమిదిమంది ఎవరో ?

అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణంలో నోటీసులు అందుకోబోయే ఎనిమిది ఎవరనే విషయంలో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి భూకుంభకోణం జరిగిందని ప్రభుత్వం మొదటినుండి చెబుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అసైన్డ్ భూముల కుంభకోణానికి బాధ్యునిగా పేర్కొంటు సీఐడీ చంద్రబాబు మీద 120బి, 166, 167, 217 సెక్షన్ల కేసులు నమోదు చేసింది. ఈనెల 23వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ …

Read More »

టీడీపీ అంటే.. ఒక‌రి క‌ష్టం.. అంద‌రి సుఖ‌మా?

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అంటే.. ఒక‌రు క‌ష్ట‌ప‌డితే.. మిగిలిన వారంతా ఎంజాయ్ చేయ‌డ‌మా? ప‌దవులు అనుభ వించేందుకు మాత్ర‌మే టీడీపీ నాయ‌కులు ఉంటారా? పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోను., పార్టీని అభివృద్ధి చేయ‌డంలోను మాత్రం వారికి పాత్ర లేదా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి త‌గిలిన ఎదురు దెబ్బ వంటి కీల‌క విష‌యాల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క టీడీపీ అభిమానీ.. సంధిస్తున్న ప్ర‌శ్న‌లు ఇవే! …

Read More »

బ్రేకింగ్: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

మరో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో హైదరాబాద్ లోని బాబు నివాసానికి అధికారులు చేరుకున్నారు. వాహనాల్లో వెళ్లిన వారు.. చంద్రబాబును కలవాలని చెప్పారు. అందుకు బాబు భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లుగా బాబుకు సమాచారం ఇవ్వటం.. …

Read More »

చంద్రబాబుకు సమయం వచ్చిందా ?

ఎంతసేపు రౌడీయిజంతో గెలిచారు, ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుని గెలిచారు అనే అరిగిపోయిన రికార్డు వేసినందు వల్ల ఉపయోగం ఉండదని చంద్రబాబునాయుడు గ్రహించాలి. పంచాయితి ఎన్నికల్లో మద్దతుదారులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని నిజాయితిగా విశ్లేషించుకోవాలి. పార్టీ తప్పులను ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అప్పుడే తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోగలరు. అలా కాకుండా ఎంతసేపు అధికారాన్ని ఉపయోగించుకుని వైసీపీ గెలిచిందని చెప్పటం వల్ల ఉపయోగం ఉండదని …

Read More »

య‌న‌మ‌ల ఇలాకాలో ఘోర ప‌రాజ‌యం..

టీడీపీలో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న నాయ‌కుడు, చంద్ర‌బాబు త‌ర్వాత‌.. నెంబ‌ర్ 2గా వ్య‌వ‌హ‌రించే నేత‌.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. వ్యూహాలు.. ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌డంలో ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు లేర‌ని ఒక ప్పుడు టాక్‌. అయితే.. ఆయ‌న కొన్నేళ్లుగా వైట్ ఎలిఫెంట్‌గా మారిపోయార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నియోజ‌క‌వ‌ర్గం నుంచి అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలోనే టీడీపీ లోకి వ‌చ్చిన య‌న‌మ‌ల‌.. …

Read More »

విశాఖలో సీన్ రివర్స్.. కారకులెవరు?

అన్ని అనుకున్నట్లు జరిగితే.. విశాఖపట్నం ఏపీకి కాబోయే రాజధాని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కునగరాన్ని ఏపీ రాజధానిగా చేయాలని బలంగా కోరుకోవటం తెలిసిందే. ఆందోళనలు.. నిరసనలు.. విమర్శల్ని లైట్ తీసుకొని మరీ.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఫలితాలు ఆయన రాజధాని కలను నెరవేర్చేలా చేయటమే కాదు.. విశాఖ వైసీపీ నేతల లోగుట్టును బయటపడేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వెల్లడైన …

Read More »

బీజేపీకి సీన్ అర్ధమైపోయిందా ?

తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సీన్ ఏమిటో అర్ధమైపోయినట్లుంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో 2123 వార్డులున్నాయి. వీటిల్లో 490 వార్డులు ఏకగ్రీవమైపోయాయి. వీటిల్లో అత్యధికం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన 1632 వార్డుల్లో 1269 చోట్ల అధికార వైసీపీనే గెలిచింది. వైసీపీ తిరుగుబాటు అభ్యర్ధులు 45 వార్డుల్లో గెలిచారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ 265 వార్డుల్లో గెలిచింది. మరో 2 చోట్ల టీడీపీ …

Read More »