వైసీపీలో ఎప్పటి నుంచో అసంతృప్తులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో గోరంట్ల ఎపిసోడ్ తర్వాత ఇది చర్చకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా, ముఖా ముఖి మాట్లాడాలన్నా కష్టమనే మాట ఎక్కువగా వినబడుతోంది. ఈ మాటలు పెరిగి పెరిగి పెద్దవై పోయి చివరకు గోరంట్ల బుచ్చయ్యలా ఎదురు తిరిగే పరిస్ధితిగా మారకూడదని అనుకుంటే జగన్ వెంటనే మేల్కొనాల్సిందే. వాస్తవానికి రఘురామరాజు చేసిన ప్రధాన ఆరోపణ కూడా ఇదే. ఆయన …
Read More »ఏపీ స్కూళ్లలో బయపడతున్న కరోనా ..
మొన్న 16వ తేదీన స్కూళ్ళు తెరిచిన దగ్గర నుంచి కరోనా వైరస్ మళ్ళీ బయటపడుతోంది. 16వ తేదీ నుంచి ఏపీలో హై స్కూళ్ళు తెరిచిన విషయం అందరికీ తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఒంగోలులోని ఓ స్కూల్ లో పరీక్షలు చేస్తే నలుగురు టీచర్లు, ముగ్గురు విద్యార్ధులకు కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దాంతో వెంటనే స్కూలును మూసేశారు. తాజాగా కృష్ణ జిల్లా, ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రు గ్రామంలోని స్కూల్ …
Read More »రేవంత్ హెచ్చరికలు.. సీనియర్లకేనా!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మరోస్థాయికి చేరింది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పదునైన విమర్శలు చేస్తూ.. సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల ఆదరణ పొందే దిశగా అడుగులు వేస్తున్న ఆయన.. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. పార్టీలో పనిచేసే యువకులకే ప్రాధాన్యత ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో వాళ్లకే టికెట్లు దక్కుతాయని స్పష్టం …
Read More »కేసీఆర్ అటు నుంచి నరుక్కొస్తున్నారా?
ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కేసీఆర్ అంటే మొండిఘటమనే పేరుంది. ఆయన అనుకున్నది సాధించి తీరుతారని బయట అందరూ అనుకుంటుంటారు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకంటారా.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైన హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలే అందుకు నిదర్శనం. తనపై భూ కబ్జాకోరు ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ …
Read More »ఫరూఖ్ చంద్రబాబుకు ఆ హెల్ప్ చేస్తారా.. ?
తెలుగుదేశానికి ఇపుడు అన్ని వర్గాల మద్దతు కావాలి. టీడీపీ అంటే బీసీల పార్టీ అని ముద్ర పడింది. అయితే ఆ బీసీలను వైసీపీ ఒడుపుగా లాగేసింది. 2019 ఎన్నికల్లో వారు బాగానే ఫ్యాన్ పార్టీ వైపు టర్న్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వారిలో కొంత అసంతృప్తి ఉన్నా కూడా పూర్తిగా టీడీపీ కొమ్ము కాస్తారని ఎవరూ చెప్పలేరు. ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో బీసీల ఓట్లను వైసీపీతో కలసి పంచుకోవలసిందే. మరో …
Read More »జగన్ సర్వే టీడీపీకి ఊపిరి పోసిందే!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలన పూర్తి అవుతున్న సందర్భంగా చేయించుకున్న సర్వే వైసీపీలో ఆందోళనను రేకెత్తిస్తే.. టీడీపీకి ఏకంగా ఊపిరే పోసిందట. రాజకీయాల్లో ఓ పార్టీ ఆందోళనలో కూరుకుపోతే.. దాని ప్రత్యర్థికి కొత్త శక్తి వచ్చినట్టే కదా. ఆ లెక్క మాదిరిగానే.. ఏపీలో వైసీపీలో కొత్తగా రేకెత్తిన ఆందోళన.. టీడీపీకి కొత్త జవసత్వాలను ఇచ్చిందట. ఇందుకు నిదర్శనంగా వైసీపీ అధికారంలోకి రాగానే.. దాదాపుగా …
Read More »జగన్ పై కేవీపీ కామెంట్లు చూశారా ?
రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డే పవర్ ఫుల్ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టంగా చెప్పారు. జగన్ పై జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసిందని ఇండియా టు డే ప్రచురించిన మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేవీపీ మాట్లాడుతూ ఆ సర్వేని కొట్టిపారేశారు. మీడియాతో కేవీపీ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే జగనే చాలా పవర్ ఫుల్ అని …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి.. హీటెక్కిన నగరం పాలిటిక్స్
విజయనగరం జిల్లాపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా ? ఇక్కడ టీడీపీ హవాను తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును డైల్యూట్ చేయడం ద్వారా.. జిల్లాలో టీడీపీకి కేరాఫ్ లేకుండా చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అశోక్ చైర్మన్‌గా ఉన్న మాన్సాస్ ట్రస్టు.. …
Read More »పవన్ ను తీసిపారేసిన బండి
తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జనసేన మద్దతు తీసుకునే విషయంలో ఏమీ ఆలోచించలేదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మద్దతు విషయమై మాట్లాడారా అన్న ప్రశ్నకు ఇంకా లేదన్నారు. మద్దతు తీసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇపుడా విషయాన్ని ఆలోచించ లేదన్నారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. జనసేన విషయంపై ఏమడిగినా …
Read More »అఫ్గన్ ఇల్లు కాలుతుంటే చైనా చలికాచుకుంటోంది
పొరుగునే ఉన్న ఆప్ఘనిస్థాన్లో పరిణామాలతో డ్రాగన్ పిచ్చ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆప్ఘన్లో ఉన్న ఖనిజాలపై చైనా ఎప్పటినుండో కన్నేసింది. అయితే ఖనిజాలను సొంతం చేసుకోవడం ఇంతకాలం డ్రాగన్ కు సాధ్యం కాలేదు. గతంలోనే ఖనిజాల మైనింగ్ కు చైనా ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల తవ్వకాలు సాధ్యంకాలేదు. అలాంటిది ఇపుడు ఆ ఒప్పందాలన్నీ స్పీడవుతున్నాయి. అష్రఫ్ ఘనీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ దేశంలో చైనా ఏకపక్షంగా పనులు …
Read More »కీలక సమయంలో టీడీపీని వదిలేశారే…!
టీడీపీకి పెద్ద సమస్యే వచ్చి పడింది. పార్టీలో నేతలు.. క్రియాశీలకంగా లేరు. ఉన్నవారు కూడా అధినేత చెప్పిన మేరకు మాత్రమే నడుచుకుంటున్నారు. తప్ప.. తమకంటూ..ప్రత్యేక వ్యూహాలతో ముందుకుసాగుతున్న నేతలు కనిపించడం లేదు. ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలన్నా.. నిరసన వ్యక్తం చేయాలన్నా.. కూడా చంద్రబాబు స్వయంగా కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ పరంగా పుంజుకునే అవకాశాలు కనపడడం లేదు. పైగా.. చంద్రబాబుపైనే భారంపడుతోంది. పార్టీని ముందుకు నడిపించేందుకు అవసరమైన …
Read More »పాదయాత్రలతో ఫలితం దక్కేనా?
ఇప్పుడు తెలంగాణలో పాదయాత్రల సీజన్‌కు తెరలేచిందనే చెప్పాలి. ఇప్పటికే జన ఆశీర్వాద్ యాత్ర పేరుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో తిరిగేస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ చేపడుతోన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే అధిష్ఠానం ఆదేశాలతో కిషన్ రెడ్డి ఈ యాత్ర చేస్తున్నారు. ఆ క్రమంలోనే మాట్లాడిన చోటల్లా రాష్ట్రంలోని అధికార ప్రభుత్వంపై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates