Political News

బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాహుల్ గాంధీ సన్నిహితుడు

రోజు రోజుకీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో దారుణంగా తయారౌతోంది. ఓ వైపు బీజేపీ బలపడుతుంటే.. మరో వైపు కాంగ్రెస్ బలహీనపడుతోంది. దీనికి తోడు.. తాజాగా… రాహుల్ గాంధీకి ఊహించని షాక్ ఎదురైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ .. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువ నేత జితిన్ ప్రసాద బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి …

Read More »

కేసీఆర్ దూకుడు.. కృష్ణాన‌దిపై కీల‌క ప్రాజెక్టు.. జ‌గ‌న్ వ్యూహం ఏంటి?

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదాలు అంద‌రికీ తెలిసిందే. మేం ఇద్ద‌రం ఒక‌టే.. అని బాహాటంగా ప్ర‌క‌టించుకున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లు.. న‌దులు, నీళ్ల విష‌యానికి వ‌చ్చే స‌రికి ఎవ‌రి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు వారే చూసుకున్నారు. ఇప్ప‌టికీ వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. తాజాగా కృష్ణాన‌దిపై సోమ‌శిల ప్రాజెక్టు వ‌ద్ద‌.. కేసీఆర్ ఓ వంతెన నిర్మాణానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు గుప్పు మంటున్నాయి.ఈ వంత‌నె నిర్మాణం పూర్త‌యితే.. …

Read More »

ఈటలకు అంత సీన్ ఉందా ?

పాండవులన్నారు.. కౌరవులన్నారు.. కురుక్షేత్రమని, ధర్మక్షేత్రమని చాలా చాలా మాటలు మాట్లాడారు బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉపఎన్నికను కురుక్షేత్రంగా పోల్చారు. పాండవులు అంతిమవిజయాన్ని అందుకున్నట్లే ఉపఎన్నికనే కురుక్షేత్రం పోరులో తనదే అంతిమ విజయమని ఢంకా బజాయించకుండానే ఈటల ప్రకటించారు. ఉపఎన్నికల్లో జనాలు కేసీయార్ కు ఏ విధంగా బుద్ధి చెబుతారో అందరు చూస్తారంటు జోస్యంచెప్పారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలనుకలిసి వరంగల్ జిల్లాలోని కమలాపూర్ గ్రామంలోని తన సొంతింటికి తిరిగివచ్చిన …

Read More »

ప్రభుత్వం సహకారం జరిగేపనేనా ?

జగన్మోహన్ రెడ్డికి కృష్ణపట్నం ఆనందయ్య లేఖ రాశారు. ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా కరోనా వైరస్ మందును సరపరా చేస్తానని చెప్పారు. అయితే ఆనందయ్య లేఖపై స్పందించటం ప్రభుత్వానికి అంత ఈజీకాదు. ఎందుకంటే సానుకూలంగా స్పందిస్తే ఒక సమస్య. అలాగని నిరాకరిస్తే మరోసమస్య. సాధ్యాసాధ్యాల గురించి, క్షేత్రస్ధాయిలో వాస్తవాల గురించి లాజికల్ గా ఆలోచించే ప్రతిపక్షాలు లేవు కాబట్టే ప్రతి చిన్న విషయం ఏపిలో రాజకీయ …

Read More »

అనిత‌మ్మ‌.. దారెటు? పుంజుకున్నా.. ఫ్యూచ‌ర్ క‌ష్ట‌మే!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో కొంద‌రు నేత‌ల విష‌యంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. గ‌త ఎన్నిక‌లకు ముందు నెల‌కొన్న ఈ ప‌రిస్తితి ఇప్ప‌టికీ కొన‌సాగుతుండ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ధానం గా టీడీపీ అనుబంధ తెలుగు మ‌హిళ‌ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత విష‌యం పార్టీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌గా మారింది. 2014లో అనూహ్యంగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ప్ర‌భుత్వ టీచ‌ర్ అనిత‌. అప్ప‌ట్లో విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట …

Read More »

ఈటెల ఎఫెక్ట్ : త్వరలో జిల్లాగా హుజూరాబాద్ !!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ కు తెర‌ప‌డి ఉప ఎన్నిక వైపు వేగంగా ప‌రిణామాలు మారుతున్న సంగ‌తి తెలిసిందే. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్ప‌డ‌మే కాకుండా ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేయ‌నున్న‌ట్లు ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరగడం ఖాయంగా మారింది. హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప‌రోక్షంగా ముందుకు …

Read More »

జ‌గ‌న్ స‌ర్కారుపై బీజేపీ మెరుపు ‘దీక్ష‌’ రీజ‌నేంటి?

ఏపీ బీజేపీ నేత‌లు ఒక్క‌సారిగా జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా.. ఎంపీ నుంచి ఎమ్మెల్సీ వ‌ర‌కు, రాష్ట్ర స్థాయి నేత నుంచి మండ‌ల‌స్థాయి నాయ‌కుడి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక్క‌సారిగా మెరుపు స‌మ్మెకు దిగారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ దీక్షల ప‌ర్వం.. ఒక్క‌సారిగా బీజేపీలో ఉత్సాహం నింపింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదీ రీజ‌న్‌..రాష్ట్రంలో జ‌గ‌న్‌ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి …

Read More »

జ‌గ‌న్ మాన‌సిక స్థితి స‌రిగాలేదు.. లోకేష్ కామెంట్స్‌

సీఎం జ‌గ‌న్ విష‌యంలో ఆయ‌న సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌రాజు చేసిన కామెంట్లు నిజ‌మ‌ని.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామ చెప్పినట్లు జగన్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని విమర్శించారు. మూడో దశలో పిల్లలపై కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం ముఖ్య‌మంత్రి మాన‌సిక ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంద‌న్నారు. ప‌దో త‌ర‌గ‌తి, …

Read More »

ద‌టీజ్ విజ‌య‌శాంతి… ఓవైసీకి మామూలు కౌంట‌ర్ కాదు

తెలంగాణ‌లో రాజ‌కీయం హాట్ హాట్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ న‌డుస్తుంటే మ‌రోవైపు టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అంటూ కామెంట్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండ‌గా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమ‌ర్శించారు. అయితే, ప్రధాని మోడీపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత …

Read More »

మోడీ కథ ఎంత రివర్స్ అయ్యిందంటే..

రాజీవ్ గాంధీ మరణానంతరం గత మూడు దశాబ్దాల్లో మరే ప్రధానికీ రాని పాపులారిటీ నరేంద్ర మోడీ సొంతం అంటే అతిశయోక్తి కాదు. ప్రధాని కావడానికి ముందు, తర్వాత ఆయనకు లభించిన ఆదరణ అపూర్వం. ఒకప్పుడు మోడీ ఏం చెప్పినా, ఏం చేసినా ఆకర్షణీయంగానే ఉండేది. ఆయన మాటను భాజపా కార్యకర్తలే కాదు.. సామాన్యులు సైతం శ్రద్ధగా వినేవాళ్లు. ఆయనేం చెప్పినా నమ్మేవాళ్లు. 2014లో అధికారంలో వచ్చిన తర్వాత మోడీ ఫాలోయింగ్ …

Read More »

రాష్ట్రాలకు మోడీ సర్కారు వారి ‘టీకా రూల్స్’

దేశంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా ఇస్తానంటూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేయటం తెలిసిందే. దేశీయంగా టీకా సంస్థలు తాము ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతం కేంద్రానికి ఇచ్చి.. 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు సెక్టార్ కు ఇవ్వనున్నట్లగా చెప్పారు. ఉచిత వ్యాక్సిన్ మాట చెప్పిన మోడీ.. రాష్ట్రాలకు ఏ తీరులో అలాట్ చేస్తారన్న కీలక అంశాన్ని మాత్రం వ్యూహాత్మకంగా వెల్లడించలేదన్న అభిప్రాయం ఉంది. ఇదలా …

Read More »

వైజాగ్‌లో రచ్చ రచ్చవుతున్న ‘కూల్చివేత’

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా కట్టే భవనాల కంటే కూల్చివేసిన నిర్మాణాలే ఎక్కువ అంటూ ప్రతిపక్షాలు, వ్యతిరేక వర్గాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ఐతే ఎవరేమన్నా సరే ప్రజావేదికతో మొదలుపెడితే.. నిర్మాణాలను కూల్చుకుంటూనే వెళ్తోంది జగన్ ప్రభుత్వం. ఐతే మిగతావి ప్రతిపక్షం నేతల మీద కోపంతో కూల్చివేశారు కాబట్టి చెల్లిపోయింది కానీ.. ఇప్పుడు విశాఖపట్నంలో 140 మంది మానసిక వికలాంగులు ఉంటున్న పాఠశాలను కూల్చివేయడంతో …

Read More »