Political News

అందుకే రాహుల్ గాంధీని తీసుకొస్తానంటున్న రేవంత్‌

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి య‌మ జోరుమీదున్నారు. అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి పుట్టించ‌డంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో స‌రికొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. స‌భలు, ర్యాలీల‌తో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఇలా వివిధ ర‌కాల కార్య‌క్ర‌మాల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న రేవంత్‌కు సొంత పార్టీ సీనియ‌ర్ల నుంచి మాత్రం ఇప్ప‌టికీ ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు …

Read More »

ఆఫ్ఘన్ ను బిగించేస్తున్న ప్రపంచం

తాలిబన్లు చెరపట్టిన ఆఫ్ఘనిస్థాన్ ను యావత్ ప్రపంచం అన్ని వైపుల నుండి బిగించేస్తోంది. అన్ని వైపుల నుండి బిగించేయటమంటే దేశంలోని జనాలను ఇబ్బందులకు గురిచేయటం ప్రపంచ దేశాల టార్గెట్ కాదు. వాళ్ళ టార్గెట్ అంతా తాలిబన్లను లొంగదీసుకోవటమే. ఈ విషయంలో ముందుగా అమెరికా చొరవ చూపించింది. అమెరికాను తర్వాత ఇంగ్లాండ్, జర్మనీ తదితర దేశాలు ఫాలో అవుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా ఆప్ఘనిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించింది. …

Read More »

ఆదిలోనే షర్మిలకు షాక్.. కీలక నేత రాజీనామా..!

తెలంగాణ రాజకీయాల్లో సత్తాచాటేందుకు వైస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆమె ఆశలన్నీ ఆదిలోనే అడియాశలు అవుతున్నాయి. ఆమె పార్టీ ప్రారంభించి కనీసం జనాల్లోకి కూడా పూర్తిగా వెళ్లకముందే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. వైస్‌ షర్మిల పెట్టిన కొత్త పార్టీ కి సీనియర్‌ నాయకులు ఇందిరా శోభన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేస్తూ… రాజీనామా పత్రాన్ని విడుదల చేశారు. …

Read More »

టీడీపీ, జనసేన ఒకటవుతున్నాయా ?

తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహితంగా ఉండే వర్గాల సమాచారం ప్రకారం రాబోయే కాలంలో మళ్ళీ టీడీపీ, జనసేన ఒకటవబోతున్నాయట. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ కుదేలైపోయాయి. తెలుగుదేశం పార్టీకన్నా 23 ఎంఎల్ఏ, 3 ఎంపీ సీట్లు దక్కాయి. మిగిలిన కాంగ్రెస్, బీజేపీ, జనసేనకు ఏమీ దక్కలేదు. జనసేన తరపున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలిచారు కానీ ఆయన కూడా వైసీపీ నేతే. రాజోలు నియోజకవర్గంలో …

Read More »

కాబూల్ విమాన మృతుల్లో యువ ఫుట్ బాల్ ప్లేయర్..!

ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించేశారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ ని ఆక్రమించుకున్నారనే విషయం తెలియగానే.. దేశ ప్రజలు భయంతో వణికిపోయారు. ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆఖరికి విమానాల పైకి ఎక్కి మరీ ప్రయాణం చేశారు. అలా అమెరికా సైనిక విమానం పట్టుకుని వేలాడి ముగ్గురు చనిపోయారు. వారిలో ఆఫ్ఘాన్ యువ ఫుట్ బాల్ ఆటగాడు జకీ అన్వారీ కూడా ఉండటం …

Read More »

మంత్రి అవంతి రాస‌లీల‌లు.. వైర‌ల్ వీడియో ప్రకంప‌న‌లు!

వైసీపీలో కీల‌క నేత‌గా.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా.. మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు.. ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ అధికారంలోకి రాక‌ముందు.. గ‌త ఎన్నిక‌ల‌కుముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన అవంతి.. విశాఖప‌ట్నం జిల్లా భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా అవ‌కాశం ద‌క్కించుకున్నారు. అప్ప‌టి నుంచి చిన్న‌పాటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. త‌న హ‌వాను మాత్రం …

Read More »

రాజీనామా ప్రచారంపై గోరంట్ల ఫస్ట్ రియాక్షన్ ఇదే

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గోరంట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు కలిసి మాట్లాడారు. కొంద‌రితో త‌న‌కు ఇబ్బందులున్న‌ట్టు గోరంట్ల త‌మ దృష్టికి తెచ్చార‌ని, కానీ, ఆయన రాజీనామా చేయబోరని అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి చిన‌రాజ‌ప్ప మీడియాకు వెల్లడించారు. ఈ …

Read More »

ప‌వ‌న్‌ను ఓడించిన నేత‌కు ఇన్ని తిప్ప‌లా ?

గాజువాక రియల్ హీరోగా జగన్ మెప్పు పొంది జనం తీర్పుతో ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డికి ఇదే మొదటి చివరి అవకాశం అంటున్నారు. ఆయన అంతకు ముందు 2009, 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడారు. ఆ సానుభూతి, జగన్ వేవ్ కలసి రావడంతో 2019 ఎన్నికల్లో ఆయన మూడవసారి పోటీ చేసినా జనం గెలిపించారు. మరో వైపు పవన్ కళ్యాణ్ కేవలం రీల్ హీరో మాత్రమేనని, రియల్ …

Read More »

రెండు ద‌శాబ్దాల రాజ‌కీయంలో గంటాకు తొలిసారి ఎంత క‌ష్టం ?

గంటా శ్రీనివాస‌రావు… ఆయన ముందు విశాఖలో ఒక మీడియా సంస్థలో ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి వచ్చారు. ఇక అక్కడ నుంచి రాజకీయ నాయకులతో పరిచయాలు కావడంతో ఆ వైపుగా ఆసక్తి మళ్ళింది. అయితే ఆయన మొదట ఎంచుకున్న పార్టీ బీజేపీ కావడం విశేషం. కానీ 1999 ఎన్నికల వేళ విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటుకు సరైన అభ్యర్ధి లేకపోవడంతో చంద్రబాబు తటస్థులకు …

Read More »

తాలిబన్లకు సవాలు విసురుతున్న పంజ్ షీర్

ఆఫ్ఘనిస్ధాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తాలిబన్లకు సవాలు విసురుతున్నారు. దేశంయావత్తు తాలిబన్ల చేతిలోకి వెళ్ళిపోయినా ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ మాత్రం తానే అధ్యక్షడినని ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీయే దేశం విడిచిపారిపోయిన తర్వాత దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సలేహ్ ఏమి ప్రకటించుకుంటే మాత్రం ఉపయోగం ఏమిటి ? ఇపుడిదే అంశంపై అంతర్జాతీయస్ధాయిలో చర్చ మొదలైంది. తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షునిగా ప్రకటించుకున్న సలేహ్ ఇపుడెక్కడున్నారు ? …

Read More »

బాబుకి షాక్.. టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో ఊహించని షాక్ ఎదురైంది. తెలుగు దేశం పార్టీకి.. సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య… టీడీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనితీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గోరంట్ల …

Read More »

తాలిబాన్లతో మీరు మాట్లాడండి.. ఓవైసీకి రాములమ్మ కౌంటర్

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై బీజేపీ మహిళా నేత విజయశాంతి కౌంటర్ వేశారు. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్న విషయమై.. ఓవైసీ చేసిన కామెంట్స్ పై రాములమ్మ కౌంటర్ వేయడం గమనార్హం. బుధవారం అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. భారత్ తాలిబన్లతో చర్చలు జరపాలని సూచించారు. దీనిపై స్పందించిన విజయశాంతి దీటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. “తాలిబన్లతో మీరే చర్చలు జరిపి రండి” అని సమాధానం ఇచ్చారు. “భారత్‌లోని …

Read More »