గత కొద్దికాలంగా మీడియాలో ప్రముఖంగా కనిపించకుండా తన పని తాను చేసుకుపోవడం అన్నట్లుగా సాగుతున్న ఫైర్‌బ్రాండ్ నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్‌గా ఫార్మా కంపెనీకి రూ. 140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. ఆయన డైరెక్టర్‌గా చేరిన లక్సాయ్ …
Read More »బిగ్ బ్రేకింగ్ : లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం
అందరూ ఊహించినట్టే జరిగింది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీతో రెండో లాక్ డౌన్ గడువు ముగియనుండగా… తాజాగా దానిని మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే మరో 14 రోజులు లాక్ డౌన్ పొడిగించినట్లు అర్థమవుతోంది. కేంద్రం ఎన్ని పాజిటివ్ కౌంట్లు వేసినా దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. …
Read More »లాక్ డౌన్ ఉల్లంఘన..ఆ వైసీపీ ఎమ్మెల్యేలపై పిల్
కరోనాను కట్టడి చేసే ఏకైక ఉద్దేశంతోనే కఠినంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 1.0 సత్ఫలితాలనివ్వడంతో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిరోధించేందుకు లాక్ డౌన్ 2.0ని విధించక తప్పలేదు. లాక్ డౌన్ సమయంలో బయట తిరగకూడదని…సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వం, పోలీసులు మొత్తుకుంటున్నారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజా ప్రతినిధులు కూడా కొంత …
Read More »లాక్ డౌన్ … కరోనా కంటే పెద్ద వైరస్ – నిపుణులు
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నది… మన వద్ద పాపులర్ సామెత. కరోనా, లాక్ డౌన్ లకి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. మొదటి లాక్ డౌన్ మన దేశం చాలా తెలివిగా విధించింది. సరైన సమయంలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఉద్యోగాలు పోయాయి. కోట్ల మందికి కూలీ పోయింది. అయినా పర్లేదు. ఎందుకంటే… ఆ లాక్ డౌన్ వల్ల కరోనా ఎంత పెద్ద ప్రమాదమో ప్రజలకు …
Read More »ట్విట్టర్లో అన్‌ఫాలో… అసలు విషయం చెప్పిన అమెరికా
భారత ప్రధాని నరేంద్రమోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి వైట్ హౌస్ అన్‌ఫాలో చేయడం సంచలనమైంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్.. మోదీని తన ట్విట్టర్ ఖాతా నుంచి అన్‌ఫాలో చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అమెరికా, ఇండియా మధ్య రిలేషన్ దెబ్బతినిందని, అందుకే ఇలా జరిగిందని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. తాము కొద్దిరోజుల పాటే, ప్రత్యేక …
Read More »కేటీఆర్ చెప్పేశాడు…లాక్ డౌన్ ఖేల్ ఖతం
తెలంగాణలో లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వం ఏం చేయనుంది? గతంలో కేంద్రంతో విబేధించి లాక్ డౌన్ కొనసాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు మే 7వ తేదీ తర్వాత కూడా అదే రీతిలో సొంతంగా ముందుకు సాగనుందా? అనే ఆసక్తి, ఉత్కంఠ సర్వాత్రా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న …
Read More »జగన్ ను సమర్థించిన జేడీ లక్ష్మీనారాయణ
నిజాల్ని నిర్మోమాటంగా మాట్లాడినా.. తప్పు మాట్లాడినట్లుగా కామెడీ చేయటం చూస్తుంటాం. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే తీరులో ఉంది. కరోనా విషయంలో ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యపైనా విమర్శ వినిపిస్తోంది. ఆయన మాటల్ని తప్పు పట్టేలా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా కరోనా వైరస్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేక ప్రచారం ఏ స్థాయిలో …
Read More »ఆదివారం చికెన్.. మటన్.. బ్యాన్
కరోనా కావొచ్చు.. దాని బాబాయ్ కావొచ్చు. వేళ ఏదైనా.. సందర్భం మరేదైనా సరే. ఆదివారం వస్తే చాలు.. కాసింత చికనో.. మటనో తింటే అదో లెక్క. ఎంత లాక్ డౌన్ అయితే మాత్రం పస్తులుంటామా? కరోనా పుణ్యమా అని బయటకు వెళ్లలేని వేళ.. ఇళ్లల్లోనే బంధీలుగా మారిపోయిన దుస్థితి. కలలో కూడా ఊహించని రీతిలో వారాలకు తరబడి ఇళ్లలోనే ఉంటున్న వారికి.. వారాంతం వస్తే చాలు.. కూసింత చికనో.. కాసింత …
Read More »చరిత్రలో తొలిసారి ఈనాడులో అలా జరిగిందట
ఊహించని పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటంలో ఈ మాయదారి వైరస్ తీరు వేరుగా చెప్పక తప్పదు. ఒక్క బుల్లెట్ పేలకుండా.. ఒక్క బాంబు విసరకుండా ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లిపోయేలా చేసిన ఘనత కరోనాకే దక్కుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. …
Read More »తెలంగాణలో మళ్లీ డేంజర్ బెల్ మోగింది
వరుసగా సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతూ వస్తున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కసారిగా 22 కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా మరణాలు సంభవించలేదు. ఈరోజు ఏకంగా ముగ్గురు చనిపోయారు. వీరంతా హైదరాబాదుకు చెందినవారే. అయితే, ఆ ముగ్గురుకి ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. వారం తర్వాత కేసుల విజృంభణతో మళ్లీ ఇక్కడ కంగారు మొదలైంది. అయితే, చిన్న ఆశావహ పరిణామం ఏంటంటే…. ఈరోజు …
Read More »కాషాయం పులిమేసుకుంటున్న పవన్
భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు ఇరువురికీ ఉభయ తారకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. పరస్పర సహకారంతో రెండు పార్టీలు బలపడతాయని.. జగన్ సర్కారును దీటుగా ఎదుర్కొంటాయని భావించారు. కానీ బీజేపీకి సహకరించే విషయంలో పవన్ ఎంతో సిన్సియర్‌గా కనిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ నుంచి పవన్‌కు, జనసేనకు ఏమాత్రం సహకారం అందుతోందన్నది ముందు నుంచి సందేహంగానే ఉంది. పవన్ చేసే పోరాటాలకు భాజపా రాష్ట్ర స్థాయి నుంచి కానీ, కేంద్ర …
Read More »కరోనా వేళ.. మరో రంగుల రచ్చలో ఏపీ సర్కార్?
మిగిలిన రోజుల్లో రాజకీయం ఎలా ఉన్నా.. అత్యవసర వేళల్లో అందునా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా అవకాశం ఇవ్వటంతోపాటు..ఏపీ సర్కారుకు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్యనే పంచాయితీ కార్యాలయాలకు ఏపీ అధికారపక్ష జెండా రంగుల్ని పోలి ఉండేలా రంగులు వేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. …
Read More »