ఒక చిన్న మున్సిపాలిటి విషయంలో ప్రభుత్వం, అధికారపార్టీ అనవసరంగా గబ్బుపడుతోంది. కృష్ణాజిల్లాలోని కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ పదవిని అందుకునే విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానం ఎంతమాత్రం సరికాదు. 29 వార్డులున్న కొండపల్లి మున్సిపాలిటిలో వైసీపీ-టీడీపీలకు చెరో 14 వార్డులు దక్కాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన ఒక కౌన్సిలర్ టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఇదికాకుండా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా కొండపల్లి మున్సిపాలిటిలో …
Read More »శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలనుకుంటున్న బీజేపీ
గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం అమ్మటంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలను ప్రభుత్వం తీసుకున్నది అని కాకుండా స్ధానిక సంస్ధలు తీసుకున్నాయనే కలరింగ్ ఇస్తోంది బీజేపీ. ఇంతకీ విషయం ఏమిటంటే గుజనాత్ లో కొద్దిరోజులుగా మాంసాహారంపై స్ధానికంగా గొడవలు మొదలయ్యాయి. మాంసాహార వంటలను, స్నాక్స్ ను అమ్మే రోడ్డుపక్క బండ్లు, షాపులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే గుజరాత్ మొత్తాన్ని శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలన్న అధికార పార్టీ ఆలోచనే …
Read More »జగన్ ఆయన్ను బాగా వాడుతున్నారుగా… న్యాయం జరిగేనా..?
వైసీపీ సీనియర్ నాయకుడు.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గురించి వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. షార్ప్ షూటర్‌గా ఆయన అనేక విజయాలు సాధించారు. గత 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్.. సత్తాతో పార్టీ విజయం సాధించింది. ఎక్కడికక్కడ విజయం దక్కించుకుంది. ఆ ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. దీంతో పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా విజయం దక్కించుకున్నారు. జగన్‌పై సింపతీ కావొచ్చు.. ఏదైనా కావొచ్చు.. పార్టీ …
Read More »అయితే.. ఈ సారి మంత్రి వర్గంలోనూ మహిళలకే పెద్దపీట..!
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యాలు మారుతున్నాయా ? ఇప్పటి వరకు గడిచింది ఒక ఎత్తు.. ఇక నుంచి గడిచేది మరో ఎత్తు..! అనే వ్యూహంతో జగన్ ముందుకు సాగుతున్నారా ? అంటే.. అవుననే అంటున్నారు అత్యంత విశ్వసనీయులైన నాయకులు. ఇప్పటి వరకు జగన్ చేసిన రాజకీయ పోరు ఒక ఎత్తు. అయితే.. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఎదుర్కొనబోయే ముఖ చిత్రం మరో ఎత్తుగా ఉంటుందని భావిస్తున్నారు. …
Read More »కవర్ చేయబోయి దొరికిపోయిన జగన్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు అందరినీ ఆందోళనలోకి నెడుతున్నాయి. నెలా నెలా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడానికి కూడా జగన్ సర్కారు కిందా మీదా పడిపోతుండటం.. ఇతరత్రా చెల్లింపులు, బిల్లుల విషయంలో చేతులెత్తేస్తుండటం.. ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేకపోతుండటం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఏపీలో చాలా చోట్ల రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నా వాటికి మరమ్మతులు …
Read More »బుగ్గన మాటలకు మామూలు పంచ్ పడలేదుగా?
వాస్తవం అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని వదిలేసి.. తమకు నచ్చినట్లుగా విషయాల్ని చెప్పటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. గతంలో ఇలాంటి తీరు ఉండేది కాదు. ఏదైనా విషయాన్ని మసిపూసి మారేడు కాయ మాదిరి చేయాలంటే పాలకులు సవాలచ్చ ఆలోచించేవారు. ఒకవేళ.. వారి నోటి నుంచి వచ్చిన తప్పుడు మాటను నిలదీస్తే ఆత్మరక్షణలో పడేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. ఒకవేళ.. అలాంటి వ్యాఖ్యల్లోని తప్పుల్ని ఎత్తి …
Read More »ఇసుక మాఫియా కోసం డ్యామ్ గేట్లు ఎత్తలేదా?
భారీ వర్షం కురిసింది. వరద పోటు తలెత్తింది. ఇప్పటివరకు వరద పోటు బారిన పడిన జిల్లాలుగా వినని కడప.. చిత్తూరు.. అనంతపురం.. నెల్లూరు జిల్లాలు ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి కడప జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు.. వరద పోటు కారణంగా గ్రామాలకు గ్రామాలు వరదల్లో చిక్కుకుపోవటం.. పెద్ద ఎత్తున బాధితులు గల్లంతు కావటం లాంటివి తెలిసిందే. ఇంతకూ ఇదంతా ఎందుకు జరిగింది? అన్నది …
Read More »రాష్ట్రమంతా పాదయాత్రలట
అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలనే డిమాండ్ తో తొందరలోనే రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని అమరావతి జేఏసీ డిసైడ్ చేసింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కంటిన్యూ చేయాలని డిమాండ్ తో ఆందోళనకారులు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి జేఏసీ నేతలు కావలిలో మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల బిల్లులో లోపాలున్నాయన్న కారణంగానే హఠాత్తుగా ఉపసంహరించుకున్నట్లుగా మండిపడ్డారు. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహిరంచుకుంటున్నట్లు తెలియగానే సోమవారం ఉదయం పాదయాత్రలో …
Read More »జగన్ చేసిన తప్పేంటో తెలుసా ?
పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎత్తి చూపారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్ గా అయిపోయేదాన్ని పెద్ద సమస్యగా తయారు చేసుకున్నట్లు ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లోనే మూడు రాజధానులు అని జగన్ చెప్పటంతోనే సాంకేతిక, న్యాయ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జస్టిస్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా వైజాగ్, …
Read More »బండిని ఆపేందుకు కేసీఆర్ అడుగులు
తెలంగాణలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్‌కు ప్రస్తుతం ప్రతిపక్షాల నుంచి సవాలు ఎదురవుతుందంటే అందుకు బండి సంజయ్ ప్రధాన కారణం. ఏడేళ్లుగా తిరుగులేని కేసీఆర్‌కు సంజయ్ కొరకరాని కొయ్యలా మారారు. గతేడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ కరీంనగర్ ఎంపీ.. దూకుడు పెంచారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలతో మరింత …
Read More »మళ్లీ మెలిక ఎందుకు? జగన్‌కు పవన్ సూటి ప్రశ్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై జనసేనాని పవన్ తీవ్రస్థాయిలో కామెంట్లు కుమ్మరించారు. మూడు రాజధానుల ఏర్పాటు, సి.ఆర్.డి.ఏ. రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి కూడా.. మళ్లీ ప్రజలను అయోమయంలోకి నెట్టేశారని విమర్శించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ చేస్తున్నదంతా కూడా.. కోర్టు కళ్లకు గంతలు కడుతున్నట్టుగా ఉందని దుయ్యబట్టారు. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామనడం వెనుక వ్యూహం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసులలో …
Read More »అమరావతి అడుగులు ఇలా… 2014 టు 2021
ఏపీ రాజధాని అమరావతి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని వికేంద్రీకరిస్తూ మూడు రాజధానులు చేశారు. ఇక ఈ రోజు మూడు రాజధానులను రద్దు చేస్తూ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు అమరావతి రాజధానిగా 2014 – 2021 సంవత్సరాల మధ్య ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. 2014లో నవ్యాంధ్ర …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates