Political News

సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చే డబ్బులతో ఏం కొనాలో చెప్పేసిన కేసీఆర్

కరోనా వేళ.. ఎవరికి వారు వారికి తోచినంత మొత్తాన్ని విరాళాల రూపంలో అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఇలా వచ్చిన మొత్తాల్ని దేని కోసం వినియోగిస్తున్నారు? దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న క్వశ్చన్లు రావటం ఖాయం. సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున వస్తున్న నిధుల్ని దేని కోసం వినియోగించాలి? ఏమేం కొనాలన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.కరోనా వ్యాప్తిని నిరోధించే విషయంలోనూ …

Read More »

ఐటీ ఉద్యోగాలకు ఎసరు తప్పదు!

కరోనా విపత్తు వల్ల ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య కంటే ఈ లాక్ డౌన్స్ వల్ల మునుముందు రాబోయే తలనొప్పులే తీవ్రంగా ఉంటాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతూ ఉండగా ఐటీ రంగం దీనికి బాగా ఎఫెక్ట్ కానుంది. చాలా కంపెనీలు మూత పడే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.పలు ఐటీ సంస్థలు యూకే, యూఎస్ లో ఉండడం వల్ల, అవి కరోనా వైరస్ కి తీవ్రంగా నష్టపోవడం …

Read More »

గుడ్ న్యూస్.. కరోనాకు ఆ మందు పని చేస్తుందట

కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల చూసినా దీని గురించే చర్చ. ఈ మహమ్మారి ధాటికి రోజూ వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాదాపు 11 లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు. కొన్ని నెలల కిందటే బయటపడ్డ ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియను వివిధ దేశాలు చేపడుతున్నాయి.ఐతే ఆ పరిశోధనలు పూర్తయి.. వ్యాక్సిన్ బయటికి రావడానికి చాలా సమయం పట్టేట్లుంది. ఈలోపు అందుబాటులో ఉన్న మందులతోనే వివిధ …

Read More »

దేశమంతా కరోనా భయంలో ఉండగా..

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి దృష్టి కరోనా వైరస్ మీదే ఉంది. ఇండియాలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మున్ముందు మరింత విపత్కర పరిస్థితులు తలెత్తుతాయన్న అంచనాల నేపథ్యంలో వ్యవస్థలన్నీ ఆ మహమ్మారిని నిలువరించే పనిలోనే నిమగ్నమయ్యాయి. ప్రధాన మంత్రి సహా మంత్రి వర్గం అంతా దీని మీదే దృష్టిసారించింది. సైన్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొంతమంది సిబ్బందిని విధుల నుంచి దూరం పెట్టారు. ఇలాంటి సమయంలో ఇండియా మీద …

Read More »

నిమ్మగడ్డ కాపాడింది బాబుని కాదు రాష్ట్రాన్ని !!

కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకున్న దేశాలన్నీ ఏమవుతున్నాయో ప్రపంచం కళ్లారా చూస్తోంది. ఒక ఇటలీ.. ఒక అమెరికా.. ఒక స్పెయిన్ ఎంత మూల్యం చెల్లించాయో.. ఇప్పుడు చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు కూడా లేక ఎలా హాహాకారాలు చేస్తున్నాయో చూస్తున్నాం. త్రుటిలో తప్పింది కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి పరిస్థితినే ఈ సరికి ఎదుర్కొంటుండేది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కాస్త ముందే స్పందించి ఏపీలో స్థానిక …

Read More »

షాకింగ్ రిపోర్టు: ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు ఫట్

కంటికి కనిపించని కరోనా వైరస్ కారణంగా ఆ దేశం.. ఈ దేశం అన్నది తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. సంపన్న దేశాల్లోనూ ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరోనాను వెనువెంటనే కంట్రోల్ చేయాలని.. లేని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా  కోట్లాది కొలువులు పోవటం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.కరోనాను కంట్రోల్ చేసేందుకు వివిధ దేశాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటిస్తున్నాయి. దీంతో …

Read More »

మన్మోహన్, సోనియాలకు ప్రధాని ఫోన్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రాజకీయ నాయకుల మధ్య గోడలు కూలిపోతున్నారు. అంతరాలు చెరిగిపోతున్నాయి. ఈ సమయంలో రాజకీయ వైరుధ్యాల్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకుపోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనాపై పోరులో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి కూడా సలహాలు తీసుకుంటున్నారు. సంప్రదింపులు జరుపుతున్నారు.తాజాగా ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీలకు ఫోన్ చేసి మాట్లాడటం …

Read More »

లాక్ డౌన్ సెప్టెంబర్ వరకునా? మీకో దండం సామి!

భారత్‌లో ఏప్రిల్ 14 దాకా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే 72 మంది ప్రాణాలు కోల్పోగా 2300లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దేశంలో కేసులు పెరుగుతున్నప్పటికీ దేశంలో లాక్ డౌన్ దాదాపు ఏప్రిల్ 14న ముగుస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొన్ని మీడియా సంస్థలు లాక్ డౌన్ ఆంక్షలు సెప్టెంబర్ మాసం దాకా పొడగించే అవకాశం ఉందని జనాలను …

Read More »

లాక్ డౌన్ పొడిగింపు తప్పదా? అయితే ఎన్ని రోజులు?

కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కారు.. దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క రోజుల పాటు లాక్ డౌన్ ను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా వేసుకున్న అంచనా వర్క్ వుట్ అయినప్పటికీ.. ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన మర్కజ్ వ్యవహారంతో ఇప్పుడు లెక్కలన్ని తప్పుతున్నాయి.విదేశాల నుంచి వచ్చిన వారి కారణంగా పెరుగుతున్న కరోనా కేసుల్ని కంట్రోల్ చేసేందుకు వీలుగా లాక్ …

Read More »

బయటికెళ్తున్నారా… ఈ రూల్ తెలుసుకోండి

దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి, ఎవ్వరూ ఇళ్లు దాటి బయటికి రావద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా… చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. అలాంటివారి కోసం మరో సరికొత్త రూల్ అమలులోకి తెచ్చారు తెలంగాణ పోలీసులు. ఎవ్వరైనా బయటికి వచ్చి, మూడు కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే, వారిని గుర్తించి భారీ జరిమానా విధించబోతున్నారు.హైదరాబాద్ నగరంలో 250 జంక్షన్లలో కొన్ని వేల సీసీ కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా వాహనాల …

Read More »

కరోనా తగ్గిందని పార్టీ ఇచ్చాడు.. మళ్లీ వచ్చింది

ఇండియాలో కరోనా కేసులు వందకు చేరువగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌లో ఆ కేసులు 20 లోపే ఉన్నాయి. ఐతే ఇప్పుడు ఇండియాలో కరోనా కేసులు 600 దాటగా.. పాకిస్థాన్‌లో రెట్టింపు సంఖ్యలో కరోనా బాధితులుండటం గమనార్హం. దీన్ని బట్టి పాకిస్థాన్‌లో ఈ వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలిసిందే.భారత్‌లోనే జనాలు ప్రభుత్వ సూచనల్ని ఆశించిన స్థాయిలో పాటించట్లేదు. నిర్లక్ష్య వైఖరితో కేసులు పెరిగేందుకు కారణమవుతున్నారు. ఇక పాకిస్థాన్‌లో పరిస్థితి ఎలా …

Read More »

కరోనా బాధితుడిని వెతకడానికి పోలీసు బృందం

కరోనా వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడెవరు ఎలా వ్యవహరిస్తారో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే గుంటూరులోచోటు చేసుకుంది. గుంటూరు పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఒకవ్యక్తిని కరోనా అనుమానాలు ఉండటంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.అతనికి పరీక్షలు జరిపిన వైద్యులు.. ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో.. ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం అర్థరాత్రి వేళ.. …

Read More »