Political News

ఆన్ లైన్ టికెట్ల మీద ఏపీ మంత్రి ఇచ్చిన తాజా క్లారిటీ ఇదే

ఏపీలోని సినిమాహాళ్ల టికెట్లను ఆన్ లైన్ లో అమ్మే అంశంపై చోటు చేసుకున్న రగడ తెలిసిందే. ప్రభుత్వమే.. ఆన్ లైన్ టికెట్లను అమ్ముతానని చెప్పటం.. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయటం.. టికెట్లు అమ్మిన 20 రోజులకు డబ్బులు ఇస్తామని చెప్పటం లాంటి అంశాల్ని పలువురు తప్పు పడుతున్నారు. దీంతో.. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ …

Read More »

మోడీ ఆశలు వదిలేసుకున్నారా ?

ఇంతకాలం కేవలం ఏపీ విషయంలోనే నరేంద్రమోడి ఆశలు వదిలేసుకున్నదని అనుకుంటున్నారు అందరూ. కానీ తాజాగా తెలంగాణా విషయంలో కూడా బీజేపీకి పెద్దగా బతుకు లేదని కేంద్రంలోని పెద్దలకు అర్ధమైపోయినట్లుంది. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు గట్టి ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణాకు యూపీఏ కేటాయించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఫ్యాక్టరీ ఏర్పాటును ఉపసంహరించుకున్నట్లు పైకి ప్రకటించలేదు కానీ చేతల్లో …

Read More »

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై.. ఎంపీ ఆర్ఆర్ఆర్ షాకింగ్ నిర్ణ‌యం!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్‌పై మ‌రో 24 గంట‌ల్లో హైద‌రాబాద్‌లోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు.. తీర్పు వెలువ‌రించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ తీర్పు ఎలా ఉంటుంది? జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా? లేదా? ఒక‌వేళ ర‌ద్ద‌యితే.. ఏపీలో పాల‌న ప‌రిస్థితి ఏంటి? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు? జగ‌న్ జైలుకు వెళ్తారా? ఇలా.. అనేక ప్ర‌శ్న‌లు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే.. ఇంత‌లోనే ఈ …

Read More »

గర్ల్ ఫ్రెండ్ కావాలి సర్…. ఎమ్మెల్యేకి యువకుడి లేఖ..!

తమ సమస్యలను ప్రజా ప్రతినిధులకు చెప్పుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉంటుంది. తమ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని.. ఆ సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలంటూ..చాలా మంది ఎమ్మెల్యేలను, మంత్రులను కోరుతుంటారు. అయితే.. ఓ యువకుడు ఏకంగా.. తనకు గర్ల్ ఫ్రెండ్ లేదని.. వెతికి పెట్టాలంటూ కోరడం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ …

Read More »

మావోయిస్టు అగ్రనేతల్లో కలవరం

గతంలో ఎప్పుడూ లేనట్లుగా మావోయిస్టులు లొంగిపోవటంపై అగ్రనేతల్లో కలవరం పెరిగిపోతోంది. ఒకవైపు రిక్రూట్మెంట్ లేకపోవటంతో మావోయిస్టు ఉద్యమం బలహీనమైపోతోంది. ఇదే సమయంలో ఉన్నవారిలో కూడా లొంగిపోవాలనే ఆలోచనలు పెరిగిపోతుండటంతో అగ్రనేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుబాటులో ఉన్న సమాచరం ప్రకారం గడచిన రెండేళ్ళల్లో సుమారు 171 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారంతా కీలకమైన నేతలు కాకపోయినా వివిధస్ధాయిలో పనిచేసేవారే కావటం గమనార్హం. మావోయిస్టు అగ్రనేతలను ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే …

Read More »

సీఎం అభ్యర్థిగా ప్రియాంక ?

ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రకటించబోతున్నారా ? అంటే అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి చాలా ఉపయోగాలు ఉన్నాయని యూపీ నేతలు చాలా మంది భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో జరగబోయే ఎన్నికల వేడి ఇఫ్పటికే మొదలైపోయింది. అందుకనే అన్నీ పార్టీల కీలక నేతలు పదే పదే యూపీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక …

Read More »

జ‌గ‌న్ బాబాయ్ మ‌ళ్లీ ఆక్టివ్?

మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత సొంత పార్టీ పెట్టిన జ‌గ‌న్‌కు మొదటి నుంచి ఆయ‌న బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అండ‌గా నిలిచారు. అన్ని విధాలుగా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒంగోలు నుంచి ఆయ‌న విజ‌యం సాధించారు. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయ‌న‌.. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఎంతో కృషి చేశారు. దీంతో …

Read More »

ష‌ర్మిల‌ది ముందుచూపా? భ‌య‌మా?

Sharmila

రాజ‌న్న రాజ్యం తేవ‌డ‌మే లక్ష్య‌మ‌ని త‌న తండ్రి దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ ష‌ర్మిల‌కు ఆరంభం నుంచి ఆటుపోట్లు త‌ప్ప‌ట్లేదు. తెలంగాణ‌లో త‌న తండ్రి పేరుతో పార్టీ పెడితే వైఎస్‌కు విధేయులుగా కొన‌సాగిన నేత‌లు అభిమానులుగా ఉన్న కార్య‌క‌ర్త‌లు త‌న పార్టీలోకి పెద్ద సంఖ్య‌లో వ‌స్తార‌ని ఆశించిన ఆమె ఆశ‌లు తీర‌లేదు. పార్టీలోకి ఎలాంటి వ‌ల‌స‌లు చేరిక‌లు లేవు. కీల‌క నేత‌లు …

Read More »

అమ్మకానికి రైలు బోగీలు…అద్దెకైనా పర్వాలేదట

నరేంద్ర మోడీ సర్కార్ ప్రైవేటీకరణలో చాలా స్పీడు పెంచుతోంది. ఇందులో భాగంగానే రైళ్లతో పాటు రైళ్ళ బోగీలను అమ్మకానికి, లీజుకు, అద్దెకు కూడా ఇచ్చేయాలని రైల్వేశాఖ తాజాగా నిర్ణయించింది. తాజా నిర్ణయంతో పర్యాటక శాఖ, సినిమా రంగాల్లో బాగా అభివృద్ధి జరగటానికి అవకాశాలున్నట్లు కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది. రైళ్ళను, బోగీలను అద్దెకు ఇవ్వటం వల్ల సాంస్కృతిక, పర్యాటక, సినిమాతో పాటు మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో స్పీడ్ పెరుగుతుందని కేంద్ర రైల్వే …

Read More »

బొత్స కుర్చీకి ఢోకా లేదా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార వైసీపీలో జోరుగా సాగుతోన్న చ‌ర్చ ఒక‌టే.. అదే కొత్త‌గా ఏర్పాటు చేసే మంత్రివ‌ర్గంలో ఎవ‌రుంటారు? ఎవ‌రిపై వేటు ప‌డుతుంది? కొత్త‌గా ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంది? అని. రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని 2019 లో అధికారం చేప‌ట్టిన‌పుడే సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడా స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆ పార్టీ నాయ‌కుల్లో టెన్ష‌న్ పెరిగిపోతోంది. మంత్రులుగా ఉన్న వాళ్లు త‌మ ప‌ద‌వి ఉంటుందో లేదా …

Read More »

ప‌ల‌మ‌నేరు వైసీపీలో గ‌డ‌బిడ‌.. ఎందుకు?

చిత్తూరు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ప‌ల‌మ‌నేరు. కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం.. వైసీపీ వైపు మ‌ళ్లింది. దీంతో ఇక్క‌డ వైసీపీ వ‌రుస విజ‌యాలు సాధించింది. 2014లో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఎన్ అమ‌ర్నాథ్‌రెడ్డి.. వైసీపీలో వ‌చ్చి.. ఇక్క‌డ నుంచి పోటీ చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాక‌పోయినా.. ఇక్క‌డ అమ‌ర్నాథ్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల …

Read More »

నిజ‌మేనా? కేసీఆర్ అలా చేశారా? బండి కామెంట్ల‌ సంచ‌ల‌నం

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, పొలిటిక‌ల్‌ ఫైర్ బ్రాండ్ బండి సంజ‌య్ చేసిన తాజా వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. వాస్త‌వానికి అధికార పార్టీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంజ‌య్‌.. ప్ర‌స్తుతం ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేసీఆర్ స‌ర్కారుపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. సాధార‌ణ పొలిటిక‌ల్ విమ‌ర్శ‌ల‌కు భిన్నంగా తాజాగా ఆయ‌న చేసిన కొన్ని కామెంట్లు.. నిజంగానే కేసీఆర్ అలా చేశారా? …

Read More »