రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న.. తన కలను, పట్టుదలను సాకారం చేసుకునేందుకు ఏపీ సీఎం జగన్ అంతే వేగంగా పావులు కదుపుతున్నారు. అమరావతిని కేవలం ఓ సామాజిక వర్గం కోసమే నిర్మాణం చేశారన్న ఆయన దానిని కేవలం చట్టసభల రాజధానిగా ఉంచేసి.. విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని సమతుల్యం చేస్తామని.. తద్వారా.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవకాశం …
Read More »టీడీపీలో సీనియర్ల దుమారం.. కీలక సమయంలో సీన్ రివర్స్ ?
తీవ్ర ఇరకాటంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఏ విధంగా ముందుకు నడిపించాలనే విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు సీనియర్లు తమ దారిలో తాము నడుస్తున్నారు. తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు నాయకులు పార్టీకి ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. మరికొందరు ఇప్పుడున్న నాయకత్వం మారాలని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కొన్నాళ్ల కిందట కుప్పంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. పార్టీ నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని …
Read More »అన్న అవుట్… తమ్ముడైనా టీడీపీని కాపాడతాడా ?
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏంటి? ఎవరూ ముందుకు రావడం లేదా? ఎవరూ పార్టీని పట్టించుకోవడం లేదా? అంటే.. ఔననే సంకేతాలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడు సార్లు విజయం దక్కించుకుంది. ఈ మూడు సార్లు కూడా 1983, 1985, 1994 ఎన్నికల్లో శంబంగి వెంకట చిన అప్పలనాయుడు టీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. ఇక, ఆ తర్వాత .. పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి …
Read More »రాధా ఏమయ్యారు… ఎక్కడున్నారు?
విజయవాడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దివంగత కాపు నేత వంగవీటి రంగా వారసుడిగా అరంగేట్రం చేసిన వంగవీటి రాధా.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత.. ఆయన రాజకీయంగా చేసిన తప్పులు కావొచ్చు.. లేదా.. వేసిన అడుగులు కావొచ్చు.. ఆయనకు రాజకీయ ఫ్యూచర్ లేకుండా చేశాయనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు ? ఎక్కడ ఉన్నారు ? అనే విజయవాడలో జోరుగా …
Read More »సానుభూతిపైనే కేసీయార్ ఆశలు ?
అవును నాగార్జునసాగర్ ఉపఎన్నికలో దివంగత ఎంఎల్ఏ నోముల నర్సింహయ్య కొడుక్కి టికెట్ ఇవ్వటంతోనే ఈ విషయం అందరికీ అర్దమైపోయింది. నోముల కొడుకు నోముల భగత్ కు కేసీయార్ పార్టీ కార్యాలయంలో బీఫారమ్ అందించారు. దాంతో సాగర్ ఉపఎన్నికలో కూడా కేసీయార్ సానుభూతి రాజకీయాలకే కట్టుబడినట్లుగా అర్ధమైపోయింది. మొన్నటి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలో కూడా కేసీయార్ దివంగత ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో …
Read More »వీడియో తీసి పంపితే రూ.10వేలు ఇస్తారట
ఏపీ తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తు వేసింది. తాము అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికార వైసీపీ నేతలు దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతుందన్న ఆరోపణల్ని తరచూ చేయటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను పంపి బెదిరింపులు.. దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని తరచూ చెప్పటమే కానీ.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్దగా బయటకు రాని పరిస్థితి. దీంతో.. కొత్త ఆఫర్ ను ప్రకటించారు ఏపీ …
Read More »4 లక్షలు… కాదు.. 5 లక్షలు.. ఈ బెట్టింగులు ఎవరి కోసమే తెలుసా?
4 లక్షలు ఖాయం అన్నా.. అని ఒకరు అంటే.. కాదు తమ్ముడూ.. 5లక్షలు దాటుద్ది!-అని అటు నుంచి మరొకరు.. ఇదీ.. ఇప్పుడు తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, బెట్టింగురాయుళ్ల మధ్య జరుగుతున్న సంభాషణ. ఒకప్పుడు క్రికెట్ కు మాత్రమే పరిమితమైన బెట్టింగులు ఇప్పుడు… రాజకీయాలకు కూడా విస్తరించాయి. ఆ మాటకొస్తే.. 2019 ఎన్నికల్లో ఈ తరహా బెట్టింగులు జోరుగా సాగాయి. అనంతపురం …
Read More »ఆదిలోనే బీజేపీ అభ్యర్థి నోరు జారేరే!
రాజకీయ అరంగేట్రంతోనే నోరు జారారు.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి.. రత్నప్రభ. నామినేషన్ వేయడానికి ముందు.. మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆమె.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. వాస్తవానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన తర్వాత.. వైసీపీ నుంచి ఆమెకు ఆఫర్ వచ్చింది. ఈ క్రమంలోనే ఏపీలో దివ్యమైన …
Read More »విశాఖ ఉక్కులోకి వెంకయ్యను లాగడం సమంజసమేనా?
ఆంధ్రుల హక్కు సెంటిమెంటుగా మారిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుండడం , దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉందనే ప్రచారం జరుగుతుండడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో విశాఖలో మరోసారి కార్మికులు, ప్రజలు కూడా ఉద్యమిస్తున్నారు. ఉక్కు పరిశ్రమను ఎట్టిపరిస్థితిలోనూ ప్రైవేటీకరించడానికి వీల్లేదని వీళ్లు గర్జిస్తున్నారు. ఇక, వీరి ఉద్యమానికి అధికార పార్టీ సహా అన్ని పార్టీలు, నేతలు, మేధావి వర్గాలు కూడా …
Read More »బీజేపీకి ఇష్యూయే దొరకటంలేదా ?
వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజమట. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి, రాష్ట్రంలో తామే ఇఫుడు నిజమైన ప్రతిపక్షమని గొంతుచించుకునే పార్టీకి ఇష్యు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ తరపున రత్నప్రభ పోటీచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు సమస్యేమిటంటే కమలంపార్టీకి అభ్యర్ధే పెద్ద మైనస్. ఎందుకంటే అభ్యర్ధి పార్టీ నేతల్లోనే చాలామందికి పరిచయమే లేదు. నేతలకే పరిచయం లేదంటే ఇక మామూలు జనాలగురించి చెప్పాల్సిన …
Read More »రాహుల్ ఇక పప్పు కాదు..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతున్న కాలానికి తగినట్లే.. మనుషుల అభిప్రాయాలు.. భావాలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరేళ్ల క్రితం రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చినంతనే.. యువరాజు.. పప్పు.. అమూల్ బేబీ లాంటి మాటలు వినిపించేవి. అప్రయత్నంగా పెదాల మీదకు చిన్న నవ్వు వచ్చేసేది. అయితే..ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గడిచిన కొంతకాలంగా తన మాటలతో.. చేతలతో ఆయన తన ఇమేజ్ ను తనకు తానే మార్చుకున్నారని చెప్పాలి. ధనుష్కోటి …
Read More »ఏపిలో మళ్ళీ హై అలర్ట్ ?
కరోనా సమస్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది కేసులు ప్రతిరోజు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రాత్రుళ్ళు కర్ఫ్యూ, రాత్రిళ్ళు లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్ని కఠినచర్యలు తీసుకున్నా కరోనా వైరస్ కేసుల సంఖ్య అయితే పెరిగిపోతున్నాయి. ఇపుడీ ఈ జాబితాలో ఏపి కూడా చేరుతున్నట్లే ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో వెయ్యికేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates