ఇపుడిదే అంశం తెలంగాణాలో హాట్ టాపిక్ అయిపోయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం చివరకు ఎటూ కాకుండా పోతుందేమో అనే డౌట్లు పెరిగిపోతోంది. నిజానికి ఉపఎన్నికలో నామినేషన్ వేసేముందు వరకు చాలా గుంభనంగా ఉంచాల్సిన సీక్రెట్ ను కౌశిక్ తన అత్యుత్సాహంతో రివీలో చేసేశారు. దాంతో టీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టేయటంతో పాటు అందరి ముందు పలుచనైపోయారు.
ఇంతకీ విషయం ఏమిటంటే కౌశిక్ ను కాంగ్రెస్ పార్టీలో నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. నిజానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఉపఎన్నికలో కౌశికే బలమైన అభ్యర్ధి అనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో రెడ్డి టీఆర్ఎస్ కీలక నేతలతో టచ్ లోకి వెళ్ళారు. మరి తానే టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయి పోటీ చేయాలని అనుకున్నారో ? లేకపోతే టీఆర్ఎస్ కీలకనేతలే కౌశిక్ ను చేర్చుకుని టికెట్ ఇవ్వాలని అనుకున్నారో తెలీదు.
మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న రెడ్డి ఈమధ్య కేటీయార్ తో రహస్యంగా భేటీ అయ్యారు. ఈ విషయం బయటకు పొక్కటంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఇదే సమయంలో కౌశిక్ స్ధానిక నేతలతో మాట్లాడుతూ టీఆర్ఎస్ తరపున పోటీచేయబోయేది తానే అని చెప్పినట్లుగా ఓ ఆడియో లీక్ అయ్యింది. ఉపఎన్నికల సందర్భంగా మందు, డబ్బు ఎంత కావాలన్నా తాను వెదచల్లుతానని హామీ ఇచ్చిన ఆడియో బయటకు పొక్కింది.
నిజానికి టీఆర్ఎస్ వ్యూహం ఏమిటంటే అభ్యర్ధి విషయాన్ని ప్రకటించకుండా చివరి నిముషం వరకు గుంభనంగా ఉంచాలని. నామినేషన్ తేదీ దగ్గరకు వచ్చినపుడు కౌశిక్ ను ప్రకటించటానికి డిసైడ్ అయ్యిందట. ఆపని చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని కోలుకోనీయకుండా దెబ్బ తీయచ్చని వ్యూహం పన్నారట. అయితే కౌశిక అత్యుత్సాహంతో తమ వ్యూహం కాస్త బయటపడిపోయింది. అందుకనే కౌశిక్ ను బహిష్కరించి ఆయన స్ధానంలో మరో నేతను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ నుండి కౌశిక్ బహిష్కరణకు గురయ్యాడు కాబట్టి తర్వాత ఏమిటి ? అనేది అర్ధం కావటంలేదు. ఇపుడు కౌశిక్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేది డౌటేనట. ఒకవేళ టీఆర్ఎస్ గనుక కౌశిక్ ను పోటీ చేయిస్తే ఆయన మాట్లాడిన ఆడియోను కాంగ్రెస్ అస్త్రంగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇదే సమయమంలో బీజేపీ కూడా కేసీయార్ ను టార్గెట్ చేయటం ఖాయం. కాంగ్రెస్+బీజేపీ టార్గెట్ ను తప్పించుకోవాలంటే కౌశిక్ ప్లేసులో కొత్త అభ్యర్ధిని పెట్టే అవకాశం ఉందంటున్నారు. చివరకు కేసీయార్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates