కాలం కంటే శక్తివంతమైనది మరొకటి ఉండదు. తిరుగులేని అధికారాన్ని చెలాయించిన వారు సైతం కాల మహిమతో తర్వాతి కాలంలో ఎదురయ్యే సవాళ్లకు చేష్టలుడిగిపోతారు. అప్పటివరకు వీర విధేయులుగా ఉన్నవారు సైతం ముఖం చాటేస్తుంటారు. ఇదంతా కాలమహిమ అనకుండా ఉండలేం. పదేళ్ల పాటు దేశాన్ని తన కంటిచూపుతో శాసించి.. ‘రిమోట్’ అనే పదానికి అసలుసిసలు అర్థంగా వ్యవహరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం …
Read More »జగన్ వ్యాఖ్యలపై వైఎస్ అభిమానుల ఆగ్రహం
వైసీపీ గ్రాఫ్ దిగజారుతోందా..? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కాదు.. ముఖ్యమంత్రిగా.. సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా దీనికి కారణం అవుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత వారం రోజుల్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు.. అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో.. జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యానికి గురి చేశాయని.. మేధావులు సైతం చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం …
Read More »జగన్ కుంభకోణం బయటపెడతా: నారా లోకేష్
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌కు సంబందించిన భారీ కుంభకోణాన్ని త్వరలోనే తాను బయట పెట్టనున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జగన్‌వి పదో తరగతి పాస్.. డిగ్రీ ఫెయిల్ తెలివి తేటలని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే వెళ్లిపోయినవే ఎక్కువని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో …
Read More »కంచుకోటలో చంద్రబాబుకు ఇన్ని తలనొప్పులా?
టీడీపీకి కంచుకోట లాంటి ఆ జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఈ జిల్లా.. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా.. కేరాఫ్‌గా మారి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇంతగా జిల్లాలో రాజకీయం రగులుతున్నా కూడా.. చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఏదైతే.. అదే అవుతుంది! అనే విధంగా ఒక నిర్ణయం తీసుకుని.. …
Read More »ఆ నియోజకవర్గంలో వైసీపీ కుమ్ములాటలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గ వైసీపీలో నాలుగు స్తంభాలట నడుస్తోంది. ఆది నుంచి ఇక్కడ వర్గ పోరుకు నెలవైనా అధిష్టానం హెచ్చరించినా కిందిస్థాయి కేడర్, వీటికి నాయకత్వం వహిస్తున్న నాయకులు బేఖాతర్ చేస్తున్నారు. జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో పార్టీ ఇక్కడ ఓటమి చెందడంతో నిలదొక్కుకోవడానికి మూడేళ్లుగా ముప్పు తిప్పలు పడుతూ ఉంది. జడ్పీ చైర్మన్ నేతృత్వంలో పార్టీ కేడర్, …
Read More »అభిమానులు కూడా ఎదిగిపోయారండోయ్
మన అభిమానులు కూడా ఎదిగిపోయారండోయ్ఒకప్పుడు తమిళ సినిమా చాలా ఉన్నత స్థాయిలో ఉండేది. దాన్ని అందుకోవడానికి తెలుగు సినిమాలు కష్టపడుతుండేవి. కానీ గత కొన్నేళ్లలో మొత్తం కథ మారిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అందరూ మన సినిమాల వైపే చూస్తున్నారు. మన ప్రమాణాలను అందుకోవడానికి కష్టపడుతున్నారు. తెలుగు సినిమాల ముందు తమిళ చిత్రాలు వెలవెలబోతున్నాయనే చెప్పాలి. ఐతే కేవలం ఇండస్ట్రీ మెరుగు పడితే సరిపోతుందా? అభిమానులు కూడా …
Read More »తెలంగాణలో ఒక్క ఎకరా ఏపీలో 3 ఎకరాలు
పేదల నొరు కొట్టి.. సంక్షేమ పథకాలను ఆపేసి.. జమీందారులకు.. బడా వ్యాపారులకు దోచి పెడతడట. ఇదేనా మీ పాలన? ఈ ఎనిమిదేళ్ల పాలనలో ప్రధానిగా మోడీ చేసిందేమిటి?.. అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సూటి ప్రశ్నలు సంధించారు. వికారా బాద్‌లో నిర్వహించిన సభలో ఆద్యంతం ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. సంక్షేమ పథకాలను ఉచితాలుగా చూస్తున్న ఘనత మోడీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా …
Read More »హుందా తనం కోల్పోతున్న ఏపీ పాలిటిక్స్
అది 1999. నరసాపురం పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా కనుమూరి బాపిరాజు పోటీ చేశారు. అదే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ నటుడు కృష్ణం రాజు బరిలో నిలిచారు. ఇద్దరు నాయకులు కూడా హోరా హోరీ ప్రచారం చేసుకున్నారు. ఒకరి కంటే ఒకరు.. రెండాకులు ఎక్కువగానే తిట్టిపోసుకున్నారు. విమర్శలు ప్రతివిమర్శలతో హోరెత్తించారు. ఎన్నికలు ముగిశాయి. కృష్ణం రాజు విజయం దక్కించుకున్నారు. బాపిరాజు ఓడిపోయారు. …
Read More »మోడీనే మన శతృవు: కేసీఆర్
ప్రధాని మోడీనే తెలంగాణకు ప్రధాన శత్రువని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రధాని మోడీ కేంద్రంగా నిప్పులు చెరిగారు. కేంద్రం అసమర్థత కారణంగానే తెలంగాణకు నీరు అందడం లేదని వ్యాఖ్యానించారు. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలలోని పొలాలకు కృష్ణా నీరు అందేలా చూసే బాధ్యత తనదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రధాని నెరవేర్చలేదని మండిపడ్డారు. దుర్మార్గమైన పాలకులను పారద్రోలి …
Read More »పంద్రాగస్టు వేళ మోడీ రిపీట్ చేసినవి ఇవే
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఇప్పటివరకు దేశ ప్రధానులుగా 15 మంది వ్యవహరించారు. ఇందులో దేశ మొదటి ప్రధానమంత్రిగా వ్యవహరించిన జవహర్ లాల్ నెహ్రూ అత్యధిక కాలం పాలించారు. స్వాతంత్య్రం వచ్చిన 1947 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 నుంచి ఆయన మరణించే 1964 మే వరకు ఆయన పాలనే సాగింది. 16 సంవత్సరాల 286 రోజులు ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత అత్యధిక కాలం …
Read More »పవన్ అంత ధైర్యం చేస్తారా?
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాకుండా ఎంఎల్ఏలు, ఎంపీలను టార్గెట్ చేస్తు కూడా మాట్లాడారు. పనిలోపనిగా జనాలందరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములకు వ్యతిరేకంగా జనాలు ఉద్యమించాలని పిలుపిచ్చారు. పవన్ పిలుపు ప్రకారం జనాలు ఉద్యమాలు చేసేదుండదు, ప్రభుత్వం స్కీములను ఆపేదుండదని అందరికీ తెలుసు. స్కీములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ తాను …
Read More »నిలకడ లేని నేతతో ఏ పార్టీకి ప్రయోజనం?
ఆయన సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి కూడా. కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు కూడా ఉంది. అయితే.. ఇవన్నీ.. నిన్నటి నిజాలు. కానీ..ఇప్పుడు ఆయన చుట్టూ.. నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారనే వాదన హల్చల్ చేస్తోంది. అంతేకాదు.. ఆయన వల్ల ఏ పార్టీకి ప్రయోజనం? అంటూ.. నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి .. కొత్తపల్లి సుబ్బారాయుడు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా సంధి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates