సినిమా వేరు, రాజకీయం వేరు అని అనుకున్న ప్రతి సందర్భంలోనూ జగన్ మరియు పవన్ మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. కానీ సినిమా పరంగా పవన్ ను ఇప్పటికిప్పుడు ఢీ కొనేంత శక్తి జగన్ కు లేదు గాక లేదు. ఇదే సమయంలో రాజకీయంగా జగన్ ను ఢీ కొన్నా పవన్ ఆశలు అనుకున్నంత సులువుగా నెరవేరవు గాక నెరవేరవు. అయినా కూడా ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
ఏపీలో టికెట్ ధరలు తగ్గించి, తరువాత మెగాస్టార్ బృందం విజ్ఞప్తి మేరకు సవరించినప్పటికీ జీఓ అయితే ఇవ్వలేదు.ఆ విధంగా పవన్ పై జగన్ పై చేయి సాధించారు. అయినప్పటికీ సినిమా ఓపెనింగ్స్ కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ ఎంతో బాగున్నాయి.ఆ విధంగా చూసుకుంటే సినిమాల పరంగా పవన్ ను జగన్ నిలువరించడం కష్టసాధ్యం అనితేలిపోయింది. ఇక రాజకీయాల విషయానికే వస్తే పవన్ ఇంకా ఎదిగే క్రమంలో ఉన్నారు.
పార్టీ ప్రారంభించాక రెండు సార్లు సార్వత్రిక ఎన్నికలకు పోయినప్పటికీ ఇప్పటికీ పెద్దగా నిలదొక్కుకోలేదు. 14 మార్చి 21014న ప్రారంభం అయిన జనసేన పార్టీ అవశేషాంధ్రకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ రోజు టీడీపీతో పొత్తులో భాగంగానే ఉండిపోయారు. తరువాత 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో వెళ్లినప్పటికీ అనుకున్న ఫలితాలు ఏవీ సాధించలేకపోయారు.ఆ విధంగా పవన్ రెండు చోట్ల (భీమవరం,గాజువాక) పోటీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.
అదే సందర్భంగా వైసీపీ రాజకీయంగా బాగా నిలదొక్కుకుంది. విభజిత ఆంధ్రాలో మొదటి సారి అరవైకి పైగా సీట్లు తెచ్చుకుని బలమైన విపక్షంగా నిలబడింది. తరువాత 2019 ఎన్నికల్లో 151 సీట్లు తెచ్చుకుని తిరుగులేని రాజ్యాధికారం దక్కించుకుంది.ఈ ఎన్నికల్లో జనసేన జగన్ సేనను నిలువరించలేక ఒక్కటంటే ఒక్క సీటుకే పరిమితం అయింది.ఆ విధంగా రాజకీయంగా జగన్ ఎదిగి పవన్ ను నిలువరిస్తున్నారు. సినిమాల పరంగా పవన్ ఎదిగి జగన్ కు సవాల్ విసురుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates