గాంధీకుటుంబమే అసలైనా సమస్యా?

అవును కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే బలము, బలహనీత. దేశంలోని 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రోజుల్లో గాంధీ కుటుంబానికి మించిన నాయకత్వం మరోటి లేదని సీనియర్లంతా భజనలో ముణిగిపోయారు. ఇపుడు చాలా రాష్ట్రాల్లో  దెబ్బతింటున్నపుడు నాయకత్వానికి గాంధీకుటుంబం పనికిరాదంటు ఇదే సీనియర్లు గోల గోల చేస్తున్నారు. సరైన నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించటంలో గాంధీకుటుంబం ఫెయిలైందనే చెప్పాలి.

దశాబ్దాల తరబడి గులాంనబీ ఆజాద్, జై రామ్ రమేష్, చిదంబరం, కపిల్ సిబల్, ఆనందశర్మ, హరీష్ రావత్, కమలనాద్, అశోక్ గెహ్లాట్ లాంటి ఎందరో సినియర్లు దశాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయున్నారు. వీళ్ళంతట వీళ్ళు పదవుల్లో నుండి తప్పుకోరు, గాంధీ కుటుంబం వీళ్ళని తప్పించలేందు. దీని కారణంగా కొత్త నాయకత్వం, యువనాయకత్వం తయారుకాలేకపోయింది. అధికారంలో ఉన్నంతకాలం అన్నీరకాల పదవులను అనుభవించి ఇపుడు ఏకంగా గాంధీకుటుంబాన్నే విమర్శిస్తున్నారు సీనియర్లు.

పార్టీ ప్రస్తుత దుస్ధితికి సోనియా, రాహుల్, ప్రియాంకలు కూడా కారణమనే చెప్పాలి. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి రావటానికి గాంధీకుటుంబం చేతకానితనమే కారణం, పంజాబ్ లో అధికారంలో ఉండికూడా ఓడిపోవటానికీ గాంధీకుటుంబమే కారణం. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్యసింథియాను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుంటే ప్రభుత్వం కూలిపోయేదికాదు. పంజాబ్ లో పీసీసీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ విషయంలో కఠినంగా ఉండంటే మరీ ఇంత ఘోరమైన ఓటమి ఎదురయ్యేదికాదేమో.

ఇక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా ఇంకా అధ్యక్షస్ధానంలో సోనియాయే కంటిన్యు అవుతున్నారంటే అందుకు రాహులే కారణం. సీనియర్ల విషయంలో కఠినంగా ఉండలేకపోవటం, కొత్తనాయకత్వాన్ని, యువనాయకత్వాన్ని ప్రోత్సహించలేకపోయారు. విచిత్రం ఏమిటంటే ఓట్లు వేయటానికి జనాలు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీయే వద్దుపొమ్మంటోంది. నరేంద్రమోడీకి ప్రత్యామ్నం తానేఅని జనాల్లో నమ్మకం కలిగించటంలో రాహుల్ ఫెయిలయ్యారు. ఇప్పటికైనా ముణిగిపోయిందేమీలేదు నిర్ణయాలు తీసుకోవటంలో కఠినంగా ఉంటే ముందు పార్టీ నాయకత్వం తర్వాత జనాల్లో కచ్చితంగా నమ్మకం పెరుగుతుంది.