ఎదురు దెబ్బ‌ల‌తో బాబు గుణ‌పాఠం నేర్చుకోరా ?

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. ఒక‌వైపు వైసీపీని టార్గెట్ చేస్తున్నా.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు సొంత పార్టీ నేత‌ల నుంచే వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పార్టీలో ఉన్న అస‌లు సిస‌లు, సీనియ‌ర్ నేత‌ల‌ను కాద‌ని.. వ‌ల‌స నేత‌ల‌పై పార్టీ అధినేత చంద్ర‌బాబు.. ఆశ‌లు పెట్టుకున్నార‌నే ఆ పార్టీ నేత‌ల మ‌ధ్యే అస‌హ‌నంతో కూడిన చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. మునిసిప‌ల్‌, తిరుప‌తి ఉప ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీలో ఒక విధ‌మైన‌.. నైరాశ్య ఏర్ప‌డింది. చంద్ర‌బాబు కేవ‌లం ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు త‌ప్ప‌.. పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సీనియ‌ర్లు సైతం కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు స‌రే.. కానీ.. సొంత పార్టీ విష‌యంలోనూ యాక్టివ్‌గా వ్యూహాలు వేయ‌లేక పోతున్నార‌నే వాద‌న ఉంది.

అదే స‌మ‌యంలో పార్టీలో ఉన్న లోసుగులను గుర్తించి, అంత‌ర్గ‌త క‌ల‌హాల‌ను గుర్తించి వాటిని ప‌రిష్క‌రించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని సీనియ‌ర్లు కొన్నాళ్లుగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వారిని కూడా చంద్ర‌బాబు లెక్క‌చేయ‌డం లేదు. చంద్ర‌బాబు పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఏ సీనియ‌ర్ నేత‌ల‌తో అయితే చ‌క్క‌భ‌జ‌న‌లు చేయించుకున్నారో… ఇప్పుడు కూడా నిజం నిష్క‌ర్ష‌గా చెప్పే నేత‌ల‌ను కాద‌ని.. ఆ భ‌జ‌న ప‌రుల‌కే ప్ర‌య‌ర్టీ ఇస్తోన్న ప‌రిస్థితి. పార్టీ ఓడిన రెండేళ్ల‌లోనే సంస్థాగతంగా ఒక‌ప్పుడు.. బ‌లంగా ఉన్న నియోజక‌వర్గాల్లోనూ ఇప్పుడు బ‌లహీనంగా ఉంది. కీల‌క‌మైన నేత‌లు.. చాలా మంది పార్టీకి దూరంగా ఉంటున్నా రు.

ఎప్పుడూ క‌నిపించే య‌న‌మ‌ల‌, వ‌ర్ల‌, క‌ళా, అయ్య‌న్న‌.. స‌హా ఇలా కొంద‌రు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నారు. అయితే.. వీరంతా ఫేడ్ అవుట్ అయిపోయిన నేత‌లే. సో.. దీంతో పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలోనే.. పార్టీలో యువ‌త‌ను ప్రోత్స హించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దిశ‌గా అడుగులు వేసింది లేదు. ఇక‌, ఇప్పుడు యువ‌త‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌యోగం చేసే బ‌దులు.. ఇప్ప‌టికే వైసీపీలో అసంతృప్తులు గా ఉన్న‌వారు.. పారిశ్రామికంగా.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న‌వారిని ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. వ‌ల‌స నేత‌ల‌పైనే చంద్ర‌బాబు పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకుంటున్నారు.

ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే కాదు.. గ‌తంలో పార్టీ బ‌లంగా ఉన్న‌ప్పుడు.. అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా పార్టీలో నేత‌ల‌ను కాద‌ని.. వైసీపీ నుంచి వ‌చ్చిన న‌లుగురు నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చి ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్నారు. మ‌రి బాబు ఇప్పుడు కూడా అదే త‌ప్పు రిపీట్ చేస్తోన్న ప‌రిస్థితే ఉంది. ఎదురు దెబ్బ‌ల నుంచి బాబు ఇంకా గుణ‌పాఠాలు నేర్పిన‌ట్టు అయితే లేరు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)